Search
  • Follow NativePlanet
Share
» »ఇక్కడ పద్మినీజాతి స్త్రీకి అక్కడ ఉన్న మచ్చను దీపపు కాంతిలో చూస్తే అన్నీ మీ సొంతం

ఇక్కడ పద్మినీజాతి స్త్రీకి అక్కడ ఉన్న మచ్చను దీపపు కాంతిలో చూస్తే అన్నీ మీ సొంతం

ర్యాలీ లోని జగన్మోహిని కేశవ దేవాలయం గురించిన కథనం.

స్థితికారకుడైన మహావిష్ణువు జగన్మోహిని రూపంలో కొలువైన క్షేత్రం భారత దేశంలో ఒకే ఒకచోట ఉంది. అది కూడా ఒకే విగ్రహం ముందు వైపు విష్ణువు ఉంటే వెనుక వైపున జగన్మోహిని రూపం ఉంటుంది. ఇక్కడ ఆ జనన్మోహిని రూపంలోని విష్ణువు పిక్క పై ఉన్న మచ్చను సందర్శిస్తే వెంటనే వివాహం అవుతుందని భక్తులు నమ్ముతారు. అందుకే వివాహ సంబంధ సమస్యలతో బాధపడే వారు ఎంతోమంది ఇక్కడకు నిత్యం ఇక్కడకు వస్తుంటారు. అంతేకాకుండా ఈ దేవాలయంలో విగ్రహం హిందువులు పరమ పవిత్రంగా భావించే సాలిగ్రామ శిలతో తయారయ్యింది. అందువల్ల ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనదని హిందువులు భావిస్తారు. ఇది హరి హర క్షేత్రం కూడా. అంటే ఒకే క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు, ఆ పరమశివుడు కొలువై ఉన్నాడు. ఇటువంటి హరి హర క్షేత్రాలు భారత దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే కొన్నిమాత్రమే ఉన్నాయి. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ క్షేత్రం వివరాలు మీ కోసం..

ర్యాలి

ర్యాలి

P.C: You Tube

తూర్పు గోదావరి జిల్లా, ఆత్రేయపురం మండలంలో ఒక కుగ్రామమే ర్యాలి. ఇది ఆత్రేయపురం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ర్యాలీ రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కాకినాడ నుంచి 74 కిలోమీటర్లు, అమలాపురం నుంచి 34 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి ఈ పుణ్యక్షేత్రాన్ని చేరుకోవచ్చు.

క్షీరసాగర మధనం

క్షీరసాగర మధనం

P.C: You Tube

మహాభారత పురాణాలను అనుసరించి క్షీరసాగర మధనం తర్వాత అమృతం సముద్రం నుంచి పుడుతుంది. అయితే ఆ అమృతం కోసం రాక్షసులు, దేవతలు గొడవపడుతుంటారు. ఈ గొడవను సద్దుమనిగించడం కోసం శ్రీ మహావిష్ణువు అందమైన స్రీ రూపం ధరిస్తాడు.

జగన్మోహిని రూపం

జగన్మోహిని రూపం

P.C: You Tube

అటు పై ఆ అమృతం మొత్తాన్ని దేవతలకు అందజేస్తుంది. మహావిష్ణువు స్త్రీ రూపాన్ని జగన్మోహిని రూపం అంటారు. ఆ సమయంలో ఆ పరమశివుడు ఆ జగన్మోహిని రూపాన్ని చూసి మోహిస్తాడు. వారికి అయప్పస్వామి కూడా జన్మిస్తాడు.

ఒక పుష్పం రాలి భూమి పై పడిపోతుం

ఒక పుష్పం రాలి భూమి పై పడిపోతుం

P.C: You Tube

ఇదిలా ఉండగా పరమశివుడు జగన్మోహిని రూపంలో ఉన్న విష్ణువును చూసిన వెంటనే పట్టుకోవడానికి వెలుతాడు. ఆ సమయంలో విష్ణువు తప్పించుకోవడానికి కొంత దూరం పరుగెడుతాడు. అలా పరుగెత్తిన సమయంలో జగన్మోహిని కొప్పున ఉన్న ఒక పుష్పం రాలి భూమి పై పడిపోతుంది.

ఇది హరిహర క్షేత్రం

ఇది హరిహర క్షేత్రం

P.C: You Tube

అలా పుష్పం పడిన ప్రాంతమే ర్యాలి. ర్యాలి అంటే పడటం అని అర్థం కూడా ఉంది. ఇక ఇది హరిహర క్షేత్రం. అంటే ఒకే క్షేత్రంలో అటు విష్ణు రూపాన్ని ఇటు శివుడి విగ్రహాన్ని మనం చూడవచ్చు. దేశంలో ఒకే క్షేత్రంలో హరి హరులు ఇద్దరూ ఉండటం చాలా అరుదైన విషయం.

ఒకరికొకరు ఎదురుగా ఉంటారు

ఒకరికొకరు ఎదురుగా ఉంటారు

P.C: You Tube

ఈ ర్యాలిలోని ప్రధాన రహదారికి ఒకరికొకరు ఎదురుగా ఉంటారు. శ్రీ మహావిష్ణువు శ్రీ జగన్మోహిని కేశవ స్వామిగా భక్తులచేత నీరాజనాలు అందుకొంటుండగా ఆ పరమశివుడిని భక్తులు శ్రీ ఉమా కమండలేశ్వర స్వామిగా కొలుస్తుంటారు.

చోళ రాజా విక్రమ దేవుడు

చోళ రాజా విక్రమ దేవుడు

P.C: You Tube

గోదావరి ఉపనదులైన వశిష్ట, గౌతమి ఉప నదులు మధ్య ఈ దేవాలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన అప్పటి చోళ రాజా విక్రమ దేవుడు నిర్మించాడు. ఆయన ఒకసారి వేటకు ఈ ప్రాంతానికి వస్తాడు.

విష్ణువు కలలో కన్పించి

విష్ణువు కలలో కన్పించి

P.C: You Tube

వేటలో తీవ్రంగా అలసిపోయిన విక్రమ దేవుడు ఒక పెద్ద చెట్టు కింద నిద్రపోతాడు. ఆ సమయంలో విష్ణువు కలలో కన్పించి నీవు ప్రయాణించే సమయంలో రధ చక్రానికి ఉన్న మేకు కింద పడుతుంది. అక్కడ తన విగ్రహం ఉందని చెబుతాడు.

జగన్మోహిని కేశవ విగ్రహం

జగన్మోహిని కేశవ విగ్రహం

P.C: You Tube

రాజు నిద్రనుంచి మేలుకొని తిరిగి వేట కోసం బయలు దేరగా ప్రస్తుతం దేవాలయం ఉన్న చోట రథం చక్రానికి ఉన్న మేకు కిందికి పడిపోతుంది. అక్కడ రాజు భూమిని తవ్వించగా జగన్మోహిని కేశవ విగ్రహం బయటపడుతుంది. అదే ప్రదేశంలో రాజు స్వామివారికి దేవాలయం కట్టించాడు

ఐదు అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పుతో

ఐదు అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పుతో

P.C: You Tube

ఇది సాల గ్రామ ఏక శిలా విగ్రహం. సాల గ్రామాన్ని హిందువులు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక విగ్రహం ఐదు అడుగుల పొడవు మూడు అడుగుల వెడల్పుతో చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తుంది.ఒకే విగ్రహంలో ముందు విష్ణువు కేశవస్వామి రూపంలో ఉండగా వెనుకవైపు జగన్మోహిని రూపంలో ఉంటారు.

చక్కటి ముడితో ఉన్న జుట్టు కనిపిస్తాయి.

చక్కటి ముడితో ఉన్న జుట్టు కనిపిస్తాయి.

P.C: You Tube

ముందు వైపు నాలుగు చేతులతో శంఖు, చక్రము, గద, అభయహస్తం కలిగి ఉంటాడు. విగ్రహం పై భాగంలో ఆదిశేషుడు నీడపట్టి ఉంటాడు. విగ్రహం వెనుక వైపున ఇవి ఏమీ కనిపించవు. రెండు చేతులు, చక్కటి ముడితో ఉన్న జుట్టు కనిపిస్తాయి.

పిక్క పై నల్లని మచ్చ కూడా

పిక్క పై నల్లని మచ్చ కూడా

P.C: You Tube

అదేవిధంగా అందమైన మహిళలకు ఉన్న శరీర ఆక`తులను మనం ఈ విగ్రహంలో వెనుకవైపు అంటే జగన్మోహిని రూపంలోని విగ్రహంలో చూడవచ్చు. కుడికాలు పై పాదమునకు కొద్దిగా ఊర్థ్వ భాగాన అంటే పిక్క పై నల్లని మచ్చ కూడా ఉంది.

పద్మినీ జాతి స్త్రీ లక్షణం

పద్మినీ జాతి స్త్రీ లక్షణం

P.C: You Tube

ఈ ప్రాంతంలో మచ్చ ఉండటం పద్మినీ జాతి స్త్రీ లక్షణం అని చెబుతారు. నల్లని సాలిగ్రామ శిలతో తయారైనా శిల పై నల్లని రంగులో ఉన్న మచ్చ కూడా కనిపించడం విశేషం. ఇక శిఖ, నక పర్యంతం అంటే శిరస్సు పై ఉన్న చుట్టు నుంచి కాలి వేళ్లకు ఉన్న గోర్ల వరకూ ప్రతి ఒక్క భాగం ఈ శిల్పంలో మనకు కనిపిస్తుంది.

దీపపు నూనె వెలుగులో

దీపపు నూనె వెలుగులో

P.C: You Tube

ఇంతటి అందమైన విగ్రహంలోని ప్రతి అనువును అక్కడి పూజారులు దీపపు నూనె వెలుగులో భక్తులకు వివరించి చెబుతారు. దీపపు నూనె వెలుగులో ఆ జగన్మోహిని రూపంలోని సాలిగ్రామ శిల మరింత అందంగా కనిపిస్తుంది.

ఇటువంటి విగ్రహం మరెక్కడా లేదు

ఇటువంటి విగ్రహం మరెక్కడా లేదు

P.C: You Tube

విగ్రహం పాదం దగ్గర నిత్యం నీరు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ విగ్రహం ముందు వైపు జరిగే పూజలు, హారతి, నైవేద్య సమర్పణ అన్ని వెనుక వైపున కూడా జరుగుతాయి. దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఇటువంటి విగ్రహం మరెక్కడా లేదని చెబుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X