• Follow NativePlanet
Share
» »అమృత బిందువులు పడ్డ ప్రాంతం...హారిని చేరడానికి ద్వారాలు తెరిచే పుణ్యక్షేత్రం

అమృత బిందువులు పడ్డ ప్రాంతం...హారిని చేరడానికి ద్వారాలు తెరిచే పుణ్యక్షేత్రం

Posted By: Kishore

ఈ క్షేత్రంలో యాచించినా, విగ్రాల పై ఉన్న పసుపును నోట్లో వేసుకున్నా

బ్రహ్మ నారసింహుడి కాళ్లు కడిగిన ప్రాంతం..

దేవతలందరూ నివశించే ప్రదేశం.

భారత దేశంలోని ఏడు అతి ముక్తి ప్రసాదించే పురాణ ప్రసిద్ధ చెందిన నగరాల్లో హరిద్వార్ కూడా ఒకటి.  ఈ హరిద్వార్ లో సాగర మథనం తర్వాత వెలువడిన అమృత కళశాన్ని గరుగక్మంతుడు తీసుకుని వెళ్లే సమయంలో పొరపాటున అమృతం ఒలికి పోయిందని చెబుతారు. అంతేకాకుండా  విష్ణువు తన పాద ముద్రలను వదిలి వెళ్లిన ప్రదేశం కూడా హరిద్వార్. ఇక్కడ స్వర్గానికి ఎప్పుడూ దారులు తెరిచే ఉంటాయని పురాణ కథనం వివరిస్తుంది. హరిద్వార్ లోని గంగానది ఒడ్డున ప్రతి రోజు జరిగే గంగాహారతిని చూడాల్సిందేకాని వర్ణించడానికి వీలు కాదు. హరిద్వార్ లో 12  ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళ హిందూ ముస్లీం మత సామరస్యానికి ప్రతీకగా చెప్పబడుతుంది. ఆ సమయంలో హిందు సాధువులకు ముస్లీంలకు సాదర స్వాగతం పలకడం ఇక్కడ తరతరాలుగా వస్తున్న ఆచారం. ఈ హరిద్వార్ అటు వైష్ణవులకు ఇటు శైవులకు కూడా పుణ్యక్షేత్రమే. ఇక్కడ అనేక దేవాలయాలను మనం చూడవచ్చు. 

1.సాగర మధనం తర్వాత

1.సాగర మధనం తర్వాత

Image Source:

సాగర మథనం తర్వాత గరుక్మంతుడుఅమృతం ఉన్న కళశాన్ని తీసుకుని వెళ్లే సమయంలో అందులో ఉన్న అమృతం చిలికి నాలుగు చోట్ల పడిపోయిందని పురాణాలు చెబుతున్నాయి. అలా పడిన ప్రాంతాలు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలుగా రూపాంతారం చెందాయి.

2.మొదటిది హరిద్వార్

2.మొదటిది హరిద్వార్

Image Source:

అందులో మొదటిది ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ కాగా, ప్రయాగ (అలహాబాద్), ఉజ్జయినీ, గోదావరి జన్మస్థలమైన నాసిక్ మిగిలిన మూడు ప్రాంతాలు ఈ ప్రాంతాలన్నీ తదుపరి కాలంలో పుణ్యక్షేత్రాలుగా రూపాంతరం చెంది ఇప్పటికీ విరాజిల్లుతున్నాయి.

3.నామార్థం ఇది

3.నామార్థం ఇది

Image Source:

ద్వారం అంటే లోపలికి ప్రవేశించేది అని అర్థం. హరి అంటే విష్ణువు అన్న విషయం తెలిసిందే. ఇక హరిద్వార్ అంటే ఆ విష్ణువును చేరడానికి ఈ పుణ్యక్షేత్రం ద్వారాలు ఎప్పుడూ తెరిచి ఉంటాయని చెబుతారు.

4.శైవులకు, వైష్ణవులకు కూడా

4.శైవులకు, వైష్ణవులకు కూడా

Image Source:

అదే విధంగా చార్ ధామ్ అని పిలువబడే గంగోత్రి, యమునోత్రి, కేదరినాథ్, బదరీనాథ్ లకు కూడా ఇది ప్రవేశ ద్వారం అని పిలుస్తారు. ఇక శైవులు దీనిని హరద్వార్ గాను, వైష్ణవులు హరిద్వార్ గాను దీనిని పిలుస్తారు. అందువల్లే ఇది అటు శైవ క్షేత్రంగాను ఇటు వైష్ణవ క్షేత్రంగాను ప్రసిద్ధి చెందింది.

5. పురాణ కాలం నుంచి

5. పురాణ కాలం నుంచి

Image Source:

ఇక పురాణ కాలం నుంచి హరిద్వార్ ప్రస్తావన ఉంది. కపిల ముని ఇక్కడ నివశించడం వల్ల దీనిని కపిస్థాన్ గా కొన్ని పురాణాల్లో పేర్కొనబడింది. సగరుని కుమారుల్లో ఒకడైన భగీరథుడు కపిల ముని శాపగ్రస్తులైన తన పిత`దేవలైన 60 వేల మందికి ముక్తిని ప్రసాదించడానికి స్వర్గం నుంచి గంగాదేవిని ఇక్కడకు రప్పించినట్లు చెబుతారు.

6. ఆనవాయితీ

6. ఆనవాయితీ

Image Source:

అందువల్లే హిందువులలు మరణించిన తమ పెద్దవారికి ముక్తి ప్రసాదించడం కోసం వారి చితాభస్మాన్ని ఇక్కడకు తీసుకువచ్చి ఇక్కడి గంగానదిలో కలపడం ఆనవాయితీగా వస్తోంది. ఇక హరిద్వార్ లో సందర్శించాల్సిన అనేక ప్రాంతాలు ఉన్నాయి.

7. హరికీ పౌరీ

7. హరికీ పౌరీ

Image Source:

ఇక్కడే విష్ణుమూర్తి పాదాలను మనం చూడవచ్చు. వీటిని గంగానది నిత్యం తడుపుతూ ఉంటుంది. ఈ పాదాలను దర్శించుకోవడం వల్ల నేరుగా వైకుంఠానికి పోతామని హిందుభక్తుల విశ్వాసం. ఈ ప్రాంతాన్ని బ్రహ్మకుండ్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ నిత్యం సాయంకాలం సమయంలో గంగాహారతిని ఇస్తాడు. ఆ ద`శ్యం మనోహరంగా ఉంటుంది.

8. చండీదేవి ఆలయం

8. చండీదేవి ఆలయం

Image Source:

రాక్షస రాజులైన సుంభ, నిశుంభుల సైనాధిపతులైన చండ, ముండలను ఛండీ దేవి ఇక్కడ సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఈ ప్రదేశాన్ని ఛండీ ఘాట్ అని కూడా పిలుస్తారు. ఇది స్థానిక నీల పర్వత శిఖరం పై ఉంది. ఈ దేవాలయంలోని విగ్రహాన్ని ఆదిశంకరాచార్యులు నిర్మించినట్లు చెబుతారు. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి కేబుల్ కార్ల వ్యవస్థ ఉంది.

9. మంశా దేవి కోవెల

9. మంశా దేవి కోవెల

Image Source:

మనస్సులోని కోరికలన్నింటినీ ఈ దేవి తీరుస్తుందని భక్తులు నమ్ముతారు. అందువల్లే ఈ కోవెలకు మంశాదేవి కోవెల అని పేరు. బిల్వ పర్వత శిఖరం పై ఉన్న ఈ దేవి ఆలయాన్ని చూడటానికి కూడా మనం కేబుల్ కార్లలో వెళ్లవచ్చు. ఆ సమయంలో చుట్టూ ఉన్న పచ్చని పర్వతాలు, గంగానది అందాలను చూడటం మరిచిపోలేని అనుభూతి.

10.మాయాదేవి కోవెల

10.మాయాదేవి కోవెల

Image Source:

సతీదేవి నాభి పడిన ప్రాంతంగా ఈ దేవాలయాన్ని చెబుతారు. ఇది భారత దేశంలోని సిద్ధ పీఠాల్లో, ఆదిశక్తి ఆలయాల్లో ఒకటి. అందువల్లే ఇక్కడకు ఎక్కువగా సాధువులు, అఘోరాలు వస్తుంటారు. దీనిని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు ఇక్కడ దొరికిన ఆధారాలను అనుసరించి తెలుస్తుంది.

11.దక్షమహాదేవ్ దేవాలయం

11.దక్షమహాదేవ్ దేవాలయం

Image Source:

హరిద్వార్ కు దగ్గర్లో దక్షమహాదేవ్ ఆలయం ఉంది. ఆహ్వానం లేకపోయినా సతీ దేవి దక్షమహారాజు తలపెట్టిన యాగానికి వస్తుంది. అయితే అక్కడ అవమానించబడి ఆత్మత్యాగం చేసుకుంటుంది. దీనిని భరించలేక శివుడు దక్షుడిని సంహరించడం తెలిసిందే. అయితే తరువాత దేవతల కోరిక పై దక్షుడికి తిరిగి మేక తలను అతికించి ప్రాణం పోస్తాడు. దీనికి గుర్తుగా ఇక్కడ దక్ష మహాదేవ్ ఆలయం ఉంది.

12. నీల్ ధారా పక్షుల శరణాలయం

12. నీల్ ధారా పక్షుల శరణాలయం

Image Source:

హరిద్వార్ కు దగ్గర్లోని భీమగోడా బిడ్జ్ వద్ద నీల్ ధారా పక్షుల సంరక్షణ కేంద్రం ఉంది. ముఖ్యంగా బర్డ్ లవర్స్ కు ఇది బాగా నచ్చుతుంది. శీతాకాలంలో ఇక్కడకు విదేశాల నుంచి కూడా పక్షులు వలస వస్తుంటాయి.

13.సతీకుండ్

13.సతీకుండ్

Image Source:

ఆహ్వానం లేకపోయినా సతీ దేవి దక్షమహారాజు తలపెట్టిన యాగానికి వస్తుంది. అయితే అక్కడ అవమానించబడి ఆత్మత్యాగం చేసుకుంటుంది. దీనిని భరించలేక శివుడు దక్షుడిని సంహరించడం తెలిసిందే. ఆ సతీ దేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రాంతమే సతీకుండ్ అని చెబుతారు.

14. భీమ్ గోడా సరస్సు

14. భీమ్ గోడా సరస్సు

Image Source:

హరికిపురి నుంచి దాదాపు కిలోమీటర్ల దూరంలో ఈ భీమ్ గోడా ఉంటుంది. పురాణ ప్రాముఖ్యత కలిగిన ప్రాంతం. పాండవులు హరిద్వార్ కి వచ్చినప్పుడు భీమసేనుడు దాహానికి తట్టుకోలేక ఇక్కడ తన మోకాలితో ఒక రాతి పై గట్టిగా మోదాడని చెబుతారు. అప్పుడే ఈ సరస్సు ఏర్పడినట్లు కథనం.

15. సప్తబుుషి ఆశ్రమం

15. సప్తబుుషి ఆశ్రమం

Image Source:

హరిద్వార్ లో అత్యంత సుందరమైన ప్రాంతం ఇదే. ఇక్కడ గంగానది అత్రి, వశిష్టుడు, కశ్యపుడు, విశ్వామిత్రుడు, జమదాగ్ని, భరధ్వాజుడు, గౌతముడు పేర్లతో ఏడు పాయలుగా చీలి ఉంటుంది. ఇక్కడ గోదావరి సహజ అందాలను చూడాల్సిందే కాని వర్ణించడానికి వీలుకాదు.

16. పాడ్ శివలింగం

16. పాడ్ శివలింగం

Image Source:

ఇక్కడ శివలింగం 150 కిలోల బరువుతో చాలా పెద్దదిగా ఉంటుంది. ఇక్కడ శివలింగానికి అనుకునే రుద్రాక్ష చెట్టు ఉంటుంది. అదేవిధంగా దూధాధారి బర్ఫానీ కోవెల, సరేశ్వరీ ఆలయం, పవన్ ధాం, భారత్ మాత మందిర్, ఆనందమయి మాత ఆశ్రమ్ చూడాల్సిన ప్రదేశాలు

17. మత సామరస్యానికి

17. మత సామరస్యానికి

Image Source:

12 ఏళ్లకు ఒకసారి హరిద్వార్ లో జరిగే కుంభమేళ మత సమారస్యానికి ప్రతీక. ఇక్కడ జరిగే కుంభమేళకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు, సాధువులు వస్తుంటారు. ముఖ్యంగా హరిద్వార్ సమీపంలోని జ్వాలాపూర్ లో జరిగే భారీ ఊరేగింపులో పాల్గోనేందుకు విచ్చేసిన హిందు మత నాయకులకు, సాధువులకు స్థానిక అంజుమన్ కామ్ గంధన్ పంచాయత్ ముస్లీంలు సాధర స్వాగతం పలుకుతారు.

18. వారిని ఆశీర్వదిస్తారు

18. వారిని ఆశీర్వదిస్తారు

Image Source:

హిందూ స్వాములకు ముస్లీం పెద్దలు భక్తి పూర్వకంగా దక్షిణలు సమర్పించి వారి ఆసిస్సులు పొందుతారు. అందుకు ప్రతిగా సాధువులు ముస్లీంలను ఆలింగనం చేసుకుని వారిని ఆశీర్వదించడమే కాకుండా ప్రసాదాలను అందజేస్తారు. తరతరాలుగా ఈ సంప్రదాయం అలాగే వస్తోంది.

19. రాజాజీ నేషనల్ పార్క్

19. రాజాజీ నేషనల్ పార్క్

Image Source:

హరిద్వార్ కు దగ్గర్లోని శివాలిక్ పర్వతపాద ప్రాంతాల్లో ఉన్న రాజాజీ నేషనల్ పార్క్ సుమారు 820 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. దాదాపు 315 పక్షి జాతులను ఈ నేషన్ పార్కులు సంరక్షిస్తున్నారు. ఇక్కడ వీకెండ్ గా కూడా వెళ్లి రావచ్చు.

20. ప్రయాణం ఇలా

20. ప్రయాణం ఇలా

Image Source:

ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు ప్రయాణ సదుపాయం ఉంది. అదే విధంగా హరిద్వార్ లో ఉన్న రైల్వే స్టేషన్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యపట్టణాల నుంచి రైల్వే సేవలు అందుబాటులో ఉన్నాయి. హరిద్వార్ కు దగ్గరగా డెహరాడూన్ లోని జాలీ గ్రాంట్ ఎయిర్ పోర్టు ఉంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి