Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తూథుకుడి

తూథుకుడి - నౌకాశ్రయాలు మరియు ముత్యాల నిలయం! తుటికారిన్ గా కూడా ప్రసిద్ది చెందిన తూథుకుడి అదే పేరు తో ఈ జిల్లా యొక్క మునిసిపల్ కార్పొరేషన్ గా వ్యవహరిస్తోంది. తమిళ్ నాడు రాష్ట్రానికి ఆగ్నేయాన ఉన్న ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ది చెందిన నౌకాశ్రయ నగరం. ముత్యాలకు ప్రసిద్ది కావడం చేత ఈ నగరానికి ముత్యాల నగరం గా కూడా పేరుంది.

ఫిషింగ్ అలాగే నౌకా నిర్మాణాలకి ఈ ప్రాంతం ప్రసిద్ది. తూథుకుడి యొక్క పశ్చిమాన అలాగే ఉత్తరాన తిరునెల్వేలి జిల్లా ఉంది. ఇది రామనాథపురం అలాగే విరుధునగర్ ల కి తూర్పున ఉంది. తమిళ్ నాడు రాజధాని అయిన చెన్నై తూథుకుడి నగరం నుండి 600 కిలో మీటర్ల దూరంలో ఉంది. తూథుకుడి నుండి కేవలం 190 కిలో మీటర్ల దూరంలో త్రివేండ్రం ఉంది.

32

తూథుకుడిలో ఇంకా చుట్టూ పక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు

సముద్ర ప్రేమికులకు తూథుకుడి అనువైన పర్యాటక ప్రదేశం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన పర్యాటక ఆకర్షణ ఇక్కడ ఉన్న నౌకాశ్రయం. పార్కులకి ప్రసిద్ది చెందిన ఆ పట్టణంలో హార్బర్ పార్క్, రాజాజీ పార్క్ అలాగే రోచ్ పార్క్ లు ప్రసిద్ది చెందినవి.

సుబ్రహ్మణ్య స్వామి కి అంకితమివ్వబడిన తిరుచెండుర్ ఆలయానికి ఈ నగరం ప్రసిద్ది చెందింది. సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CMFRI) కి కూడా ఈ నగరం ప్రసిద్ది చెందింది. మనపాడ్ కలుగుమలై, ఒట్టపిడరం, ఎట్టయపురం, కొరకై అతిచనల్లుర్, వంచి మనియచి మరియు పంచలంకురిచి నవ తిరుప్పతి వంటివి ఇక్కడ ఉన్న మరికొన్ని పర్యాటక ఆకర్షణలు.

రాక్ కట్ జైన్ టెంపుల్ అయిన కలుగుమలై, కొరకై ట్యాంక్ అలాగే వేట్ట్రివేలమ్మన్ ఆలయాలు ఇక్కడ ప్రసిద్ది చెందిన మరికొన్ని పర్యాటక ఆకర్షణలు. ఇవి పిక్నిక్ స్పాట్ లా కూడా ప్రసిద్ది. స్వాతంత్ర్య పోరాటం లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు వీరపాండియన్ కట్టబోమ్మన్ కి అంకితమివ్వబడిన కట్టబొమ్మన్ మెమోరియల్ ఫోర్ట్ అనే చారిత్రక ప్రదేశం కూడా ఇక్కడ చూడవచ్చు.

చరిత్ర లోకి ప్రయాణం

తిరు మందిర్ నగర్ గా కూడా పిలువబడే తూథుకుడి లో హనుమంతుల వారు సీతా దేవి అన్వేషణ లో భాగంగా గురించి లంకకు చేరే మార్గంలో ఇక్కడ కొద్ది సేపు బస చేసారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ నగరం యొక్క పేరు 'తూతాన్' అంటే 'వార్తాహరుడు' లేదా 'దూత' అనే అర్ధం వచ్చేలా ఉంటుంది. అంతే కాదు, 'తూర్తు' అంటే సముద్రం నుండి తిరిగి పొందిన భూమి' అని 'కుడి' అంటే 'పరిష్కారం' అని అర్ధం. చరిత్ర నుండి ఈ నగరం నౌకాశ్రయ నగరంగా ప్రసిద్ది. పాండ్యన్ పాలన లో ఇది ప్రఖ్యాతి చెందిన ఓడరేవు.

1548 లో ఈ నగరం పాండ్యన్ చేతి నుండి పోర్టుగీసు చేతి లో కి వెళ్ళిపోయింది. ఆ తరువాత 1658 లో ఈ నగరం డచ్ చేతి లో కి ఆ తరువాత 1825 లో బ్రిటిష్ అధీనం కి వెళ్ళిపోయింది. 1866 లో మున్సిపాలిటీ గా ఏర్పడ్డ ఈ నగరం లో రోచ్ విక్టోరియా చైర్మన్ గా నియమింపబడ్డారు. ఆ తరువాత 2008 లో ఈ నగరం కార్పొరేషన్ గా ఏర్పాటు చెయ్యబడింది.

తూథుకుడి కి ఎలా చేరాలి?

దేశం లోని మిగతా ప్రాంతాల నుండి తూథుకుడి కి చాలా సులభంగా చేరుకోవచ్చు. ఈ నగరంలో ఉన్న విమానాశ్రయం చెన్నైకి చక్కగా అనుసంధానమై ఉంది. ఈ నగరంలో ఉన్న రైల్వే స్టేషన్ దక్షిణ భారత దేశంలోని మిగతా ప్రాంతాలకు చక్కగా అనుసంధానమై ఉంది. తమిళనాడు లోని మిగతా నగరాల నుండి ఈ నగరానికి బస్సు సర్వీస్ లు తరచుగా అందుబాటులో ఉన్నాయి.

తూథుకుడి వాతావరణం

తూథుకుడి ఉష్ణమండల వాతావరణం కలిగిన ప్రదేశం. ఇక్కడ వేసవి కాలం చాలా వేడిగా ఉంటుంది. అందువల్ల వేసవి కాలంలో ఈ నగరానికి ప్రయాణం ఎంతో కష్టం. వర్షాకాలంలో ఇక్కడ తరచూ జల్లులు కనిపిస్తాయి. అందువల్ల ఈ కాలంలో పర్యాటకుల కార్యక్రమాలకి వర్షం అడ్డుగా ఉండవచ్చు. అందువల్ల ఈ నగరాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయం అక్టోబర్ నుండి మార్చ్ మాసాలు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాద కరంగా ఉంటుంది.

తూథుకుడి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తూథుకుడి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తూథుకుడి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తూథుకుడి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం దక్షిణ భారత దేశం లోని అన్ని పట్టణాలకు తూథుకుడి బస్సు మార్గం ద్వారా చక్కగా అనుసంధానమై ఉంది. ఈ బస్సు సర్వీస్ లు తరచూ అందుబాటులో ఉన్నాయి. ఈ బస్సులు చవకగా ఉండటమే కాకుండా ఈ నగరానికి చేరుకునేందుకు అనువైన మార్గం అని చెప్పుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం తూథుకుడి రైల్వే స్టేషన్ ప్రధానమైన రైల్వే స్టేషన్. మైసూరు, చెన్నై, మదురై, కోయంబత్తూర్ వంటి పట్టణాలకి ఈ రైలు సర్వీస్ లు అందుబాటులోఉన్నాయి. రైళ్ళ ద్వారా ఈ నగరానికి సులభంగా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం నగరం నుండి 14 కిలో మీటర్ల దూరంలో తూథుకుడి విమానాశ్రయం ఉంది. ఈ విమానాశ్రయం చెన్నై విమానాశ్రయానికి అనుసంధానమై ఉంది. చెన్నైలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నగరాలూ పట్టణాలు అనుసంధాన మవుతున్నాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue