దేవకోట్టై లో ఉన్న ఆలయాలలో అత్యంత సుందరమైన ఆలయం నగర శివన్ టెంపుల్. దేవకోట్టై టౌన్ యొక్క చెట్టైయార్స్ కి సంబంధించిన నట్టుక్కోట్టై నగర్తర్స్ చేత ఈ ఆలయం నిర్మించబడినది. అందువల అచ్చమైన చెట్టియార్ శైలిలో ఈ ఆలయ నిర్మాణం ఉంటుంది.
మహా శివుడికి అంకితమివ్వబడిన ఈ ఆలయానికి భక్తులని ఆశీర్వదించేందుకు బంగారు గుర్రం పై శివుడు విచ్చేస్తాదని అంటారు. ఈ ఆలయం లో ఉన్న ఇతర ప్రధాన దైవాలు శ్రీ సుందరేశ్వరర్ మరియు శ్రీ మీనాక్షి.
ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలోవచ్చే నవరాత్రి పండుగను జరపడానికి ప్రపంచం నలు మూలల నుండి నగర్తర్స్ ఇక్కడికి చేరుకుంటారు. దీపావళి పండుగ తరువాత వచ్చే మరొక పండుగ స్కందర్ షష్టి వయాజ్హ ని 7 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ ఆలయం స్వామి మురుగన్ యొక్క అనుచరులకి మాత్రమే. ఎంతో ఉత్సాహం తో ఈ పండుగని జరుపుకుంటారు. ఈ ఆలయం యొక్క మరొక ముఖ్యమైన లక్షణం వార వజ్హిపాడు లేదా వరం లో ఒకసారి జరిగే ప్రార్ధన. ఇది సుమారు గత 60 ఏళ్ళ క్రితం నుండి నిర్వహింపబడుతున్నది.



Click it and Unblock the Notifications