Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» గుంటూరు

గుంటూరు - చదువుల నగరం

22

బే ఆఫ్ బెంగాల్ నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నగరం దక్షిణ భారత రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ లో ఉంది.   హైదరాబాద్ నగరానికి  కి ఆగ్నేయంలో సుమారు 266 కిలోమీటర్ల దూరంలో ఈ నగరం ఉంది. 2012 లో గుంటూరు నగరం పరిసరాల్లో ఉన్న పది గ్రామాలని గుంటూరు లో కి కలిపి దీనిని   అతి పెద్ద నగరంగా ఈ నగరం యొక్క హద్దులని విస్తరింపచేసారు.

అభ్యాసం మరియు పరిపాలనకి మూల స్థానం అవడం వల్ల ఈ నగరం ఒక  ప్రధాన నగరంగా పరిగణించబడుతుంది. రాష్ట్రం లో అభివృద్ధి చెందిన నగరాలలో ఒకటిగా గుర్తించబడిన ఈ నగరం లో ఎన్నో విద్యాసంస్థలు అలాగే పరిపాలనా సంస్థలు ఉన్నాయి.

ప్రాచీనత మరియు నూతనత్వం

గుంటూరు నగరానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. క్రీస్తు పూర్వం 500 ఈ నగరం యొక్క చరిత్ర ఉంది. ఇంత సుదిర్ఘమైన చరిత్ర మూలాలు కలిగిన నగరం ఏదీ దక్షిణ భారత దేశంలో కనబడదు. ఇంతకు పూర్వం భట్టిప్రోలు అనే రాజ్యం ప్రస్తుతం గుంటూరు అనబడే ప్రాంతం లో ఉండేది. ఈ విషయం 922 నుండి 929 ఈ ప్రాంతాన్ని పాలించిన వేంగి చాలుక్యాన్ రాజు మొదటి అమ్మరాజా కి చెందిన శిల్పాలు అలాగే చెక్కడాలలో నిరూపితమయ్యింది. 1147 నుండి 1158 సమకాలిన ప్రాంతానికి సంబంధించిన శిల్పాలలో గుంటూరు పేరు కూడా చెప్పబడినది. ఈ శిల్పాల ద్వారా గుంటూరు నగరం ఇదివరకు గార్థపూరి అనే సంస్కృత పేరు తో పిలువబడినదని తెలుస్తోంది. గార్థపూరి అంటే చుట్టూ సరస్సులచే కప్పబడిన ప్రాంతం అని అర్ధం.

యూరోపెయన్ ల రాకతో గుంటూరు నగరం యొక్క ఆధునిక చరిత్ర ప్రారంభమయ్యింది. ఇది ఒక కొత్త శకానికి దారి తీసింది. తద్వారా జాతీయ, అంతర్జాతీయ ప్రాముఖ్యత ఈ గుంటూరు నగరానికి లభించింది. నిజానికి ఈ నగరం యొక్క అభివృద్దికి ఆశ్చర్యపోయిన ఫ్రెంచ్, వారి సైనికదళాల ప్రధాన కేంద్రంగా 1752 లో గుంటూరు ని ఎంచుకున్నారు. ఆ తరువాత, నిజాముల చేత అలాగే హైదర్ అలీ చేత ఈ నగరం పాలించబడినది. 1788 లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ వారు తమ సామ్రాజ్యం గా చేసుకున్నారు. బ్రిటిష్ వారి పరిపాలనలో ఈ ప్రాంతం ముఖ్య వ్యవసాయక కేంద్రంగా తయారయింది. అందువల్ల 1890 లో రైల్వే ట్రాక్స్ పడ్డాయి. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఈ నగరం యొక్క అభివృద్ధి ఇప్పటివరకూ కొనసాగుతూనే ఉంది. గుంటూరు లో సాంకేతిక అభివృద్ధి అలాగే విద్యా అభివృద్ధి తో ఎన్నో దక్షిణ భారత నగరాలు పోటీ పడలేకపోతున్నాయి.

గుంటూరులో పర్యాటక రంగం

ప్రధాన పర్యాటక ఆకర్షణ గా గుంటూరు ప్రాంతాన్ని పరిగణించవచ్చు. కొండవీడు కోట, ఉండవల్లి కేవ్స్, అమరావతి, ఉప్పలపాడు గార్డెన్స్ అలాగే ప్రకాశం బ్యారేజ్ లు గుంటూరులో ఉన్న కొన్ని ప్రధాన పర్యాటక ఆకర్షణలు.

రాష్ట్రం లో ఉన్న మరికొన్ని నగరాల లాగానే గుంటూరు లో కూడా ఉష్ణమండల వాతావరణం ఉంది. ఎండాకాలంలో తీవ్రమైన ఎండ, తేలికపాటి శీతాకాలం ఇక్కడ గమనించవచ్చు. వర్షాకాలంలో సాధారణ వర్షపాతం నుండి భారీ వర్షపాతాన్ని ఇక్కడ గమనించవచ్చు.

గుంటూరులో విమానాశ్రయం లేదు. ఇక్కడికి దగ్గరలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం. దీనికి స్థానిక విమానాశ్రయం 96 కి. మీ. ల దూరంలోని విజయవాడ లో కలదు.  రైలు మరియు రోడ్డు మార్గం ద్వారా గుంటూరు నగరాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఇక్కడున్న రైల్వే స్టేషన్ దేశంలో ని మిగిలిన ప్రాంతాలకి చక్కగా అనుసంధానమై ఉంది. ఢిల్లీ, కోల్ కత్తా, ముంబై, చెన్నై, హైదరాబాద్ అలాగే బెంగుళూరు వంటి మెట్రో పోలిటన్ నగరాల నుండి గుంటూరు కి రైళ్ళు అందుబాటులో కలవు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకి అలాగే మిగతా రాష్ట్రం లోని ప్రాంతాలకి ఈ నగరం చక్కగా అనుసంధానమై ఉంది.

గుంటూరు ప్రధాన పర్యాటక మజిలీ కావడం వల్ల పర్యాటక మాసాలలో ఈ ప్రాంతానికి ఎంతో మంది పర్యాటకులు తరలి వస్తుంటారు. అందువల్ల, పర్యాటకుల అవసరాలను అందుకోవడానికి సుదూరాల నుండి ఎన్నో నూతన రైళ్ళను దక్షిణ రైల్వేశాఖ గుంటూరు నగర సందర్శకుల కోసం ఏర్పాటు చేసింది. ఈ నగరంలో రోడ్లని చక్కగా నిర్వహించడం వల్ల ప్రైవేటు వేహికల్ ప్రయాణం కూడా బాగుంటుంది. ఈ నగరానికి తిరిగే బస్సులు ఎన్నో. సాధారణ బస్సుల కంటే డీలక్స్, వోల్వో బస్సుల ధరలు ఎక్కువగా ఉంటాయి.

గుంటూరు ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

గుంటూరు వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం గుంటూరు

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? గుంటూరు

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కి గుంటూరు నగరం ప్రధాన కేంద్రం. అందువల్ల, ఇక్కడ లభించే బస్సు సర్వీసులు అమోఘం. చెన్నై, కోల్ కత్తా అలాగే హైదరాబాద్ వంటి ఎన్నో జాతీయ రహదారులు ఈ గుంటూరు నగరానికి కలుస్తాయి. హైదరాబాద్ రహదారి ద్వారా ఢిల్లీ మరియు ముంబై నగరాలకు చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం గుంటూరులో ఉన్న రైల్వే స్టేషన్ అన్ని ప్రధాన నగరాలకు అలాగే పట్టణాలకు చక్కగా అనుసంధానమై ఉండడానికి గల కారణం దక్షిణ రైల్వే శాఖ యొక్క నిర్వహణ. గుంటూరు లో ఢిల్లీ, బెంగుళూరు, ముంబై, చెన్నై, కోల్ కత్తా, హైదరాబాద్ ఇంకా విజయవాడ వంటి ఎన్నో పట్టణాల నుండి రోజువారి రైళ్ళ రాకపోకలు ఉన్నాయి. టాక్సీ , బస్సు లేదా ఆటో రిక్షాల సేవలు ఈ రైల్వే స్టేషన్ సమీపంలో లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం గుంటూరు లో విమానాశ్రయం లేదు. స్థానిక ఎయిర్ పోర్ట్ విజయవాడ లో కలదు. ఇది 96 కి. మీ. ల దూరం ఇక్కడికి చేరువలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ విమానాశ్రయం. హైదరాబాద్ లో ఉన్న ఈ విమానాశ్రయం ఎన్నో ప్రధాన నగరాలకి అలాగే పట్టణాలకి చక్కగా అనుసంధానమై ఉండడమే కాకుండా అంతర్జాతీయంగా కూడా అనుసంధానమై ఉంది. ఇక్కడ నుండి ఒక ప్రైవేటు టాక్సీ ద్వారా గుంటూరు కి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుండి గుంటూరు కి చేరుకునేందుకు సుమారు నాలుగున్నర గంటల సమయం పడుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu