Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» పెర్నెమ్

పేర్నెమ్ - సహజ విశ్రాంతి ప్రదేశం!

11

బీచ్ ప్రాంతాల పర్యటనతో విసుగెత్తిన వారికి మహారాష్ట్ర - గోవాల సరిహద్దులో కల పేర్నెమ్ దర్శన హాయినిస్తుంది. ఛపోరా మరియు టిరకోల్ నదులు అద్బుత దృశ్యాల నందిస్తాయి. ఈ ప్రాంతంలో స్ధానికుల జీవన విధానాలు తెలుసుకుంటూ ముచ్చటించవచ్చు లేదా వారి చేపల వేటలో పాల్గొనవచ్చు. అనేక సంవత్సరాల క్రిందట గోవా ఎలా ఉండేది అనే దానికి పేర్నెమ్ ఉదాహరణగా నిలుస్తుంది. ముంబై, పూనే ల నుండి గోవా వెళ్ళే వారికి పేర్నెం కొద్దిసేపు గడపటానికి కూడా బాగుంటుంది.

పేర్నెంలో చూడవలసినవి రెండే ప్రదేశాలు. అవి ఒకటి శ్రీ భగవతి దేవాలయం కాగా రెండవది దేశ్ ప్రభు హౌస్ అనబడే ఒక పెద్ద విల్లా.  సాధారణంగా పాశ్చాత్యులు ఈ నిర్మాణాలకు బాగా ఆకర్షితులవుతారు.   భగవతి దేవాలయంలో కల ఏనుగుల కట్టడాలు ఆకర్షణీయంగా ఉంటాయి.  

ఉత్తరం నుండి గోవా కు ప్రయాణించేవారికి పేర్నెం చూడటం తేలిక. రాష్ట్రంలోకి ప్రవేశిస్తే చాలు మీరు చూసే మొదటి ప్రదేశం అదే. పాణజిం నుండి ఇది 32 కి.మీ.ల దూరం మాత్రమే కనుక క్యాబ్ లో ప్రయాణించవచ్చు. అయితే, ఛార్జీల విషయంలో జాగ్రత్త. అధిక ఛార్జీలకు మోసపోకండి. ప్రత్యామ్నాయంగా, వాతావరణం అనుకూలిస్తే,  ఒక బైక్ అద్దెకు తీసుకొని కూడా ప్రయాణించవచ్చు. 

పెర్నెమ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పెర్నెమ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పెర్నెమ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పెర్నెమ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue