మానస్ నేషనల్ పార్క్, గువహతి

హోమ్ » ప్రదేశములు » గువహతి » ఆకర్షణలు » మానస్ నేషనల్ పార్క్

అస్సాం రాష్ట్రం లో ని పేరొందిన నేషనల్ పార్క్స్ ల లో ఒకటి మానస్ నేషనల్ పార్క్. UNESCO నాచురల్ వరల్డ్ హెరిటేజ్ సైట్ గా ఈ ప్రాంతం ప్రకటించబడింది. ఇందులో ప్రాజెక్ట్ టైగర్ రిజర్వ్, బయోస్ఫియర్ రిజర్వ్ ఇంకా ఎలిఫెంట్ రిజర్వ్ కలవు. హిమాలయాల పాద ప్రాంతం లో ఉన్న ఈ ప్రాంతం భూటన్ వరకు విస్తరించబడినది. అక్కడ ఇది రాయల్ మానస్ నేషనల్ పార్క్ గా మారుతుంది.

అంతరించబోతున్న ఎన్నో జంతువులకు ఈ పార్క్ స్థావరం. హిస్పిడ్ హెర్, అస్సాం రూఫ్డ్ తాబేలు, పిగ్మీ హాగ్ మరియు గోల్డెన్ లంగర్ లు వాటిలో కొన్ని. ఈ పార్క్ లో అడవి దున్నపోతు జనాభా గణనీయంగా ఉంది. ఇక్కడ 55 రకాల క్షీరదాలు, 380 రకాల పక్షులు, 50 రకాల సరీసృపాలు ఇంకా మూడు రకాల ఉభయచరాలు ఉన్నాయి. 360 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించబడిన ఈ పార్క్ ని ఏనుగులు ఇంకా జంగిల్ సఫారీల ద్వారా లేదా నడక ద్వారా చూడవచ్చు. కొక్రాఝార్, చిరంగ్, బాక్సా, ఉదల్గురి మరియు దర్రంగ్ జిల్లాలోకి ఈ పార్క్ వస్తుంది.

ఈ పార్క్ ని సందర్శించేందుకు ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చ్.

Please Wait while comments are loading...