Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» కొల్హాపూర్

కొల్హాపూర్ - ఆధ్యాత్మిక రత్నం

21

కొన్ని వివరాలు

మహారాష్ట్రకు ఆధ్యాత్మిక రత్నం కొల్హాపూర్. పురాతన మోటైన దేవాలయాలు, ప్రశాంతమైన ఉద్యానవనాలు, చారిత్రక కోటలూ, అంతఃపురాలూ వీటన్నిటితో ఈ నగరం జాతీయ గర్వకారణం. పంచగంగా నది ఒడ్డున ఉన్న కొల్హాపూర్ చరిత్ర మన దేశంలో చాలా కాలం సాగిన మరాఠా పాలనతో పెనవేసుకుపోయింది. చిత్రంగా, మహాలక్ష్మి అమ్మవారు చంపిన కొల్హాసురుడనే రాక్షసుడి పేరు మీద ఈ నగరం వెలిసింది.

ధార్మిక నిలయం:

ఈ నగరం కొన్ని వందల ఏళ్ల నాటిది. సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో నెలకొని వున్న ఈ కొల్హాపూర్ నగరాన్ని ఛత్రపతి తారాబై స్థాపించగా ఛత్రపతి శాహూ మహారాజ్ వీరోచితంగా పాలించాడు. శాహూ మహారాజ్ బ్రిటిష్ కాలంలో కూడా ఇక్కడ సామాజిక, విద్యా వికాసం జరిగేలా చూసాడు. భోస్లే వంశస్తులు పాలించినప్పుడు కొల్హాపూర్ కి 19 గన్ రాజ్యం అనే పేరుండేది.

శ్రీ మహా విష్ణువు కొల్హాపూర్ ను తన ఆవాసంగా చేసుకున్నాడనీ, మహాలక్ష్మి ఆయన అంశ అనీ ఇక్కడ నమ్ముతారు. అంబాదేవి గా పిలువబడే మహాలక్ష్మీ దేవాలయం కొల్హాపూర్ లో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం.

కొల్హాపూర్ ను దక్షిణ కాశీ గా పిలుస్తారు. నిర్మాణ పరంగానూ, సాంస్కృతికంగానూ ఈ ప్రాంతం ఎదిగిందని చెప్పడం చాల తక్కువే అవుతుంది. ఆధ్యాత్మికత, ఆధునికత ఇక్కడ పెనవేసుకున్నట్టు ఇంకెక్కడా వుండదు.

ఇక్కడ వున్నప్పుడు ఏం చూడాలి?

కొల్హాపూర్ లోని ప్రతి కోటకీ అబ్బురపరిచే చారిత్రిక వారసత్వం వుంది. చరిత్ర ప్రేమికులు శాహూ ప్రదర్శనశాల తప్పక చూడాలి.

సంప్రదాయ కుస్తీ కళను ఇప్పటికీ సాధన చేసే ఖుష్బాగ్ మైదానం కొల్హాపూర్ లో వుంది. ఇది ఒకేసారి 30వేల మందికి కూర్చునే వసతి కల్పిస్తుంది – దీన్ని నిర్మించిన వారి చాతుర్యానికి ఇది తార్కాణం. ప్రకృతి ప్రేమికులు, ఆనందం కోరేవారు కొల్హాపూర్ లోని చెరువుల ఒడ్డున కాలక్షేపం చేయవచ్చు. మీరు చూడకుండా ఉండలేని మరో అద్భుత ప్రదేశం రంకాల చౌపాటే – అది పిల్లలు మీతో వచ్చినప్పుడు.

కొల్హాపూర్ వెళ్లి కూడా మీరు కొల్హాపురి మిసాల్ తినలేకపోయినా, కొల్హాపూర్ చెప్పుల జతలు కొనకపోయినా సిగ్గు పడాల్సిందే. షాపింగ్ కి వెళ్ళండి, ఇక్కడి స్థానికులు మిమ్మల్ని ఎంత సాదరంగా ఆహ్వానిస్తారో చూడండి. ఇంటికి వెళ్ళేటప్పుడు మీ ప్రియమైన వారికి తీసుకువెళ్ళడానికి ఇక్కడ చాలా రకాల కళాకృతులు, కానుకలు దొరుకుతాయి. పుల్లటి పులుసు అని అర్ధం వచ్చే తంబాడ రస్సా తప్పకుండా రుచి చూడాల్సిందే – మీరు మసాలా రుచి ప్రియులైనా, కాకపోయినా. ఇక్కడ తయారయ్యే ప్రతీ వంటకం లోనూ ప్రత్యేకమైన కొల్హాపురి మసాలా పడవలసిందే.

కొల్హాపూర్ గురించి సరదాగా వుండే చిన్న విషయం ఏమిటంటే దేశంలో మొట్టమొదటి చలన చిత్రం రాజా హరిశ్చంద్ర ఇక్కడే తయారైంది. ఇక్కడి వారు ఎక్కువగా మరాఠీ లో మాట్లాడతారు, ఐతే అందులో కొంచెం గుజరాతీ, మార్వాడి కూడా కలుస్తుంది.

ఇక్కడికి ఎప్పుడు, ఎలా చేరుకోవాలి?

కొల్హాపూర్ లో కోస్తా, అన్తఃస్థలీయ వాతావరణాల మిశ్రమం వుంటుంది. అందువల్ల, ఉష్ణోగ్రత కూడా బాగా వేడిగా గానీ, బాగా చల్లగా గానీ వుండదు. వేసవిలో ఉష్ణోగ్రత 35డిగ్రీలకు మించదు, తేమగా వున్నా వాతావరణం సాధారణంగా చల్లగానే వుంటుంది. శీతాకాలం మరింత ఆహ్లాదపరుస్తుంది. అందువల్ల ఈ నగరాన్ని ఏడాది లో, వరదలు వచ్చే అవకాశం వున్న వానాకాలంలో తప్ప,  ఎప్పుడైనా సందర్శించవచ్చు. ఇతరత్రా ఉష్ణోగ్రతలు 15 నుంచి 35 డిగ్రీల మధ్య వుంటాయి.

ముంబై నుంచి కొల్హాపూర్ కేవలం 387 కిలోమీటర్లు, పూణే నుంచి 240 కిలోమీటర్ల దూరం వుంటుంది. వాయు, రైలు రోడ్డు మార్గాల ద్వారా ఈ నగరం ఇతర ప్రధాన నగరాలకు కలపబడి వుంది. విమానంలో ఐతే మీరు ఉజలాయివాడి లో దిగవచ్చు. రైలు కి వస్తే, ముంబై, పూణే ల నుంచి బయలుదేరే చాలా రైళ్ళు వున్నాయి. కొల్హాపూర్ కి కార్ లో వెళ్ళడం కూడా బాగానే వుంటుంది. కేవలం ఎనిమిది గంటల లోపు సమయం పడుతుంది. లేదంటే, ప్రభుత్వ, ప్రైవేటు బస్సు సర్వీసులు ఎంచుకోవచ్చు.

ఆధునిక కార్లు, విద్యా సంస్థలు, మల్టీ ప్లేక్స్ లు, స్పైసేస్, అమ్యూస్మేంట్ పార్కులు, ఐ టి హబ్ లు – మీరేదైనా చెప్పండి, అది కొల్హాపూర్ లో వుంది. ‘దేశపు చక్కర పాత్ర’ గా పేరు పడ్డ కొల్హాపూర్ కి ఇప్పుడు అందరూ చేరుకుంటున్నారు. ప్రకృతి, ఆధ్యాత్మికత, సంస్కృతి – మనదేశాన్ని ఈనాడు ఇలా నిలిపిన ఈ మూడిటి సరైన మిశ్రమం కొల్హాపూర్ లో చూడవచ్చు. ఎక్కువ కాలం ఆగకండి, లేదంటే ఎప్పటికీ తరగని ఫాషన్లు వుండే ఈ నగరాన్ని ఆస్వాదించడం కోల్పోతారు. 

కొల్హాపూర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

కొల్హాపూర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం కొల్హాపూర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? కొల్హాపూర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా మీరు ముంబై లేదా బెంగళూర్ నించి కొల్హాపూర్ వెళ్ళాలి అనుకుంటే, ఈ ప్రయాణం 450 కిలోమీటర్ల పరిధిలో, దగ్గరగా 8-10 గంటల సమయం పడుతుంది. ఇది పూణే నుండి 240 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వ౦ ఏర్పాటుచేసిన వివిధ ప్రయాణ సదుపాయాలను కూడా మీరు ఎంచుకోవచ్చు. వీరు ఏర్పాటు చేసిన సెమీ లగ్జరీ, ప్రైవేట్ బస్సులు ముంబై, గోవా, పూణే, షోలాపూర్, బెంగళూర్ వంటి వివిధ ప్రాంతాల నుండి కొల్హాపూర్ చేరుకోవడానికి సహాయపడతాయి. ప్రైవేట్ టూరిస్ట్ బస్సుల చార్జీలు షుమారు కిలోమీటర్ కి 3-4 రూపాయలు పడుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా ముంబై లేదా బెంగళూర్ నించి కొల్హాపూర్ ప్రయాణం 10-11 గంటలు ఉంటుంది. విడి రోజుల్లో కొల్హాపూర్ వెళ్ళాలి అనుకుంటే దాదర్, సి ఎస్ టి (ముంబై) రాత్రి రైళ్ళు అందుబాటులో ఉన్నాయి. కోల్హాపూర్ వద్ద ఛత్రపతి షాహు మహారాజ్ టెర్మినస్ ఢిల్లీ, పూణే, బెంగళూర్, అహ్మదాబాద్ తో సహా భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలను కలుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా కొల్హాపూర్ వద్ద ఉన్న ఉజాలైవాడి విమానాశ్రయం భారతదేశం లోని రాష్ట్రాలకు, మిగిలిన ఇతర నగరాలకు బాగా అనుసంధానించబడి ఉంది. ఇది కొల్హాపూర్ ప్రధాన నగరం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. విమానం ద్వారా కొల్హాపూర్ కేవలం ఒక గంట దూరంలో మాత్రమే ఉంది. విమానాశ్రయం నించి, టాక్సీ లో వెళ్లాలనుకునే వారు చార్జీ షుమారు సగటున 300 రూపాయలుగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
24 Apr,Wed
Check Out
25 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
24 Apr,Wed
Return On
25 Apr,Thu