Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మరారికులం

మరారికులం - బీచ్ విహారం...!

9

మరారికులంలో బీచ్ విహారం ఆనందంగా ఉంటుంది. అలపూజ పట్టణంలో మరారికూలం ఒక అందమైన గ్రామం. బంగారు వన్నెగల ఇసుక బీచ్ మరారికి ప్రసిద్ధి. అలప్పూజ నుండి ఇది 11 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ గ్రామ ప్రజలు ఎంతో ప్రాచీనకాలంనాటి అంటే సుమారు వందల సంవత్సరాల క్రిందటి జీవన విధానాలు సాగిస్తున్నారు. ఈ గ్రామం పీచు తయారీ కి ప్రసిద్ధి.

 ఈ గ్రామంలోని భూమి సారవంతమైనది. ఎంతో అందమైన గ్రామం. మీరు రిలాక్స్ అయి ఆనందించవచ్చు. ఇక్కడి మత్స్య కారులతో కలసి సముద్రంలోకి వెళ్ళి వారు చేపలు పట్టటం చూసి మీరు కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. వారి ఆచార సాంప్రదాయాలు తెలుసుకోవచ్చు. అసలైన పర్యాటకతకు అద్దం పడుతుంది. నీటి క్రీడలు, వలలు అల్లకం, యోగా, ఆయుర్వేద చికిత్సలు, ధ్యానం వంటివి ఇక్కడ కలవు.

ఈ ప్రాంత ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. ఇక్కడ కల కొక్కమంగళం చర్చి సెయింట్ ధామస్ చే స్ధాపించబడిందని చెపుతారు. గొప్ప యాత్రా స్ధలాలలో ఇది ఒకటి. ఈ చర్చి లో వర్జిన్ మేరీ విగ్రహం ఉంటుంది. ఇది కోస్తా పట్టణమైన తుంపోలీలో కలదు. ఈ ప్రదేశంలోని శివాలయం, కొక్కమంగళం సెయింట్ అపోసల్ చర్చి, అరూర్, అరుధంకాలన్, పూచ్ఛక్కాల్, పానావలీ, వెలోర్ వట్టం మరియు అర్ధంకాల్ లు ఇతర ఆకర్షణలు. శివాలయంలోని శిల్ప శైలి అద్భుతం. ఇక్కడ చెర్తాల కార్తియేని దేవాలయం కూడా కలదు. దీనిలో ప్రధాన దైవం దేవి కర్తియాని.

 కంచికుంగ్లార దేవాలయం మరొక ప్రసిద్ధి గాంచిన దేవాలయం. దీనిలో ప్రధాన దైవం భగవతి. పుచ్ఛక్కాల్ సమీప మరొక పట్టణం కూడా అనేక దేవాలయాలను కలిగి ఉంది. మరారికులం గ్రామానికి రోడ్డు, రైలు, వాయు మార్గాలలో చేరవచ్చు. దక్షిణాదిన రోడ్డు మార్గంలో అన్ని ప్రధాన నగరాలకు కలుపబడి ఉంది. ఎపుడు ప్రణాళిక చేయాలి? ఈ ప్రాంతానికి శీతాకాలంలో సందర్శన చేయాలి.

మరారికులం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మరారికులం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మరారికులం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మరారికులం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం ఈ గ్రామం దానికి 5 కి.మీ. ల దూరంలో తూర్పు దిశగా ఎస్ ఎల్ పురం వద్ద జాతీయ రహదారి 47కు కలుపబడి ఉంది. కొచ్చి నుండి మరారికులంకు 43 కి.మీ. దూరం. ఈ గ్రామంకు ప్రభుత్వ బస్సులు నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం మరారికులం రైలు స్టేషన్ కు కేరళలోని వివిధ ప్రాంతాలనుండి రైళ్ళు వస్తాయి. ఇది ఎర్నాకులం - అలప్పుజా రైలు మార్గంలో కలదు. మరారి కులంకు మీకు నేరు ట్రైన్ లేకుంటే, సమీప రైలు స్టేషన్ లో దిగి మరారికులం రైలు స్టేషన్ కు చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం కొచ్చిన్ అంతర్జాతీయ విమానాశ్రయం అంటే నెడెంబస్సెరీ విమానాశ్రయం ఈ గ్రామానికి సమీపంగా ఉంటుంది. ఈ విమానాశ్రయం, దేశీయ మరియు విదేశీయ విమానాలకు సేవలు అందిస్తుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
26 Jul,Sun
Return On
27 Jul,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
26 Jul,Sun
Check Out
27 Jul,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
26 Jul,Sun
Return On
27 Jul,Mon