కొత్త బస్ స్టాండ్ సమీపంలో నార్నాల్-రేవారీ రహదారి వద్ద ఉన్న ఈ ఆలయం శివునికి అంకితం చేయబడింది. నార్నాల్ లోని ఈ ఆలయం మాత్రమే, శివుడు, ఇతర దేవీ, దేవతలను ప్రార్ధించడానికి ఇక్కడికి వచ్చే కుటుంబసభ్యుల౦దరినీ ఆకర్షిస్తుంది. పురాణాల కధనం ప్రకారం ఒక వ్యక్తి పొలం దున్నుతుంటే, ఒక శివలింగం కనిపించింది. అతను గాఢనిద్రలో ఉన్నపుడు, ఒక గొంతు శివుని కోసం ఆలయాన్ని కట్టించి అందులో శివలింగం ఉంచమని ఆదేశంతో ప్రతిధ్వనించింది. ఈ ఆలయం నిర్మించినప్పటి నుండి భక్తులను ఆకర్షిస్తూనే ఉంది. ఎవరైతే ఇక్కడ పూజలు చేస్తారో వారి కోరికలు నెరవేరుతాయని ప్రతీతి.



Click it and Unblock the Notifications