Search
  • Follow NativePlanet
Share

షోఘి - సహజ సౌందర్యం !

7

హిమాచల ప్రదేశ్ రాష్ట్రంలో 5700 అడుగుల ఎత్తులో ఉన్న ఒక చిన్న పట్టణం షోఘి. షిమ్లా జిల్లాకు 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నఈ పట్టణం రాష్ట్రంలోని పేరొందిన పర్వత కేంద్రాలలో ఒకటి. చుట్టూ ఓక్ చెట్లు, గన్నేరు చెట్లు ఉన్నఈ చిన్న పట్టణం షోఘి దాని సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశం స్థానికంగా తయారయ్యే జ్యూసులు, జెల్లీలు, సిరప్పులు, పచ్చళ్ళకు కూడా ప్రసిద్ధి చెందింది.

షోఘి చరిత్ర ఆంగ్లేయులులు -గుర్ఖాల యుద్ధం జరిగిన 19 వ శతాబ్దం నాటిది. 1815వ సంవత్సరం మేనెల 15వ తేదిన మలావున్ యుద్ధంలో గూర్ఖాలు స్థానిక రాజుల చేతిలో ఓటమిని చవి చూసారు. బ్రిటిష్ వారు, స్థానిక రాజులు కలసి సంజౌలి ఒడంబడికను గూర్ఖాలచే బలవంతంగా సంతకం చేయించారు, దీని ప్రకారం గూర్ఖా పాలనలో ఉన్న ప్రాంతం అసలైన పాలకులకు చేతికి చేరింది. తర్వాత, షిమ్లాతో సహా ఈ పూర్తి ప్రాంతాన్ని, బ్రిటిష్ వారు పాటియాల మహారాజు వారికి చేసిన నిరంతర సేవలకు గాను అతనికి బహుమతిగా ఇచ్చారు.

ఈ ప్రాంతంలో అనేక పురాతన ఆలయాలు ఉండటం వలన షోఘిని ఆలయ పట్టణం అని కూడా అంటారు. ఇటీవల పునరుద్ధరించిన హనుమాన్ ఆలయం, కాళీ ఆలయం, తారాదేవి ఆలయం ఈ ప్రాంతంలోని ప్రసిద్ధి చెందిన ధార్మిక కేంద్రాలు. షోఘి సందర్శించే పర్యాటకులు ఈ ప్రాంతానికి దగ్గరలో ఉన్న కొన్ని పురాతన ఆలయాలకు పేరు గాంచిన ఝాకూ కొండలను కూడా సందర్శించవచ్చు.

షోఘిని వాయు, రైలు, రోడ్డు వంటి వేర్వేరు రకాల రవాణా సౌకర్యాల ద్వారా సులువుగా చేరవచ్చు. షోఘికి అతి దగ్గరగా జుబ్బర్ హట్టిలో షిమ్లా దేశీయ విమానాశ్రయం పట్టణం నుండి 33 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐ జి ఐ) అతి దగ్గరలోని అంతర్జాతీయ విమానాశ్రయం.

కల్క, షోఘికి అతి దగ్గరగా ఉన్న ప్రధాన రైలు స్టేషన్, భారత ప్రధాన నగరాలతో అనుసంధానం కల్గి ఉంది. ఈ ప్రాంతానికి రోజువారి బస్సులు హిమాచల ప్రదేశ్ లోని ఇతర నగరాల నుండి అందుబాటులో ఉంటాయి. షోఘి ప్రాంతంలో ఏడాది పొడవునా ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.ఈ కారణంగా, పర్యాటకులు ఈ ప్రాంతాన్నిఏ కాలంలోనైన సందర్శించవచ్చు.

షోఘి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

షోఘి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం షోఘి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? షోఘి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వార : హిమాచల రోడ్డు రవాణా సంస్థ (హెచ్ ఆర్ టి సి) బస్సులు షోఘికి హిమాచల ప్రదేశ్ లోని ఇతర ప్రాంతాల నుండి ఉన్నాయి. ఢిల్లీ నుండి రోజువారి డీలక్స్, సాధారణ బస్సులు తిరిగే షిమ్లాకు షోఘి చక్కటి అనుసంధానం కల్గి ఉంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వార : షిమ్లా రైలు స్టేషన్ నుండి మీటర్ గేజ్ మార్గం షోఘికు అతి దగ్గరగా ఉంది. ఇక్కడకు 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్క, ఈ ప్రాంతానికి అతి దగ్గరి ప్రధాన రైలు స్టేషన్. ఈ స్టేషన్ భారత ప్రధాన ప్రాంతాలకు చక్కటి మార్గాన్ని కల్గి ఉంది. పర్యాటకులు కల్క నుండి షోఘికి టాక్సీల ద్వారా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    షోఘి పట్టణానికి వాయు, రైలు, రోడ్డు వంటి ప్రధాన రవాణా సౌకర్యాల ద్వారా చేరవచ్చు. వాయు మార్గం ద్వార : జుబ్బార్ హట్టిలోని షిమ్లా విమానాశ్రయం షోఘికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న అతి దగ్గరి దేశీయ విమానాశ్రయం. ఈ విమానాశ్రయం న్యూ ఢిల్లీ, కులు వంటి నగరాలకు అనుసంధానాన్ని కల్గి ఉంది. షోఘి చేరడానికి పర్యాటకులకు విమానాశ్రయం నుండి అద్దెటాక్సీలు దొరుకుతాయి. షోఘికు అతి దగ్గరగా 340 కిలోమీటర్ల దూరంలో న్యూ ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐ జి ఐ) ఉంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed