Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» శ్రీరంగపట్నం

శ్రీరంగపట్నం - పునరుజ్జీవనం పొందిన చరిత్ర

33

చారిత్రక ప్రాధాన్యతకల శ్రీరంగపట్నం తప్పక చూడవలసిన ప్రదేశం. శ్రీరంగపట్నం ఒక ద్వీపం. కావేరి నదికిగల రెండు పాయల మధ్య ఉంది. ఈ ద్వీపం మైసూర్ కు సమీపంలో ఉంది. షుమారు 13 చ.కి.మీ.ల విస్తీర్ణం కలిగి ఉంటుంది.  

చారిత్రక ప్రాధాన్యం - శ్రీరంగపట్నం దాని చారిత్రక ప్రాధాన్యతల కారణంగా అది ఒక పర్యాటక కేంద్రంగా విశిష్టతను సంతరించుకొంది. ఈ పట్టణానికి ఆ పేరు అక్కడగల అందమైన రంగనాధస్వామి దేవాలయం వలన కలిగింది. ఈ దేవాలయాన్ని 9వ శతాబ్దంలో నిర్మించారు. అప్పటినుండి అది అనేక ఆటుపోట్లకు గురయింది. దాని కారణంగానే, నేడు అది హొయసల మరియు విజయనగర శిల్ప కళల సంకలనానికి ఒక ఉదాహరణగా నిలిచింది.

టిప్పు సుల్తాన్ పాలనలో మైసూర్ పట్టణానికి దీనిని రాజధానిని చేయటం వలన కూడా కొంత ప్రాముఖ్యత ఇది సంతరించుకొంది. ఈ కారణంగా ఈ పట్టణ శిల్ప సంపదలో కొంత ముస్లిం కళా శైలి కూడా గోచరిస్తుంది. దరియా దౌలత్ బాగ్ మరియు జామా మసీద్ వంటి కట్టడాలు వారి కాలంలో నిర్మించబడినవే.

శ్రీరంగ పట్న పరిధిలోని సహజ ప్రకృతి అందాలు  పర్యాటకులను అబ్బుర పరుస్తాయి. ఈ ప్రాంతంలోని శివన సముద్ర జలపాతాలు గొప్ప విహార స్ధలంగా పేరు పడ్డాయి. ఇవి రెండవ అతిపెద్ద జలపాతాలుగా చెప్పబడతాయి. శ్రీరంగ పట్టణం వద్ద గల సంగమ ప్రదేశంలో కావేరి, కాబిని మరియు హేమవతి నదులు ఒక్కచోట కలుస్తాయి. పర్యాటకులకు ఇది ఒక విశేష ప్రదేశం.

శ్రీరంగపట్నం బెంగుళూరుకు 127 కి.మీ.లు, మైసూర్ పట్టణానికి 19 కి.మీ.ల దూరంలోను ఉంది. ఇక్కడ ఒక రైలు స్టేషన్ కూడా కలదు. సమీప విమానాశ్రయం మైసూర్ లో కలదు. బెంగుళూరు - మైసూర్ జాతీయ రహదారిలో ఉండటం చేత, బస్ సౌకర్యాలు అధికంగానే ఉన్నాయి.

శ్రీరంగపట్నం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

శ్రీరంగపట్నం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం శ్రీరంగపట్నం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? శ్రీరంగపట్నం

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - అన్ని ప్రధాన నగరాలనుండి శ్రీరంగ పట్టణానికి బస్సులు కలవు. కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ డీలక్స్ వోల్వో బస్సు లను ప్రతి నిత్యం బెంగుళూరు నుండి నడుపుతుంది. ఇక్కడినుండి చుట్టు పట్ల ప్రదేశాలకు టాక్సీలు క్యాబ్ లు దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - శ్రీరంగ పట్టణంలో రైలు స్టేషన్ లేదు. సుమారు 17 కి.మీ. ల దూరంలో సమీప రైలు స్టేషన్ కలదు. ఇక్కడినుండి అన్ని నగరాలకు రైలు సౌకర్యం కలదు. ప్రయాణీకులు, టాక్సీలు, క్యాబ్ లు లేదా బస్సులలో శ్రీరంగపట్నం చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    శ్రీరంగపట్టణం ఎలా చేరాలి? విమాన ప్రయాణం - మైసూర్ విమానాశ్రయం స్ధానిక విమానాశ్రయం. ఇది 26 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇక్కడినుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమానాలున్నాయి. శ్రీరంగ పట్టణానికి 140 కి.మీ.ల దూరంలో బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. విదేశీ యాత్రికులకు ఇది అనుకూలంగా ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Apr,Wed
Check Out
02 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu