Search
  • Follow NativePlanet
Share
» »వీరభద్రుడి ప్రళయ తాండవం, భద్రకాళితో వివాహం ఇక్కడే అందుకే క్షుద్రపూజలు...

వీరభద్రుడి ప్రళయ తాండవం, భద్రకాళితో వివాహం ఇక్కడే అందుకే క్షుద్రపూజలు...

పట్టిసీమ వీరభద్ర ఆలయం గురించి కథనం

పవిత్ర గోదావరి నదీ తీరంలోని ఓ పర్వతం పై వీరభద్రుడు లింగ రూపంలో కొలువై ఉన్నాడు. ఇలా వీరభద్రుడు శివలింగం రూపంలో కొలువై ఉన్న పుణ్యక్షేత్రం భారత దేశంలో ఇక్కడ మాత్రమే ఉంది. ఇక ఇక్కడే వీరభద్రుడు భద్రకాళిని వివాహం చేసుకొన్నట్లు చెబుతారు.

ఇక ప్రమధ, భూత గణాలకు అధిపతి అయిన వీరభద్రుడు కొలువై ఉన్న ఈ క్షేత్రం అఘోర, క్షుద్రపూలకు కూడా నిలయమని చెబుతారు. చాలా రహస్యంగా ఇక్కడ ఈ క్షుద్రపూజ ఉపాసన చేసేవారు పూజలు చేస్తారని సమాచారం. అయితే పోలీసులు గట్టి చర్యలు తీసుకోవడం వల్ల ప్రస్తుతం ఆ క్షేత్రంలో అటువంటి కార్యకలాపాలు కొద్దిగా తగ్గాయని చెబుతారు.

శివరాత్రి పర్వదినాల్లో ఇక్కడ పెద్ద జాతర జరుగుతుంది. అదే విధంగా పౌర్ణమి రోజున, సోమవారాల్లో కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇంతటి విశిష్టమైన పుణ్యక్షేత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

పశ్చిమ గోదావరి జిల్లాలో

పశ్చిమ గోదావరి జిల్లాలో

P.C: You Tube

పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలానికి చెందిన గ్రామమే పట్టిసం. ఇది ఒక ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఇక్కడ వైష్ణవ ఆలయాన్ని కూడా మనం చూడవచ్చు. ఇది ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఈ పట్టిసం చాలా ప్రామూఖ్యం కలిగినది.

పాపి కొండల మధ్య

పాపి కొండల మధ్య

P.C: You Tube

దీనిని పట్టిసీమ అని కూడా పిలుస్తారు. పాపికొండల మధ్య సాగే గోదావరి నది ఒడ్డున ఉన్న దేవకూట పర్వతం పైన వీరభద్రస్వామి ఆలయం, భావనారాయణ స్వామి దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ మహాశివరాత్రి చాలా ఘనంగా నిర్వహిస్తారు.

వీరభద్రుడు భద్రికాళి వివాహం

వీరభద్రుడు భద్రికాళి వివాహం

P.C: You Tube

మొత్తం ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు లక్షల మంది ప్రజలు హాజరవుతారు. ఇక్కడ వీరభద్రుడు భద్రకాళితో వివాహం చేసుకున్నట్లు చెబుతారు. ఇందుకు సంబంధించిన పురాణ కథనం ప్రకారం దక్షపజాపతి తాను చేస్తున్న యాగానికి అల్లుడైన పరమశివుడితో పాటు కూతురైన దాక్షాయనిని కూడా ఆహ్వానించలేదు.

ఆత్మాహుతికి

ఆత్మాహుతికి

P.C: You Tube

అయితే పుట్టింటి పై మమకారంతో దాక్షాయణి యాగం జరిగే చోటుకు ఆహ్వానం లేకపోయినా వెళ్లి అవమానించబడి ఆత్మహుతికి పాల్పడుతుంది. విషయం తెలుసుకున్న పరమశివుడు తన అంశఅయిన వీరభద్రుడిని స`ష్టించి యాగాన్ని ధ్వంసం చేయడమే కాకుండా దక్షుడి తలను నరకాల్సిందిగా ఆదేశిస్తాడు.

తన ఆయుధమైన పట్టసం తో

తన ఆయుధమైన పట్టసం తో

P.C: You Tube

శివుడి ఆదేశం మేరకు దక్షుడి యాగవాటిక పై వీరభద్రుడు విరుచుకుపడుతాడు. తన ఆయుధమైన పట్టసం (పొడవైన వంకీ కత్తి)తో దక్షుడి తలను నరికి దానిని గోదావరి నదిలో కడిగాడు. అలా పట్టసం కడిగిన ప్రాంతమే కాలక్రమేన పట్టిసీమ అయ్యింది.

దేవకూట పర్వతం పై

దేవకూట పర్వతం పై

P.C: You Tube

ఇదిలా ఉండగా దక్షుడి తల నరికిన వీరభద్రుడు ఆవేశం చల్లారక దేవకూట పర్వతం పై ప్రళయతాండవం చేయసాగాడు. ఆ సమయంలో ఆయన త్రిశూలం నేలకు గుచ్చుకోవడంతో ఆ గుండం నుంచి భద్రకాళి ఉద్భవించిందని చెబుతారు.

సుదర్శన చక్రాన్ని

సుదర్శన చక్రాన్ని

P.C: You Tube

ఇక వీరభద్రుడిని నిలువరించడానికి శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. అయితే ఆ చక్రాన్ని వీరభద్రుడు నమిలి మింగేశాడు. దీన్ని బట్టి వీరభద్రుడి రౌద్రావతారాన్ని మనం అంచనా వేయవచ్చని ఇక్కడివారు చెబుతారు.

భావనారాయణుడిగా మారి

భావనారాయణుడిగా మారి

P.C: You Tube

ఇక శ్రీమన్నారాయణుడు భావనారాయణుడిగా మారి సహస్ర కమలాలతో పూజించి శాంతింపజేయడానికి ప్రయత్నించాడు. అయితే ప్రతి సారి ఒక కమలం తక్కువ అవుతూ ఉండటంతో తన వామ నేత్రాన్ని ఒక కమలంగా మార్చి వీరభద్రుడికి సమర్పించడాని స్థలపురాణం చెబుతతుంది.

అగస్త్య మహాముని

అగస్త్య మహాముని

P.C: You Tube

ఇదిలా ఉండగా వీరభద్రుడి ప్రళయ నాట్యాన్ని ఆపడానికి దేవతల కోరిక పై ఈశ్వరుడి అంతటి అగస్త్య మహర్షి వీరభద్రుడిని వెనుక నుంచి గట్టిగా పట్టుకొన్నాడు. దీంతో వీరభద్రుడి ఆవేశం చల్లారి ఆయన లింగ రూపంలో ఇక్కడి దేవకూట పర్వతం మీద వెలిసాడు.

ఆయనే వివాహం జరిపించాడు

ఆయనే వివాహం జరిపించాడు

P.C: You Tube

ఇక్కడే ఆ భద్రకాళితో వీరభద్రుడికి అగస్తుడు వివాహం జరిపించినట్లు స్థలపురాణం వివరిస్తుంది. అటు పై అగస్త్యుడు ఇక్కడ వీరభద్రుడిని వీరేశ్వరస్వామిగా పేర్కొన్ని భక్తితో ఆలింగనం చేసుకున్నాడని చెబుతారు.

ఆ చేతి గుర్తులు ఇప్పటికీ

ఆ చేతి గుర్తులు ఇప్పటికీ

P.C: You Tube

దీంతో వీరభద్రుడు శివలింగంగా మారినా కూడా ఆ చేతి గుర్తులు ఇప్పటికీ అక్కడ మనకు కనిపస్తుంటాయి. ఇదిలా ఉండగా శ్రీరాముడి అనుగ్రహం కోసం జాంబవంతుడు ఈ పర్వతం పైనే తపస్సు చేశాడని చెబుతారు.

 భూత గణాలకు

భూత గణాలకు

P.C: You Tube

ఇక్కడ వీరభద్రుడిని దర్శించుకున్న తర్వాతనే మోక్షాన్ని పొందారని చెబుతారు. ప్రమద, భూత గణాలకు అధిపతి అయిన వీరభద్రుడు కొలువైన క్షేత్రం కాబట్టి మొదట్లో ఈ దేవకూట పర్వతం పై క్షుద్రపూజలు ఎక్కువగా జరిగేవని చెబుతారు. ప్రస్తుతం కొంత తగ్గినా అమావస్య తదితర కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఇప్పటికీ ఇక్కడకు అఘోరాలు వచ్చి క్షుద్రపూజ ఉపాసన చేస్తుంటారని తెలుస్తోంది.

 రాజమండ్రి నుంచి

రాజమండ్రి నుంచి

P.C: You Tube

ఈ పట్టిసీమ నుంచి రాజమండ్రికి కేవలం 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సులు, ట్యాక్సీలు విరివిగా లభిస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతల నుంచి నుంచి రాజమండ్రికి విరివిగా రైలు సౌకర్యం ఉంది. ఇక కొవ్వూరు నుంచి గోదావరి గట్టుమీదుగా పట్టిసీమను చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X