Search
  • Follow NativePlanet
Share
» »బహిస్టు వస్త్రం, మద్యం ఇక్కడ ప్రసాదాలు

బహిస్టు వస్త్రం, మద్యం ఇక్కడ ప్రసాదాలు

భారత దేశంలోని వివిధ దేవాలయల్లో ఇచ్చే ప్రసాదాలకు సంబంధించిన కథనం.

By Kishore

అమృత బిందువులు పడ్డ ప్రాంతం...అమృత బిందువులు పడ్డ ప్రాంతం...

ఫ్రెండ్స్ తో...బెస్ట్ హాంగ్ఔట్ స్పాట్స్ ఇవేఫ్రెండ్స్ తో...బెస్ట్ హాంగ్ఔట్ స్పాట్స్ ఇవే

ప్రసాదం.... హిందూ సంస్కృతిలో ప్రసాదానికి విడదీయలేని బంధం. హిందువులు సందర్శించే ప్రతి దేవాలయంలో ఏదో ఒక ప్రసాదం అందజేస్తారు. కొన్ని దేవాలయాల్లో అందించే ప్రసాదం ప్రపంచ ప్రఖ్యాతి చెందాయి. అదే విధంగా కొన్ని దేవాలయాల్లో అందించే ప్రసాదం విచిత్రంగా ఉంటాయి. ఇలా భారత దేశంలోని కొన్ని దేవాలయాల్లో అందించే ప్రసాదాల్లో ప్రపంచ ప్రఖ్యాతి చెందినవాటితో పాటు విచిత్రమైన ప్రసాదాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

1. తిరుపతి

1. తిరుపతి

image Source:

ఎవరైనా సరే తిరుపతికి వెలుతున్నామని చెబితే చాలు వెంటనే మనం లడ్డు తేవడం మరిచిపోకండి అని చెబుతాం.
దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు తిరుపతి లడ్డు ప్రసాదం ఫేమస్సో.. కింది స్థాయి ఉద్యోగులు అధికారులను ప్రసన్నం చేసుకోవడానికి కూడా
తిరుపతి లడ్డూలను అందజేస్తుంటారు. ఇక్కడ దొరికే లడ్డు ప్రపంచంలో మరెక్కడా దొరకదు. అందుకే దీనికి జీఐ (జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్) గుర్తింపు లభించింది.

2. పళని

2. పళని

image Source:

తమిళనాడులోని పళినిలో కొండపై ఉన్న కుమారస్వామి దేవాలయంలో కూడా ఒకసారి ప్రసాదం తిన్నవారు ఆ రుచిని మరిచిపోలేరు.
ముఖ్యంగా ఐదు రకాల పళ్లు, బెళ్లంతో పాటు మరికొన్ని దినుసులను వినియోగిస్తారు. అటు పై వాటిని నుంచి రసాన్ని తీసి భక్తులకు పంచుతారు. గతంలో చేతితో ఈ రసాన్ని తయారు చేసేవారు. భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడం వల్ల యంత్రాలను వినియోగించి ఈ రసాన్ని తయారుచేసి భక్తులకు ప్రసాదంగా ఇస్తున్నారు.

3. కామాఖ్య దేవి దేవాలయం

3. కామాఖ్య దేవి దేవాలయం

image Source:

అస్సాం లోని కామాఖ్య దేవి దేవాలయంలో భక్తులకు ప్రసాదంగా ఏమి ఇస్తారో తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. సతీదేవి యోని ఇక్కడ పడిందని చెబుతారు. ఆ యోనికే ఇక్కడ నిత్యం పూజలు జరుగుతాయి. ఇక్కడ ఉన్నటు వంటి కామాఖ్య దేవికి రుతుస్రావం (పిరియడ్) అవుతుందని చెబుతారు. ఆ సమయంలో దేవాలయాన్ని మూడు రోజుల పాటు మూసివేస్తారు. ఈ ప్రక్రియకు ముందు ఆ యోని పై తెల్లటి వస్త్రాన్ని కప్పుతారు. నాలుగో రోజు
దేవాలయం తలుపులు తీసిన తర్వాత సదరు బట్టలను భక్తులకు ప్రసాదంగా పంచుతారు.

4. కర్ణిమాత దేవాలయం

4. కర్ణిమాత దేవాలయం

image Source:

బీహార్ లోని కర్ణిమాత దేవాలయంలో నిత్యం వేల సంఖ్యలో ఎలుకలు తిరుగుతూ ఉంటాయి. మొదట ఈ ఎలుకలకు ఆహారం రూపంలో లడ్డూలు, పాలు పెడుతారు. ఆ ఎలుకలు తిని వదిలిన వాటిని భక్తులు ప్రసాదంగా తింటారు.

5. అళఘర్ దేవాలయం మధురై

5. అళఘర్ దేవాలయం మధురై

image Source:

తమిళనాడులోోని మధురైలో ఉన్న అళఘర్ దేవాలయానికి భక్తులు కానుకల రూపంలో బియ్యాన్ని ఇస్తారు. ఈ బియ్యం నుంచి దోసె పిండి తయారుచేసి వాటి నుంచి దోసెలు వేస్తారు. ఆ దోసెలనే భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు.

6. వైష్ణోదేవి దేవాలయం

6. వైష్ణోదేవి దేవాలయం

image Source:

ఈ దేవాలయంలో ప్రసాదంగా బొరుగులు అటుకులకు బెల్లం కలిపి ఇస్తారు. అదే విధంగా కొబ్బరి, తేనెతో తయారు చేసిన పదార్థాన్ని కూడా భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. అయితే ఈ దేవాలయంలో ఉన్న రుచి మనం ఇంటిలో తయారు చేసుకొన్న ప్రసాదం రుచితో పోలిస్తే వంద రెట్లు ఎక్కువగా ఉంటుందని చెబుతారు.

7. పూరి జగన్నాథ దేవాలయం

7. పూరి జగన్నాథ దేవాలయం

image Source:

భారత దేశంలో ఎక్కువ మంది భక్తులు వెళ్లే దేవాలయంలో పూరి లోని జగన్నాథ దేవాలయం ముందు వరుసలో ఉంటుంది. ఇక ఈ దేవాలయంలో భక్తులకు ప్రసాదంగా అందించే పదార్థం కూడా విశిష్టంగా ఉంటుంది. 56 పదార్థాలను కలిపి తయారు చేసే ప్రసాదం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

8. కాలభైరవ దేవాలయం

8. కాలభైరవ దేవాలయం

image Source:

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో కాలభైరవ దేవాలయానికి భక్తులు విస్కీని కానుకగా అందజేస్తారు. ఆ విస్కీని ఒక ప్లేటులో వేసి విగ్రహం నీటికి అందజేస్తారు. అటు పై అదే విస్కీని భక్తులు ప్రసాదంగా అందజేస్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X