Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మనికరన్

మణికరణ్ - హిందువులకు, సిక్కులకు కూడా పవిత్రమే !

17

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కులు నుంచి 45కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి 1737 మీటర్ల ఎత్తున వున్న మణికరణ్ హిందువులకు, సిక్కులకు పవిత్ర తీర్థ క్షేత్రం. మణికరణ్ అనేది ఒక అభరణాన్ని సూచిస్తుంది. ఒక ఇతిహాసం ప్రకారం లయకారకుడైన శివుడి భార్య పార్వతి ఒక జలాశయంలో తన విలువైన ఆభరణాన్ని కోల్పోయింది. పార్వతి శివుడిని ఆ నగ వెతికి పెట్టమని అడుగగా, ఆయన ప్రమదగణాలను దాని కోసం వెదకమని ఆజ్ఞాపించాడు. వాళ్ళు దాన్ని వెదకలేకపోవడంతో ఆగ్రహోదగ్రుడై మూడో కన్ను తెరిచాడు. దీంతో భూమి మీద అల్లకల్లోలం చెలరేగి అసంఖ్యాకమైన రత్నాలు, మణులు ఏర్పడ్డాయి.

మణికరణ్ లోని శ్రీ గురు నానక్ దేవ్ జీ గురుద్వారా ఒక ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. సిక్కు మత స్థాపకుడు గురు నానక్ దేవ్, తన అయిదుగురు శిష్యులతో ఈ ప్రాంతాన్ని సందర్శించారని స్థానికుల విశ్వాసం. ఈ గురుద్వారా ఆవరణలో ఉన్న వేడి నీటి కుండం కూడా పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడి శివాలయం మరో ఆకర్షణ. 1905 లో రిక్టర్ స్కేల్ పై 8.0 నమోదైన భూకంపం తరువాత కూడా ఈ దేవాలయం కొద్దిగా ఒరిగి వుండడం దీని ప్రత్యేకత.

ఇక్కడి రామచంద్ర దేవాలయం, కులాంత పీఠం వంటి వాటికి కూడా మణికరణ్ హిందూ పర్యాటకులలో బాగా ప్రసిద్ది. హరీందర్ పర్వతం, పార్వతి నది, షోజా, మలానా, పర్యాటకులు పర్వతారోహణ చేసే ఖీర్ గంగా ఇక్కడి ఇతర ఆకర్షణల్లో కొన్ని.

మణికరణ్ వెళ్లాలనుకునే యాత్రికులు వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఏప్రిల్ నుంచి జూన్ వరకు వుండే వేసవి లో మణికరణ్ సందర్శనకు ఉత్తమ సమయం.

మనికరన్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మనికరన్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మనికరన్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మనికరన్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : రోడ్డు ప్రయాణం కోరుకునే వారు బస్సుల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. ఐతే మణికరణ్ కు నేరుగా బస్సులు అందుబాటులో లేవు. యాత్రికులు ముందుగా కులు లేదా మనాలి చేరుకొని అక్కడినుంచి మణికరణ్ చేరాలి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : మణికరణ్ నుంచి 298 కిలోమీటర్ల దూరంలో వున్న పఠాన్ కోట్ ఇక్కడికి సమీప రైల్వే స్టేషన్. యాత్రిలుకులు 283 కిలోమీటర్ల దూరంలో వున్న చండీఘర్ నుంచి కూడా రైల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఈ రైల్వే స్టేషన్ల నుంచి డిల్లీ తో సహా అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు నడుస్తాయి. ఈ స్టేషన్ల నుంచి మణికరణ్ కు టాక్సీలు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    పర్యాటకులు వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా మణికరణ్ చేరుకోవచ్చు. వాయుమార్గం : మణికరణ్ నుంచి అరగంట దూరంలో వుండే భుంటార్ ఇక్కడికి సమీప విమానాశ్రయం. ఇక్కడి నుంచి డిల్లీ, పఠాన్ కోట్, చండీఘర్, ధర్మశాల, షిమ్లా వంటి అనేక ప్రధాన నగరాలకు విమానాలు నడుస్తాయి. విమానాశ్రయం నుంచి మణికరణ్ చేరడానికి టాక్సీలు, కాబ్ లు అందుబాటులో వుంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri