Search
  • Follow NativePlanet
Share
» »బ్రహ్మకే పోయిన జ్జానం ప్రసాదించిన చోటు సందర్శిస్తే పోగొట్టుకున్న సంపద, జ్జానం...

బ్రహ్మకే పోయిన జ్జానం ప్రసాదించిన చోటు సందర్శిస్తే పోగొట్టుకున్న సంపద, జ్జానం...

By Beldaru Sajjendrakishore

తాను పోగొట్టుకున్న జ్జానాన్ని పొందడానికి సాక్షాత్తు బ్రహ్మ ఈ క్షేత్రంలోని సరస్సులో స్నానం చేసి తిరిగి తన బ్రహ్మజ్జానాన్ని పొందాడు. త్రేతా యుగములో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారము చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుడిని ఆరాధిస్తాడు. అటు పై మాత్రమే రాముడికి మన:శాంతి దక్కిందని స్థలపురాణం చెబుతుంది. ముఖ్యంగా తన తండ్రి అయిన పరమేశ్వరుడికి కుమారస్వామి ప్రణవ రహస్యాన్ని ఇక్కడే చెప్పడంటారు. ఇంతటి శక్తి గల ఆ పుణ్యక్షేత్రం మన పొరుగున ఉన్న తమిళనాడులోని తిరుత్తణిలో ఉంది. ఈ క్షేత్రంతో పాటు సమీపంలోనే ఉన్న తిరుప్పాచూరు అనే పుణ్యక్షేత్రం గురించి ఈ వ్యాసంలో మనం తెలుసుకుందాం.

1. తమిళులకు ఆరాధ్య దైవం

1. తమిళులకు ఆరాధ్య దైవం

1. తమిళులకు ఆరాధ్య దైవం

Image Source:

తిరుత్తణి తమిళనాడులో గల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దైవం సుబ్రహ్మణ్య స్వామి. కొండపై ఉన్న ఈ ఆలయం చాలా ప్రాచీనమైనది. ఈ దివ్య క్షేత్రంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వల్లీ దేవసేన అమ్మవార్ల సహితంగా కొలువయ్యారు. తమిళనాడులోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేరుగాంచిన ఈ క్షేత్రం తమిళులందరికీ ఆరాధ్య క్షేత్రం. తమిళుల ఇష్టదైవంగా, ఇలవేల్పుగా పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ మురుగపెరుమాళ్ళుగా పూజలందుకుంటున్నాడు.

2. చుట్టూ కొండలు

2. చుట్టూ కొండలు

2. చుట్టూ కొండలు

Image Source:

శ్రీవారు వెలసి ఉన్న కొండకు ఇరుప్రక్కలందూ పర్వత శ్రేణులు వ్యాపించి ఉన్నాయి. ఉత్తరాన గల పర్వతం కొంచెం తెల్లగా ఉండడంవల్ల దీనిని ‘బియ్యపుకొండ' అని పిలుస్తారు. దక్షిణం వైపునగల కొండ కొంచెం నల్లగా ఉండడంవల్ల దానిని ‘గానుగ పిండి కొండ' అని పిలవడం జరుగుతోంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవతలు, మునుల బాధలు పోగొట్టడానికి శూరపద్మునితో యుద్ధం చేసిన అనంతరం, వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజులతో చేసి చిన్నపోరు ముగిసిన అనంతరం శాంతించి, ఇక్కడ ఈ క్షేత్రంలో కొలువయ్యాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది.

3. స్వామి శాంతించి

3. స్వామి శాంతించి

3. స్వామి శాంతించి

Image Source:

స్వామి శాంతించి ఇక్కడ కొలువయ్యాడు కనుక ఈ క్షేత్రానికి ‘తణిగై' లేదా ‘శాంతిపురి' అనే పేరొచ్చింది. అలాగే ‘తణిగ' అనే తమిళ పదానికి తెలుగులో మన్నించుట, లేదా ఓదార్చుట అని అర్థం చెబుతారు. స్వామి భక్తుల తప్పులను, పాపాలను మన్నించి, కటాక్షిస్తాడు కనుక ఈ క్షేత్రానికి తిరుత్తణి అని పేరు వచ్చింది.

4. రాముడికి, విష్ణువుకి

4. రాముడికి, విష్ణువుకి

4. రాముడికి, విష్ణువుకి

Image Source:

త్రేతా యుగములో శ్రీ రామచంద్ర ప్రభువు రావణ సంహారము చేసిన తర్వాత రామేశ్వరంలో ఈశ్వరుడిని ఆరాధిస్తాడు. అక్కడ, ఈశ్వరుడి ఆనతి మేరకు, శ్రీ రాముడు ఈ తిరుత్తణి క్షేత్రము దర్శించాడు. ఆ తర్వాతనే శ్రీరామచంద్రునికి పూర్తి మనశ్శాంతి కలిగింది. ద్వాపర యుగములో, మహా వీరుడైన అర్జునుడు దక్షిణ దేశ తీర్థ యాత్రలు చేస్తూ, ఇక్కడ తనికేశన్ స్వామి వారిని కొలిచాడు. శ్రీ మహా విష్ణువు ఈ క్షేత్రములోనే సుబ్రహ్మణ్యుడి పూజ చేసి ఆయన పోగొట్టుకున్న శంఖు, చక్రములను తిరిగి పొందినాడు. (అంతకు పూర్వం వాటిని తారకాసురుడు శ్రీ మహా విష్ణువు నుండి చేజిక్కించుకుంటాడు).

5. బ్రహ్మ కైలాసం వెలుతుండగా

5. బ్రహ్మ కైలాసం వెలుతుండగా

5. బ్రహ్మ కైలాసం వెలుతుండగా

Image Source:

పూర్వము ఒకనాడు చతుర్ముఖ బ్రహ్మ గారు కైలాసం వైపు వెడుతూ వుండగా, సదా చిద్విలాసంతో ఉండే సుబ్రహ్మణ్యుడు, బ్రహ్మను ఆపి " బ్రహ్మమనగా ఏమి?, ప్రణవమునకు అర్ధం తెలుసా? " అని అడిగారు. దానికి బ్రహ్మ " బ్రహ్మము అనగా నేనే'' అని సమాధానం ఇస్తాడు. వెంటనే కార్తికేయుడు, మీరు నాలుగు ముఖములతో వేదములు చెప్తున్నారు కాని, బ్రహ్మము అర్ధం కాలేదు అని బ్రహ్మ గారిని చెరసాలలో బంధించారు.

6. పరమ శివుడు వారించాడు

6. పరమ శివుడు వారించాడు

6. పరమ శివుడు వారించాడు

Image Source:

వెంటనే పరమశివుడు వచ్చి, "నాన్నా, బ్రహ్మ గారికి జ్ఞానములో కించిత్ దోషం ఉండవచ్చు, అంత మాత్రాన కారాగారములో పెట్టకూడదు. ఆయనని విడిచి పెట్టేయి" అని చెప్పగా, సుబ్రహ్మణ్య స్వామి వారు వెంటనే బ్రహ్మ గారిని విడిచిపెడతారు. అంతే కాక, సుబ్రహ్మణ్యుడు శంకరుడితో అంటారు, " నేను ఎంత మీ కుమారుడనైనా, బ్రహ్మ గారిని అలా అవమానించకూడదు" అని, దీనికి ప్రాయశ్చిత్తంగా సర్ప రూపం దాల్చి భూలోకంలో వచ్చి ఉన్నారు . అలా ఉండగా పిల్లలూ, అందరూ వచ్చి రాళ్ళతో కొడుతూ ఉంటే, పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి షష్ఠీ వ్రతం చేయించింది. దానితో ఆయన పాపం తొలగి పూర్తి తెజోమయుడైన సుబ్రహ్మణ్య రూపం వచ్చిందని అంటారు పెద్దలు.

7. బ్రహ్మ కోల్పోయిన శక్తి

7. బ్రహ్మ కోల్పోయిన శక్తి

7. బ్రహ్మ కోల్పోయిన శక్తి

Image Source:

కుమారస్వామి శాపం వల్ల బ్రహ్మ తన జ్జానం కోల్పోతాడు. దీంతో సృష్టి చేసే సామర్థ్యం కోల్పోతాడు. చివరికి ఆయన పరమ శివుడితో పాటు కుమారస్వామిని వేడుకోగా ఇక్కడ తిరుత్తణిలో ఉన్న బ్రహ్మ తీర్థములో కార్తికేయుని పూజించి, ఆయన తిరిగి శక్తి సామర్ధ్యములను పొందాడని చెబుతారు. ఇక దేవేంద్రుడు ఈ క్షేత్రములోనే, ఇంద్ర తీర్థములో, " కరున్ కువలై " అనే అరుదైన పూల మొక్కను నాటి, ప్రతి రోజూ ఆ మొక్క ఇచ్చే మూడు పుష్పములతో ఇక్కడ షణ్ముఖుని పూజించాడు. ఆ తర్వాతనే, ఇంద్రుడు తారకాసురాది రాక్షసుల ద్వారా పోగొట్టుకున్న " సంఘనీతి, పద్మనీతి, చింతామణి " మొదలైన దేవలోక ఐశ్వర్యమును తిరిగి పొందాడు.

8. కుమారేశ్వరుడు ఇక్కడే

8. కుమారేశ్వరుడు ఇక్కడే

8. కుమారేశ్వరుడు ఇక్కడే

Image Source:

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ తన తండ్రి అయిన పరమేశ్వరుని పూజించ తలచి తిరుత్తణి కొండపై తన నివాసానికి ఈశాన్య భాగాన శివలింగ ప్రతిష్టచేసి సేవించాడట. కుమారస్వామి పితృభక్తికి మెచ్చిన సాంబశివుడు సంతోషించి కుమారస్వామికి ‘జ్ఞానశక్తి' అనే ‘ఈటె'ను అనుగ్రహించాడట. ఆ కారణాన ఈ స్వామికి "జ్ఞానశక్తి ధరుడు" అనే పేరొచ్చింది. ఇక్కడ కుమారస్వామి స్థాపించిన లింగానికి కుమారేశ్వరుడనే పేరొచ్చింది. కుమారస్వామి, శివుని అర్చించడానికి సృష్టించిన తీర్థమే కుమారతీర్థము. దీనిని శరవణ తీర్థమని కూడా పిలుస్తారు.

9. ఆలయం ఎవరు కట్టించారంటే

9. ఆలయం ఎవరు కట్టించారంటే

9. ఆలయం ఎవరు కట్టించారంటే

Image Source:

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారి ఆలయం అతి పురాతనమైనది. 1600 సంవత్సరాలకు పూర్వంనుంచే ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు శాసనాల ద్వారా అవగతమవుతోంది. క్రీ.శ.875-893 లో అపరాజిత వర్మ అనే రాజు శాసనమందు, క్రీ.శ.907-953 లో మొదటి పరాంతక చోళుడి శాసనంలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావించబడటంవల్ల 1600 సంవత్సరాలకు పూర్వమే పల్లవ, చోళ రాజుల చేత ఈ క్షేత్రం కీర్తింపబడిందని అవగతమవుతోంది.

10. బంగారు బిల్వపత్రాలు

10. బంగారు బిల్వపత్రాలు

10. బంగారు బిల్వపత్రాలు

Image Source:

ఇక్కడ ఉత్సవ మూర్తులుగా ఉన్న వల్లీ, దేవసేనా, సుబ్రహ్మణ్యులకు పైన ఉండే విమానము (ఛత్రము) రుద్రాక్షలతో చేసినది. చాలా అందముగా ఉంటుంది. అంతేకాదు, స్వామి వారు ఒక ఆకు పచ్చని రంగులో ఉండే షట్కోణ పతకము ధరించి మిల మిల మెరిసి పోతూ ఉంటారు. ఇక్కడ బంగారు బిల్వ పత్రముల మాలతో కూడా స్వామి వారిని అలంకరిస్తారు.

11. తిరుత్తునికి ఎలా వెళ్లాలి

11. తిరుత్తునికి ఎలా వెళ్లాలి

11. తిరుత్తునికి ఎలా వెళ్లాలి

Image Source:

తిరుత్తణి తమిళనాడులో తిరుపతి నుంచి ఆరక్కోణం వెళ్ళే దారిలో ఉంది. రోడ్డు ద్వారా: చెన్నై నుండి 84 కి.మీ., తిరుపతి నుండి 68 కి.మీ., అరక్కోణం ( కాణిపాకం ) నుండి 13 కి.మీ. దూరంలో ఈ క్షేత్రం ఉంది. ఈ ప్రదేశాలు అన్నిటి నుంచి బస్సు సౌకర్యం ఉంది. మన కూడా తిరుపతి నుంచి అనేక బస్సులు నడుపుతుంది. రైలు ద్వారా: దీనికి దగ్గరలోని రైల్వే స్టేషను అరక్కోణం. ఇది ఒక రైల్వే జంక్షన్. అంతేకాక, చెన్నై నుండి తిరుత్తణికి అనేక లోకల్ రైళ్ళు నడుస్తాయి.

12. తిరువళ్ళూరు - తిరుత్తణి మధ్య

12. తిరువళ్ళూరు - తిరుత్తణి మధ్య

12. తిరువళ్ళూరు - తిరుత్తణి మధ్య

Image Source:

తిరుప్పొచ్చూరు తమిళనాడు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రము. ఇది చెన్నై జాతీయ రహదారి మీద తిరువళ్ళూరు - తిరుత్తణి మధ్య ఉంది. ఇక్కడి వాసీశ్వరస్వామి ఆలయం పురాతనమైనది ప్రసిద్ధిచెందినది. ఈ క్షేత్రానికి తూర్పున తిరువళ్ళూరులో వీరరాఘవస్వామి, మరోవైపు శైవక్షేత్రాలలో రత్నసభగా పేర్కొనబడే తిరువలంగాడు, ఉత్తరదిశగా పూండి సరస్సుకు సరిహద్దున ఉండ్రేశ్వరస్వామి, దక్షిణదిశగా కూపం అనబడే తిరువిలాస్ కోవిల్ మొదలైన క్షేత్రాలున్నాయి.

13. పూర్వం వనస్థలి

13. పూర్వం వనస్థలి

13. పూర్వం వనస్థలి

Image Source:

పూర్వం ఈ ప్రాంతం దట్టమైన వెదురు పొదలతో నిండిన అరణ్యంగా ఉండి 'వనస్థలి' అని పిలువబడేది. ఇక్కడ ఒక గొల్లవాడు అడవికి గోవును మేతకు త్రోలుకెళ్ళి అచ్చట వున్న వెదురుపొదను గొడ్డలితో నరకగా ఉన్నట్లుండి పొదనుండి రక్తం పైకి చెమ్మినది. అతడు భయపడి చుట్టూ వున్నవారిని పిలిచి అక్కడ మట్టిని తొలగించి చూడగా వారికి అపురూపమైన శివలింగం ప్రత్యక్షమైనది.

14. లింగం పై భాగంన రక్తం

14. లింగం పై భాగంన రక్తం

14. లింగం పై భాగంన రక్తం

Image Source:

లింగం పైభాగం నుండి రక్తం స్రవిస్తూ ఉంది. అలా స్వయంభవుగా వెలిసిన శివలింగాన్ని, పరిసరాల్ని శుభ్రపరచి పూజావిధులు ఏర్పాటుచేశారు. స్వామి వెదురుపొదలలో జన్మించాడు కాబట్టి "వేయిస్త్రనాథన్" అని కూడా పేర్కొంటారు. ఈ క్షేత్రంలో నేటికీ వెదురు పొదే స్థలవృక్షంగా పూజింపబడుతూ ఉంది. ఇక్కడి వాసీశ్వరస్వామి మహత్యాన్నిగురించి, శైవ నయనార్లు, అప్పర్, జ్ఞాస సంబందర్, రితునాపకరసు, సుందరర్, రామలింగస్వామి, జయం కొండారు, సూరిద్వయం ప్రశంసించారు.

15. చంద్రుడు తపస్సు చేసిన ప్రాంతం

15. చంద్రుడు తపస్సు చేసిన ప్రాంతం

15. చంద్రుడు తపస్సు చేసిన ప్రాంతం

Image Source:

ప్రముఖ శైవకవి జ్ఞాన సంబందర్ తన రచనలలో ఈ స్వామి వెలిసిన ప్రదేశాన్ని 'పాచిఊరు' అని పేర్కొన్నాడు. నాటి ఈ పాచిఊరే కాలగమనంలో తిరుప్పొచ్చూరుగా పిలుస్తున్నారు. తమిళ సాహిత్యంలో ఈ క్షేత్రాన్ని పుణ్యావర్తము, గుడారణ్యము, మాణిఖ్యపురి, ప్రళయ కాలక్షేత్రం, అభయక్షేత్రం, సోమపురం మొదలైన పేర్లతో ప్రస్తుతిస్తూ ఉంది. అప్పర్ కవి ఈ క్షేత్రమందు చంద్రుడు పరమేశ్వరుని గురించి తపస్సు చేసి స్వామి అనుగ్రహాన్ని పొందాడని పేర్కొన్నాడు.

16. మరో కథనం ప్రకారం

16. మరో కథనం ప్రకారం

16. మరో కథనం ప్రకారం

Image Source:

వాసీశ్వర స్వామిని వేయిస్త్రనాథర్, పాచ్చూర్ నాథర్ అని కూడా కొలుస్తారు. 'వాసి' అంటే గొడ్డలి. వాసితో వెదురుపొదను నరుకుతూ ఉండగా ఉద్భవించిన స్వామి కాబట్టి వాసీశ్వరుడని అంటున్నారు. వాసి అనగా వన్నె అని కూడా అర్ధం. దీనికి కారణమైన మరో కథనం ప్రకారం తిరుప్పొచ్చూరు సమీపంలోని 'కారణి' గ్రామంలో గుణవతి అనే గొల్లవనిత నిత్యం స్వామి నైవేద్యానికి పాలు సమర్పించేది.

17 మేలిమి బంగారం

17 మేలిమి బంగారం

17 మేలిమి బంగారం

Image Source:

ఒకమారు కరువు మూలంగా పశువులకు మేత కరువై స్వామిసేవకు పాలు సమర్పణకు అంతరాయం ఏర్పడింది. స్వామి ఆమె కష్టాన్ని తీర్చుటకు కవలసినన్ని మేలిమి బంగారు నాణేలు సమర్పించాడు. ఊహించని ధనగర్వంతో ఆమె తన విధిని మరచి స్వామికి సమర్పించే పాలలో నీటిని కలిపేది. స్వామి గుణపాఠం నేర్పాలని తాను ఆమెకిచ్చిన బంగారు నాణేల స్వచ్ఛత కోల్పోవునట్లు చేశాడు.

18. చివరికి ఆమె ప్రార్థించింది

18. చివరికి ఆమె ప్రార్థించింది

18. చివరికి ఆమె ప్రార్థించింది

Image Source:

అది తెలియక గుణవతి వాటిని చలామణికై కొట్టుకు తీసుకెళ్ళగా, అవి నకిలీవని తెలిసిన వ్యాపారులు ఆమెను మోసగత్తెగా పేర్కొన్నారు. ఆమె జ్ఞానోదయమై తప్పును మన్నించమని ప్రార్థించగా నాణేల వాసిని పెంచి మన్నించాడట. ఇలా గుణవతికి ఇచ్చిన బంగారు నాణేల వాసి తగ్గించిన స్వామి కాబట్టి ఈశ్వరుడిని ఇక్కడ వాసీశ్వరుడని అంటున్నారట.

బ్రహ్మకే పోయిన జ్జానం ప్రసాదించిన చోటు దర్శిస్తే పోగొట్టుకున్న సంపద, జ్జానం...

19. శ్రీ చక్రం ఉంది.

Image Source:

వాసీశ్వరస్వామి మందిరం, గర్భగృహం, అంతరాళం, ముఖమండపం, మహామండపాలను కలిగి తూర్పు ముఖంగా నిర్మించబడి ఉంది. గర్భాలయంలోని వేదికపై లింగాకారపు శివుని పై భాగం ఒకవైపునకు వంగినట్లుంది. స్వామి తలపై గొడ్డలిపెట్టుతో ఏర్పడిన గాయం నేటికీ స్పష్టంగా కనిపిస్తుంది. గర్భాలయం లోపలి గోడలో శంకరాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీ చక్రం ఉంది.

20.ఎతైన గోపురం

20.ఎతైన గోపురం

20.ఎతైన గోపురం

Image Source:

గర్భగృహం పైన గూడుబండి ఆకారంలో నిర్మితమైన విమానం పైన 5 కలశాలు ఉన్నాయి. విమానపు గూడులందు అనేక శైవ ప్రతిమలు, పరివార దేవతలతో బాటు నాలుగు వైపుల నంది ప్రతిమలు ఉన్నాయి. గర్భాలయం ముంగిట సన్నని అంతరాళం, దాని ముందు దాదాపు 20 స్తంభాలతో ఏర్పాటుచేసిన ముఖ, మహా మండపాలు ఉన్నాయి. ముఖ మండప ద్వారానికి ఇరువైపుల సాయుధులైన ద్వారపాలకులున్నారు. మండపం మధ్యన స్వామికి ఎదురుగా నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. ఆలయమందలి స్తంభాలన్నీ వివిధ శైవ శిల్పాలు, నాయనార్లు, మహర్షుల ప్రతిమలతో నిండివున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Nativeplanet sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Nativeplanet website. However, you can change your cookie settings at any time. Learn more