Search
  • Follow NativePlanet
Share

షోజా - అందమైన ప్రాంతం !

11

హిమాచల్ ప్రదేశ్ లోని సిరాజ్ లోయలో వున్న అందమైన ప్రాంతం షోజా. జలోరీ పాస్ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో వుండే షోజా సముద్ర మట్టానికి 2368 మీటర్ల ఎత్తున వుంటుంది. ఇది మంచుతో కప్పబడిన హిమాలయాల అందమైన దృశ్యాల్ని అందిస్తుంది.

సేరోల్సార్ సరస్సు, రఘుపూర్ కోట, జలపాత కేంద్రం, జలోరీ పాస్, తీర్థాన్ లోయ ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణలు. కఠినమైన మెటల్ రోడ్డు గల జలోరీ పాస్ షోజాను షిమ్లా లాంటి చుట్టుపక్కల ప్రాంతాలకు కలుపుతుంది.

జలోరీ పాస్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలోని సేరోల్సార్ సరస్సు కూడా షోజా లో ప్రసిద్ది చెందిన మరో ప్రదేశం. బుధి నాగిన్ అనే దేవత కోసం నిర్మించిన ప్రసిద్ద దేవాలయం కూడా ఈ ప్రాంతంలో వుంది. ఈ ప్రాంతానికి సంరక్షురాలిగా పిలువబడే ఈ అధిదేవతకు నూర్గురు కుమారులున్నారని చెప్తారు.

షోజా లో తప్పక చూడవలసిన ప్రాంతాల్లో ఒకటి జలపాత కేంద్రం. ప్రకృతి ఒడిలో వున్న ఈ జలపాత కేంద్రం అచ్చేరువొందించే ఆనందంతో అలరారుతోంది. షోజా నుంచి కేవలం 1కిలోమీటర్ దూరంలోనే ఉండడంతో ఉదయం పూట నడక కోసం జనం ఇక్కడి దాకా వస్తారు. ఇక్కడి నీరు చల్లగా, తీయగా ఉంటాయని చెప్తారు.

వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా ప్రయాణికులు షోజా కు తేలిగ్గా చెరుకొవచ్చు. కులు మనాలీ గా పిలువబడే భు౦టార్ విమానాశ్రయం షోజాకు బాగా దగ్గర. ఇక్కడినుంచి 80 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ విమానాశ్రయం న్యూ డిల్లీ, షిమ్లా లాంటి అనేక భారతీయ నగరాలకు అనుసంధానించబడి వుంది. 164 కిలోమీటర్ల దూరంలో వున్న జోగిందర్ నగర్ ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషన్. కులు నుంచి షోజా కు నిత్యం బస్సులు నడుస్తాయి.

ఏడాది పొడవునా ఈ ప్రాంతంలో ఒక మాదిరి వాతావరణం వుంటుంది, అయినా వేసవి లో ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఉత్తమం అంటారు.

షోజా ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

షోజా వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం షోజా

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? షోజా

  • రోడ్డు ప్రయాణం
    రైలు మార్గం : షోజా కు సుమారు 164 కిలోమీటర్ల దూరంలో వున్న జోగీందర్ నగర్ రైల్వే స్టేషన్ ఇక్కడికి దగ్గరి రైల్వే స్టేషన్. చండీఘర్ గుండా ఈ స్టేషన్ ఇతర ప్రధాన నగరాలకు అనుసంధానించబడి వుంది. రైల్వే స్టేషన్ బయటి నుంచి పర్యాటకులు షోజా కు వెళ్ళే బస్సులు ఎక్కవచ్చు. రోడ్డు మార్గం : కులు నుంచి నిత్యం నడిచే బస్సుల్లో పర్యాటకులు షోజా కు చేరుకోవచ్చు. హిమాచల్ ప్రదేశ్ రవాణా సంస్థ HPTC వారి బస్సుల ద్వారా కులు ఇతర ప్రధాన భారతీయ నగరాలకు అనుసంధానించబడి వుంది. పర్యాటకులు షిమ్లా, పఠాన్ కోట్, చండీఘర్, న్యూ డిల్లీ ల నుంచి హిమాచల్ ప్రదేశ్ పర్యాటక అభివృద్ది సంస్థ HPTDC వారు నడిపే డీలక్స్ బస్సుల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం

  • విమాన ప్రయాణం
    షోజా కు వాయు, రైలు, రోడ్డు మార్గాల ద్వారా తేలిగ్గానే చేరుకోవచ్చు. వాయు మార్గం : భు౦టార్ విమానాశ్రయం గా పిలువబడే కులు మనాలి విమానాశ్రయం ఇక్కడి నుంచి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో వుంది. ధర్మశాల, పఠాన్ కోట్, షిమ్లా, చండీఘర్, న్యూ డిల్లీ లాంటి ప్రధాన నగరాలకు ఈ విమానాశ్రయం అనుసంధానించబడి వుంది. డిల్లీ లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విదేశీ ప్రయాణీకులకు అందుబాటులో వున్న పెద్ద విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed