Search
  • Follow NativePlanet
Share
» »ఏడు నదులు కలిసే చోటు ఆలయం ...సందర్శిస్తే నరక లోకం తప్పుతుంది...అయితే ఏడాదిలో నాలుగు నెలలే అవకాశం

ఏడు నదులు కలిసే చోటు ఆలయం ...సందర్శిస్తే నరక లోకం తప్పుతుంది...అయితే ఏడాదిలో నాలుగు నెలలే అవకాశం

By Beldaru Sajjendrakishore

సంగమేశ్వరం, కర్నూలు జిల్లా, కొత్తపల్లె మండలానికి చెందిన గ్రామము. ఇక్కడ ప్రసిద్ధ శివుని ఆలయము ఉంది. ఇది మండల కేంద్రమైన కొత్తపల్లె (కర్నూలు మండలం) నుండి 30 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నంద్యాల నుండి 75 కి. మీ. దూరంలోనూ ఉంది.

అక్కడికి వెళ్లితే 'ఆ'సామర్థ్యం పెరుగుతుందా...అందుకే చాలా మంది...అక్కడికి వెళ్లితే 'ఆ'సామర్థ్యం పెరుగుతుందా...అందుకే చాలా మంది...

ఇక్కడికి వెళ్లితే...పెళ్లి ఆ పై శోభనం కూడాఇక్కడికి వెళ్లితే...పెళ్లి ఆ పై శోభనం కూడా

ప్రపంచంలో ఏడు నదులు కలిసే చోటు ఇక్కడే ఉంది. ఇక్కడ ఉన్న సంగమేశ్వరాలయం ఏడాదిలో నాలుగు నెలలు మాత్రమే దర్శించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ వేవ మొద్దుతో చేసిన లింగం దాదాపు 2000 ఏళ్లనాటిదని చెబుతారు. అయినా ఇప్పిటికీ అది చెక్కు చెదరలేదు. ఈ శివలింగాన్ని దర్శించుకుంటే నరకప్రవేశ బాధ తప్పుతుందనేది భక్తులు విశ్వాసం.

1. మునులకు ఆశ్రయం కల్పించిన ప్రాంతం

1. మునులకు ఆశ్రయం కల్పించిన ప్రాంతం

Image source:


సంగమేశ్వర దేవాలయం, కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ శైవాలయం. జిల్లాలోని ఆత్మకూరు పట్టణానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో కృష్ణా నదిలో సంగమేశ్వర ఆలయం ఉంది. ఏకంగా ఏడునదులు కలిసే ప్రదేశం. ఏడాదిలో 8 నెలలపాటు నీటిలో ఉండి కేవలం 4 నెలలు భక్తులకు దర్శనభాగ్యం కలిగించే ఆలయం. వేలసంవత్సరాల చరిత్ర ఉన్న పవిత్రస్థలం. ఎందరో మునుల తపస్సుకు ఆశ్రయమిచ్చిన ప్రాంతం.

2. కందెన వోలు...కర్నూలుగా

2. కందెన వోలు...కర్నూలుగా

Image source:


క్రీస్తు శకం ఆరు నుండి తొమ్మిదవ శతాబ్దం మధ్య కాలంలో బాదామి చాళుక్యులు తుంగభద్ర నది ఒడ్డున అలంపురం ఆలయ సముదాయాన్ని నిర్మీంచారు. ప్రస్తుతం బాదామి, కర్ణాటక లోని బాగల్ కోట జిల్లాలో ఉన్నది. నిర్మాణాలకవసరమైన రాళ్ళను ఎడ్ల బండ్లపై తరలంచే వారు. ఆ బళ్లు నదిలో ప్రయాణిస్తున్నందున వాటికి వేసిన కందెన నీటిలో కరిగి పోయేది. మళ్ళీ కొత్తగా వేయాల్సి వచ్చేది. ఆ చక్రాలకు వేసే కందెన తయారి కొక గ్రామం వెలసింది. అదే కందెన వోలు. కాలానుగుణంగా దాని పేరు కర్నూలు గా మారింది.

3. దక్ష యక్షం జరిగిన ప్రాంతం

3. దక్ష యక్షం జరిగిన ప్రాంతం

Image source:


పూర్వం ఈ ప్రాంతంలో దక్షయజ్ఞం జరిగిందని, ఆ సమయంలో దక్షుడు తన భార్యను అవమానించడంతో... ఆమె యజ్ఞ వాటికలో పడి మరణించిందని స్థల పురాణం చెబుతోంది. సతీదేవి శరీర నివృత్తి జరిగిన ప్రాంతం కాబట్టి నివృత్తి సంగమేశ్వరాలయంగా ప్రసిద్ది కెక్కింది. ఇక్కడ ఏడు నదులు కలుస్తాయి. ప్రపంచంలో ఏడు నదులు కలిసే చోటు మరెక్కడా లేదు. అందువల్లే దీనిని అతి పవిత్రమైన ప్రాంతంగా చెబుతారు.

4. ఎనిమిది నెలలు ఎదురుచూడాల్సిందే...

4. ఎనిమిది నెలలు ఎదురుచూడాల్సిందే...

Image source:


నివృత్తి సంగమేశ్వరాలయం అలాగే నీటిలోనే మునిగి వున్నది. ప్రతి ఏటా వేసవిలో శ్రీశైలం జలాశయం లోని నీటి మట్టం తగ్గినప్పుడు ఆలయం బయట పడుతుంది. అలా బయట పడే నాలుగు నెలలు అనగా మార్చి,ఏప్రిల్, మే, జూన్ నెలల్లో భక్తులు ఆలయానికి వెళ్లి పూజలు చేస్తుంటారు. ఈ ఆలయాలన్నీ చూడాలంటే కర్నూలు కేంద్రం చేసుకొని చూడొచ్చు. ఆలయ దర్శనం కోసం మిగిలిన ఎనిమిది నెలలు భక్తులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తుంటారు.

5. వేపమొద్దునే శివలింగంగా

5. వేపమొద్దునే శివలింగంగా

Image source:


పాండవుల వనవాసం సమయంలో ధర్మరాజు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్టించాలని నిర్ణయించాడు. ఆయన ఆదేశంతో శివలింగం తీసుకురావడానికి కాశీకి వెళ్లిన భీముడు .. ప్రతిష్ట సమయానికి రాలేదు. మునుల సూచన మేరకు వేపమొద్దుని శివలింగంగా మలిచి ప్రతిష్టించి పూజలు చేశాడు ధర్మరాజు. దీంతో, ఆగ్రహం చెందిన భీముడు తాను కాశీ నుంచి తెచ్చిన శివలింగాన్ని నదిలో విసిరేశాడు.

6. అలా భీమ లింగం...

6. అలా భీమ లింగం...

Image source:


భీముడిని శాంతింప జేయడానికి అతను తెచ్చిన శివలింగాన్ని నదీ తీరంలోనే ప్రతిష్టించి, భీమలింగంగా దానికి పేరు పెట్టాడు. భక్తులు భీమేశ్వరున్ని దర్శించుకున్న తర్వాతే సంగమేశ్వరున్ని దర్శించుకోవాలని సూచించినట్లు స్థల పురాణం చెప్తోంది. అప్పటి ఆచారాన్ని భక్తులు ఇప్పటికీ ఇక్కడ పాటిస్తుండటం విశేషం. కాగా, ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఆలయం క్రమంగా శిథిలమై పోయింది.

7. లక్షా ఇరవై వేల చదరపు అడుగులు...

7. లక్షా ఇరవై వేల చదరపు అడుగులు...

Image source:


ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయాన్ని సుమారు రెండు వందల సంవత్సరాల క్రితం స్ధానిక ప్రజలు నిర్మించారు. సుమారు లక్షా ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయంతో పాటు, చుట్టూ ప్రాకారం నిర్మించినట్లు శిథిలాలను చూస్తే అర్ధమవుతుంది. ఈ ప్రాకారానికి ఉత్తరాన గోపురద్వారం, పశ్చిమ దక్షిణ ద్వారాలపై మండపాలు నిర్మింపబడి ఉండేవని చరిత్ర చెబుతోంది. కానీ, ప్రస్తుతం అవేమీ కనిపించవు.

8. గతంలో వేర్వేరు ఆలయాలు

8. గతంలో వేర్వేరు ఆలయాలు

Image source:


ప్రస్తుతం కనిపించే ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంటుంది. ముఖమండపం పూర్తిగా శిథిలమై పోగా... అంతరాలయం, గర్భాలయాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. శివుడి వెనుక వైపున ఎడమ భాగంలో శ్రీలలితాదేవి, కుడి వైపున వినాయకుడు దర్శనమిస్తారు. అంతకు ముందు వారిద్దరికీ వేరు వేరు ఆలయాలు ఉండేవి. అయితే, అవి శిథిలమై పోవడంతో లలితాదేవి, గణపతులను గర్భాలయంలో ప్రతిష్టించారు.

9. నరకలోకాన్ని తప్పించుకోవచ్చు...

9. నరకలోకాన్ని తప్పించుకోవచ్చు...

Image source:


అన్ని ఆలయాల్లోలాగా ఈ క్షేత్రంలో నిత్య పూజలు జరుగవు. ఈ ఆలయం ఎక్కువ రోజులు శ్రీశైలం ప్రాజెక్టు నీటిలో మునిగివుండడమే కారణం. మరో విషయం వేల సంవత్సరాల క్రితం సంగమేశ్వరాలయంలో ప్రతిష్టించిన వేపలింగం ఇప్పటికీ చెక్కుచెదరకపోవడం ఒకింత ఆశ్చర్యం కలిగించక మానదు. ఏడు నదులు కలిసే చోటున ఉన్న శివుడి ప్రతిరూపమైన వేప లింగాన్ని సందర్శిస్తే నరకలోక ప్రవేశం నుంచి తప్పించుకోవచ్చునని భక్తులు నమ్ముతారు. అందువల్లే ఈ ఆలయ సందర్శన కోసం భక్తులు ఎదురుచూస్తుంటారు.

10. అనేక ఉపాలయాలు...

10. అనేక ఉపాలయాలు...

Image source:


ఆలయం ప్రాంగణంలోని అనేక ఉపాలయాల్లో దేవతా మూర్తులు పూజలందుకునే వారు. ఆ ఆలయాలన్నీ శిథిలమవడంతో కర్నూలు జిల్లాలోని అనేక ఆలయాలకు వాటిని తరలించారు. వాటితో పాటు పల్లవ సాంప్రదాయంలో నిర్మితమైన రథం కూడా ఉండేది. దాన్ని పురాతత్వ శాఖ వారు జగన్నాథ గుట్టకు తరలించారు. అక్కడ మనం ఇప్పటికీ ఆ రాతి రథాన్ని చూడవచ్చు. దీని పై ఉన్న శిల్పాలు మనలను ఆశ్చర్యానికి గురిచేస్తాయి.

11. నది ఒడ్డున ఉండేది...

11. నది ఒడ్డున ఉండేది...

Image source:


ఈ ఆలయం మొదట నది ఒడ్డున ఉండేది. శ్రీశైలం డ్యామ్ నిర్మాణం తరువాత సంగమేశ్వరాలయం 23 ఏళ్లపాటు నీటిలోనే మునిగిపోయింది. అసలు ఇక్కడ ఆలయం ఉందనే విషయాన్ని కూడా జనం మర్చిపోయారు. 2003 తరువాత శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం పడిపోయిన కాలంలో మాత్రమే ఆలయం నీటి నుంచి బయటపడుతుంది . అప్పటి నుంచి తిరిగి ఆలయంలో పూజలు ప్రారంభమయ్యాయి.

12. ప్రపంచంలో ఇదొక్కటే...

12. ప్రపంచంలో ఇదొక్కటే...

Image source:


ప్రపంచంలో 7 నదులు ఒకేచోట కలిసే ఏకైక ప్రదేశం సంగమేశ్వరం. కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలంలో తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భవనాసి నదులు కలిసే ప్రదేశాన్నే సంగమేశ్వరం అంటున్నారు. ఈ నదుల్లో భవనాసి నది మాత్రమే పురుషుడి పేరున్న నది, మిగిలినవన్నీ స్త్రీ పేర్లున్న నదులే. భవనాసి తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే మిగిలిన నదులన్నీ పశ్చిమం నుంచి తూర్పుకు వెళ్తాయి.ఈ నదులన్నీ కలసి జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని తాకుతూ ప్రవహించి చివరికి సముద్రంలో కలసిపోతాయి.

13. అదే రూపాల సంగమేశ్వరం

13. అదే రూపాల సంగమేశ్వరం

Image source:


నివృత్తి సంగమేశ్వరంలో రాష్ట్ర కూటులు నిర్మించిన ఆలయాలకు రూపాల సంగమేశ్వరమని పేరు. వారు తమ నిర్మాణాల్లో చాళుక్యుల మౌలికాంశాలను, తమ బాంధవ్యాల వల్ల పల్లవుల అలంకారాన్ని జోడించారు. సంగమేశ్వరాలయం, దాని పక్కన భుజంగేశ్వరాలయాలు మహాబలిపురంలో రాతి రధాలను పోలివుండేవి. ఆలయుం వెలుపల నటరాజ మూర్తులు, పైకప్పులో ఆనంద తాండవం చేస్తున్న శివుని శిల్పాలు ఎన్నో ఉన్నాయి.

 14. ఒకే రాతి పై గంగ, యమున, పార్వతులు

14. ఒకే రాతి పై గంగ, యమున, పార్వతులు

Image source:


అంతేకాక ఒకే రాతిపై గంగ, యమున, పార్వతుల మూర్తులను మలిచారు. తర్వాతి కాలంలోని కళ్యాణి చాళుక్యులు అలంపురం సమీపంలో పాప నాశని ఆలయాల పేరుతో ఆలయ సముదాయాన్ని నిర్మించారు.
శ్రీశైల జలాశయం నిర్మించాక ఈ సంగమేశ్వర, అలంపుర ఆలయలన్నీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఏర్పడే పరిస్థితి రాగా, పురాతత్వ శాఖవారు సంగమేశ్వరాలయాలను విడదీసి వేర్వేరు ప్రాంతాలలో పునర్నిర్మించారు.

15. అలంపుర మార్గంలో...

15. అలంపుర మార్గంలో...

Image source:


కూడలి సంగమేశ్వరాలయాన్ని పాపనాశన ఆలయాలను అలంపురం వెళ్లే దారిలోనే పున: ప్రతిష్టించారు. అలంపురం నవ బ్రహ్మాలయాలకు అడ్డుగా ఓ పెద్ద గోడను నిర్మించారు. రూపాల సంగమేశ్వరాలయాన్ని కర్నూలు సమీపంలోని జగన్నాధ గట్టు పై కట్టారు. కాని ఈ జోడు రథాల్లాంటి ఆలయాల్లో మరొకటైన భుజంగేశ్వరాలయాన్ని నందికొట్కూరు సమీపంలోని జూపాడు బంగ్లా వద్ద నిర్మించారు. త్రివేణి సంగమ శిల్పం మాత్రం హైదరాబాద్ లోని పురాతత్వశాఖవారి ప్రదర్శన శాలలో వున్నది. ఇది పబ్లిక్ గార్డెన్స్ లో వున్నది.

16. ఇలా వెళ్లవచ్చు...

16. ఇలా వెళ్లవచ్చు...

Image source:


కర్నూలు నుంచి 55 కిలోమీటర్ల, నందికోట్కూరు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో వున్న ఈ క్షేత్రానికి వివిధ మార్గాల ద్వారా చేరవచ్చు. నందికోట్కూరుకు 16 కిలోమీటర్ల దూరంలో వున్న 'మచ్చుమర్రి' గ్రామానికి బస్సుల ద్వారా చేరుకుని , అక్కడినుంచి 6 కిలోమీటర్ల దూరంలో వున్న సంగమేశ్వరానికి ఆటోలు, జీపులలో వెళ్ళవచ్చు. కర్నూలు జిల్లా ఆత్మకూరు నుంచి కపిలేశ్వరమునకు బస్సులో చేరుకుని అక్కడి నుంచి 5 కిలో మీటర్ల దూరంలోవున్న ఈ క్షేత్రానికి ఆటోలు, జీపులలో చేరవచ్చు.

17. తెలంగాణ నుంచి బోటు ప్రయాణం...

17. తెలంగాణ నుంచి బోటు ప్రయాణం...

Image source:


స్వంతవాహనాల్లో వెళ్ళేవారు ఏ దారిలోనైనా సరాసరి ఆలయం వరకు వెళ్లవచ్చు. మహాశివరాత్రి నాటికి ఈ క్షేత్రం బయటపడితే క్షేత్రానికి వివిధ ప్రాంతాలనుంచి ఆర్‌.టి.సి.వారు బస్సులను నడుపుతారు.తెలంగాణ ప్రజలు మహబూబ్ నగర్ నుంచి సోమశిల వరకు బస్సులో ప్రయాణించి అక్కడి నుంచి బోటు ద్వారా సంగమేశ్వరం చేరుకోవచ్చు. ఈ బోటు ప్రయాణం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.

18. మరో కథనం ప్రకారం

18. మరో కథనం ప్రకారం

Image source:


అహోబిలం కొండల్లో పుట్టిన సెలయేరు భవనాశిని నదిగా రూపాంతరం చెంది కృష్ణలో కలిసే స్థలమది. ఈ నది కృష్ణలో కలిసే ఏడవ నది అయినందున దీనిని సప్తమ నదీ సంగమమని సప్తనది సంగమేశ్వరమనీ వ్వవహరిస్తారు. ప్రజల పాప ప్రక్షాళన చేసిన గంగాదేవికి జనుల పాప ప్రక్షాళన చేసిన గంగా దేవికి కాకి రూపం రాగా, ఈ సంగమంలో స్నానం చేసి హంసగా మారిందని, ఆమె పాపాలు నివృత్తి అయినందున దీనికి నివృత్తి సంగమేశ్వరం అని పేరొచ్చిందని ఒక కథనం.

19. పంచేశ్వరాలు

19. పంచేశ్వరాలు

Image source:


కోస్తా తీర ప్రాంతంలో పంచారామాలుండగా ఇక్కడ మల్లేశ్వరం, అమరేశ్వరం, సిద్దేశ్వరం, కపిలేశ్వరం, సంగమేశ్వరం పేర్ల తో పంచేశ్వరాలు ఏర్పడ్డాయని , ఇవన్నీ భీముడు తెచ్చిన లింగాలపై వెలిశాయని తెలుస్తోంది. ఈ పంచేశ్వరాలను జీవితంలో ఒక్కసారైన సందర్శిస్తే నరకలోక ప్రవేశం నుంచి తప్పించుకుని ముక్తి లభిస్తుందనేది స్థానికులు చెప్పే కథనం. మిగిలిన అన్ని ప్రాంతాలను ఏ సమయంలోనైనా సందర్శించే వీలుండగా సంగమేశ్వర సందర్శనకు కేవలం నాలుగు నెలలు మాత్రమే అవకాశం ఉండటం గమనార్హం.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X