Search
  • Follow NativePlanet
Share
» »బ్రహ్మ నారసింహుడి కాళ్లు కడిగిన ప్రాంతం...అక్కడ పుష్కరిణిలో స్నానం చేస్తే,

బ్రహ్మ నారసింహుడి కాళ్లు కడిగిన ప్రాంతం...అక్కడ పుష్కరిణిలో స్నానం చేస్తే,

తెలంగాణలోని యాదగిరి గుట్టకు సంబంధించిన కథనం.

By Beldaru Sajjendrakishore

ఐరావతం స్నానం చేసిన చోటు..ఐరావతం స్నానం చేసిన చోటు..

నోరూరించే స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ ఫేమస్నోరూరించే స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ ఫేమస్

మైసూరు వచ్చినప్పుడు ఏమేమి కొనాలో తెలియదామైసూరు వచ్చినప్పుడు ఏమేమి కొనాలో తెలియదా

ఈ సకల చారా చర సృష్టి మూలం బ్రహ్మ. అతని వల్లనే ఈ జగత్తులోని అన్ని జీవులు సృష్టించబడుతున్నాయి. అటు వంటి బ్రహ్మ నారసింహుడి కాళ్లను కడిగిన ప్రాంతం యాదగిరి. ఇందు కోసం ఆకాశ గంగను నేల పైకి తీసుకువచ్చాడు. ఆ ఆకాశగంగ ఇప్పటికీ అక్కడే ఉంది. ఆ యాదగిరిలో ఆకాశగంగ విష్ణు పుష్కరిణి పేరుతో భక్తుల కొంగు బంగారమై విరాజిల్లు తోంది. ఈ పుష్కరిణిలో స్నానం చేస్తే సమస్త పీడలు తొలిగి పోతాయాని నమ్ముతారు. అంతే కాకుండా గుట్ట పై ఉన్నటువంటి స్వామి వారిని మెట్ల మార్గం ద్వారా నడుచుకుని వెళ్లి సందర్శించుకుంటే మోకాళ్ల నొప్పులు మాయవుతాయని భక్తుల విశ్వాసం. అందువల్లే దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు వేల సంఖ్యలో వస్తుంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన విశిష్టతలు కలిగిన ఆ యాదగిరి గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

1. వాల్మీకి రామాయణంలో

1. వాల్మీకి రామాయణంలో

Image Source:

యాదగిరి గుట్టకు సంబంధించి కథనం మనకు వాల్మీకి రామాయణంలో కనిపిస్తుంది. అందులో ఉన్న వివరాల ప్రకారం విభాండక రుషి, శాంతల దంపతుల కుమారుడు రుష్యశృంగ మహర్షి. అతని కుమారుడే యద మహర్షి.

2. శ్రీ మహావిష్ణువు భక్తుడు

2. శ్రీ మహావిష్ణువు భక్తుడు

Image Source:

ఇతను చిన్నప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు భక్తుడు. ఒకసారి హనుమంతుడి సలహామేరకు ప్రస్తుతం యాదగిరిగా పిలువబడుతున్న ప్రాంతంలో చాలా ఏళ్లపాటు తపస్సు చేశాడు. ఆ సమయంలో ఆహార అన్వేషణలో అక్కడకు వచ్చిన ఒక రాక్షసుడు యాద మహర్షిని తినబోతాడు.

3. సుదర్శన చక్రం ప్రయోగించి

3. సుదర్శన చక్రం ప్రయోగించి

Image Source:

ఈ విషయం తపస్సులో ఉన్నయదమహర్షికి తెలియదు. అయితే ఆయన ఎవరి గురించి తపస్సు చేస్తున్నాడో ఆ శ్రీ మహావిష్ణువుకు ఈ విషయం తెలుస్తుంది. భక్తల రక్షకుడు అయిన ఆ విష్ణువు వెంటనే తన సుదర్శన చక్రం ప్రయోగించి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు.

4. పలు విధాలుగా ప్రార్థిస్తాడు

4. పలు విధాలుగా ప్రార్థిస్తాడు

Image Source:

రాక్షసుడి ఆహాకారాలకు తమస్సు నుంచి బయటికి వచ్చిన యద మహర్షి విషయం తెలుసుకొని ఆ సుదర్శన చక్రాన్ని పలు విధాలుగా ప్రార్థిస్తాడు. భక్తులకు ఏవిధమైన బాధలూ కలగకుండా దుష్టసంహారం చేస్తూ అక్కడే ఉండిపొమ్మని కోరుతారు.

5. షట్కోణాకారంలో

5. షట్కోణాకారంలో

Image Source:

అయితే తాను త్వరలో ఇక్కడ వెలియనున్న లక్ష్మీనరసింహస్వామి ఆలయ శిఖరం పై భాగన షట్కోణాకారంలో ఒక పెద్ద చక్రంగా ఉండిపోయి భక్తులను సదా కాపాడుతూ ఉంటానని చెప్పి అంతర్థానమయ్యాడు.

6. ఆయన తపస్సుకు మెచ్చి

6. ఆయన తపస్సుకు మెచ్చి

Image Source:

అటు పై చాలా సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆయన తపస్సుకు మెచ్చి విష్ణువు నరసింహస్వామి రూపంలో ప్రత్యక్షమయ్యి యద మహర్షి కోరిక పై అక్కడ లక్ష్మీ నరసింహస్వామి రూపంలో వెలిశాడు.

7. మరలా తపస్సు

7. మరలా తపస్సు

Image Source:

ఆ మహర్షి పేరుమీదగానే ఇక్కడి గుట్ట యాద గిరి ప్రఖ్యాతి చెందింది. కొన్ని రోజులకు యద మహర్షికి నరసింహ స్వామిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించింది. దీంతో మరలా తపస్సు చేస్తాడు. భక్తుడి కోరిక మేరకు స్వామి వారు జ్వాలా, యోగ, నంద, గండబేరుండ, నారసింహ రూపాల్లో ఇక్కడ దర్శనమిస్తాడు.

8. పంచ నారసింహ క్షేత్రం

8. పంచ నారసింహ క్షేత్రం

Image Source:

అందువల్లే ఈ క్షేత్రాన్ని పంచ నారసింహ క్షేత్రం అని అంటారు. ఈ క్షేత్రానికి సంబంధిచిన మరో కథనం ప్రకారం ప్రహ్లాదడిని రక్షించడం కోసం అహోబిలంలో నరసింహస్వామి స్తంభాన్ని చీల్చుకుని వచ్చి హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత ఆ భీకర రూపాన్ని శాంత పరచడం ఎవరికీ సాధ్యం కాలేదు.

9. అలా ఉండటం సమంజసం కాదని

9. అలా ఉండటం సమంజసం కాదని

Image Source:

దీంతో దేవతలంతా లక్ష్మీదేవిని ప్రార్థిస్తే ఆవిడ ప్రత్యక్షమై స్వామిని శాంతింపజేస్తుంది. అప్పుడు ప్రహ్లాదుడు స్వామి వారిని అక్కడే ప్రసన్న రూపంలో కొలువై ఉండమని కోరుతాడు. అయితే స్వామి అతి భీకర రూపంలో దర్శనమిచ్చిన ప్రదేశంలో శాంతరూపంలో కొలువై ఉండటం లోక విరుద్ధమ తెలుపుతాడు.

10. ఆయలన వెంటనే అందరు దేవతలు

10. ఆయలన వెంటనే అందరు దేవతలు

Image Source:

అక్కడికి సమీపంలో ఉన్న యాదగిరిలో లక్ష్మీనరసింహస్వామిగా కొలువై ఉండి భక్తులకు శాంత రూపంలో దర్శనమిస్తానని చెప్పి బయలు దేరుతారు. ఆయన వెంట ప్రహ్లాదుడితో పాటు సకల దేవతలూ అక్కడకు వచ్చి స్వామివారిని సేవించారు.

11. ఆకాశ గంగతో

11. ఆకాశ గంగతో

Image Source:

ఇక రాక్షస సంహారం చేసిన నారసింహుడి కాళ్లను స్వయాన సష్టి కర్త అయిన బ్రహ్మదేవుడు ఆకాశ గంగతో కడిగాడని చెబుతారు. ఆ ఆకాశ గంగ లోయలో నుంచి పారి ప్రస్తుతం దేవాలయం దగ్గర ఉన్న విష్ణు పుష్కరిణిలోకి చేరుతుంది.

12. అందువల్లే పరమ పవిత్రమైనది

12. అందువల్లే పరమ పవిత్రమైనది

Image Source:

దీంతో ఆ పుష్కరిణి పరమ పవిత్రమై పోయిందని స్థానక భక్తులు చెబుతుంటారు. అందువల్లే ఇక్కడ స్నానం చేసి స్వామివారిని భక్తితో ప్రార్థించిన వారికి సకల కోరికలూ తీరుతాయని అందరూ నమ్ముతారు.

13. దీర్ఘకాలిక రోగాలతో

13. దీర్ఘకాలిక రోగాలతో

Image Source:

ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారితో పాటు గ్రహపీడ నివారణ కోసం భక్తులు ఇక్కడ కొన్ని రోజుల పాటు ఉండి ఈ విష్ణు పుష్కరణిలో స్నానం చేసి తమ బాధలను పోగొట్టు కొంటూ ఉంటారు.

14. బుుషి పుంగవులు

14. బుుషి పుంగవులు

Image Source:

మరోవిషమేమిటంటే ఇప్పటికీ ఈ గుట్ట చుట్టుపక్కల వందల సంఖ్యలో రుషి పుంగవులు తపస్సు చేసుకొంటూ ఉన్నారని చెబుతారు. వారి రాత్రి పూట ఈ పుష్కరిణిలో స్నానం చేస్తారని చెబుతారు. అందుకు గుర్తుగా వారు వచ్చేసమయంలో మృదంగ ధ్వనులు రావడం మనం వినవచ్చు.

15. రెండు ఆలయాలు

15. రెండు ఆలయాలు

Image Source:

ఈ యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రంలో రెండు లక్ష్మీ నరసింహస్వామి ఆలయాలుు ఉన్నాయి. ఒకటి పాత లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కాగా, మరొకటి కొత్త లక్ష్మీ నరసింహస్వామి ఆలయం.

16. ఆ గుర్తులను మనం చూడవచ్చు

16. ఆ గుర్తులను మనం చూడవచ్చు

Image Source:

ప్రతి రోజూ లక్ష్మీ నరసింహ స్వామి పాత దేవాలయం నుంచి కొత్త దేవాలయానికి గుర్రం పైన వెలుతాడని చెబుతారు. ఇందుకు గుర్తుగా మనం గుర్రం కాలు గుర్తులను చూడవచ్చు. ఆలయ గర్భగుడిలో నిత్యం ప్రవహించే జల ప్రవాహం మనం చూడవచ్చు. ఈ జలంతోనే నిత్యం స్వామివారిని అభిషేకిస్తారు.

17.కీళ్ల నొప్పులు తగ్గుతాయి

17.కీళ్ల నొప్పులు తగ్గుతాయి

Image Source:

ఇక్కడ ఉన్న మరో ముఖ్యమైన విశేషం ఏమిటంటే గుట్ట మీద ఉన్న స్వామివారిని మెట్లు ఎక్కి దర్శనం చేసుకుంటే కీళ్ల నొప్పులు ఉన్న వారికి ఆ వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుందని చెబుతారు. అందువల్లే దేశంలోని వివిధ ప్రాంతా లనుంచి ఇక్కడకు రోజూ వేలాదా సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు.

18. ఎలా చేరుకోవాలి

18. ఎలా చేరుకోవాలి

Image Source:

యాదగిరికి హైదరాబాద్ నుంచి నిత్యం బస్సులు వెలుతుంటాయి. నల్గొండ, వరంగల్ నుంచి కూడా ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు చాలా ఉన్నాయి. భారత దేశంలోని చాలా ప్రాంతల నుంచి హైదరాబాదుకు విమానయాన సర్వీసులు ఉన్నయి. అక్కడి నుంచి ప్రైవేటు ట్యాక్సీలు కూడా మనకు దొరుకుతాయి.

19. సందర్శనీయ స్థలాలు

19. సందర్శనీయ స్థలాలు

Image Source:

యాదగిరి గుట్టకు దగ్గర్లో హైదరాబాద్ ఉంది. దీనితో పాటు కొలనుపాక, భువనగిరి కోట కూడా చూడదగిన ప్రదేశాలు. అంతేకాకుండా సురేంద్రపురి హనుమదీశ్వరాలయం కూడా చూడదగినదే.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X