అంబర్ కోట ను మాన్ సింగ్ మహారాజు, మీర్జా రాజా జై సింగ్, సవాయి జై సింగ్ దాదాపు 200 సంవత్సరాల పాటు కట్టారు. జైపూర్ ఉనికి లోనికి రావడానికి ముందు ఇది ఏడేళ్ళ పాటు కచ్చావహ పాలకుల రాజధానిగా ఉంది.మూథ సరస్సు ఒడ్డున ఉన్న ఈ కోటలో భవనాలు, మంటపాలు, సభామందిరాలు, దేవాలయాలు, ఉద్యానవనాలు ఉన్నాయి.ఏనుగు పై నుండి భవనాలను చూడటానికి పర్యాటకులకు ఏనుగు సవారీలు అందుబాటులో ఉన్నాయి. ఈ భవన సముదాయంలో శీలా మాత కు చెందిన అందమైన దేవాలయం ఉంది. దివానే ఆమ్, షీష్ మహల్, గణేష్ పోల్, సుఖ్ నివాస్, జస్ మందిర్, దిలారం బాఘ్, మోహన్ బారి అంబర్ కోట లోని ఇతర పర్యాటక ఆకర్షణలు.



Click it and Unblock the Notifications