ఆరక్కల్ కెట్టు పాలస్ మ్యూజియంగా మార్చబడిన తరువాత సంపన్న చరిత్ర మరియు కళాకృతులతో పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది. కన్నూర్ పట్టణం నుండి కొన్ని కిలో మీటర్ల దూరం లో ఉన్న ఈ పాలసు మోపిల బే కి సమీపంలో ఉంది. ఈ పాలస్ కొన్ని శతాబ్దాల క్రితం కన్నూర్ ని మరియు లక్షద్వీప్ ఐలాండ్ లని పరిపాలించిన అరక్కల్ అలీ రాజస్(ముస్లిం రాజ వంశం) యొక్క నివాస స్థలం గా ఉండేది.
చెక్కమీద అద్భుతంగా చెక్కబడిన కళాకృతులకి మరియు నిర్మాణంలో ఉపయోగించిన కేరళ మరియు సంప్రదాయ ఇంగ్లీష్ శైలితో మిళితమైన బిళ్ళ రాళ్ళు పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తాయి. విస్తారమైన కోర్ట్ యార్డ్, పలు స్వతంత్ర విభాగాలు, విశాలమైన వరండాలు, దర్బార్ హాల్స్, చెక్క నేలలు, మరియు రంగు రంగుల అద్దాల కిటికీలు ఈ రాజభవనం యొక్క నిర్మాణంలో కనువిందు చేస్తాయి.
కేరళ ప్రభుత్వం, అరక్కల్ కెట్టు లో ని దర్బార్ హాల్ ని పునరుద్ధరించి మ్యూజియంగా మార్చింది. అయినా ఈ పాలస్ మొత్తం అరక్కల్ కుటుంబీకుల నిర్వహణ లో నే ఉంది. ఈ పాలస్ ని సందర్శించేందుకు నామమాత్రపు రుసుము ని వసూలు చేస్తారు. రాచరికపు ఆస్తులు, కుటుంబ ముద్రలు, పురాతన పతాయం(దాన్యాలని నిల్వ ఉంచేందుకు వాడే డబ్బాలు), కుటుంబీకుల చే ప్రార్ధింపబడిన పవిత్రమైన ఖురాన్, పురాతన టెలిఫోన్, ఖడ్గాలు, కాంస్యం మరియు వెండి పాత్రలు మరియు పిడిబాకులు, రాచరిక సామానులు మరియు టెలీస్కోప్ లు ఈ పాలస్ లో గమనించవచ్చు.



Click it and Unblock the Notifications