• Follow NativePlanet
Share
» »కళ్యాణ మూర్తులుగా శివపార్వతులు దర్శనమిచ్చిన చోటు..అక్కడికి వెళితే వెంటనే..

కళ్యాణ మూర్తులుగా శివపార్వతులు దర్శనమిచ్చిన చోటు..అక్కడికి వెళితే వెంటనే..

Written By: Beldaru Sajjendrakishore

శివపార్వతులు తమ వివాహం అయిన వెంటనే అగస్తమహామునికి పెళ్లి దుస్తులతోనే దర్శనమిచ్చిన ప్రదేశం పాపనాశం. ఈ పాపనాశంకు వెళ్లి ఆ ఆది దంపతులను దర్శనం చేసుకుంటే వెంటనే వివాహమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షత్రాలైన కుంభకోణం, తంజావూరుకు చాలా దగ్గర్లో ఈ పాపనాశం ఉంటుంది. ఇక ఈ పాపనాశంలో అనేక తీర్థాలు, జలపాతాలు ఉన్నాయి. వీటిలో ఔషదగుణాలు ఉన్నాయని నమ్ముతారు. అందువల్లే దేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా ఇక్కడ స్నానం చేయడానికి చాలా మంది వస్తుంటారు. ఇన్ని విశిష్టతలు కలిగిన ఈ పుణ్యక్షేత్రం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. 

వినాయకుడు పుట్టిన ప్రదేశం...

అక్కడికి వెళ్లితే 'ఆ'సామర్థ్యం పెరుగుతుందా...

అక్కడ లక్షల కోట్ల రుపాల విలువచేసే నిధి.

1. భార్య సచీదేవి వియోగంతో

1. భార్య సచీదేవి వియోగంతో

Image Source:

శివుడు తన భార్య సచీదేవి వియోగం తర్వాత మిక్కిలి దు:ఖంతో ఆమె పార్థీవ శరీరాన్ని భుజాన వేసుకుని ముల్లోకాలు తిరుగుతూ మిక్కిలి దు:ఖంతో ఉంటాడు. ఆ సమయంలో సృష్టి కార్యం నిలిచిపోతుంది. దీంతో భయపడిన దేవతలు మన్మథుని సహాయంతో శివ పార్వతులకు వివాహం చేయాలని నిర్ణయిస్తారు.

2. ముక్కోటి దేవతలు

2. ముక్కోటి దేవతలు

Image Source:

భూ మండలం పై జరిగిన ఈ వివాహానికి ముక్కోటి దేవతలూ హాజరవుతారు. అంతమంది ఒకేసారి భూ మండలం పైకి వచ్చేసరికి భూమి ఒక వైపునకు కుంగి పోయి మరోవైపునకు పైకి లేస్తుంది. దీంతో భూ మండలం పై ఉన్న జీవులన్నింటికీ ఇబ్బంది కలుగుతుంది. దీంతో జీవులన్నీ పరమేశ్వరుడిని వేడుకుంటాయి.

3. అగస్తుడిని

3. అగస్తుడిని

Image source:

పరమశివుడు బాగా ఆలోచించి దేవతలందరికి సరిసమానమైన భుజబలం, బుద్ధి బలం కలిగిన అగస్త మహాముని సమస్య పరిష్కారం కోసం ఎంపిక చేస్తాడు. వెంటనే భారత దేశంలోని దక్షిణ భాగం వైపునకు వెళ్లాలని తద్వారా భూమి మరలా తన యథాస్థితికి చేరుతుందని చెబుతాడు.

4. బాధపడుతాడు

4. బాధపడుతాడు

Image Source:

అయితే తాను పరమశివుడి కళ్యాణాన్ని చూడలేక పోతున్నానని అగస్తమహాముని బాధపడుతుంటాడు. విషయం గ్రహించిన పరమశివుడు చిరునవ్వుతో ‘వివాహం జరిగిన వెంటనే పెళ్లి దుస్తులతోనే కళ్యాణ మూర్తిగా నీకు దర్శనమిస్తాను.' అని వరమిస్తాడు.

5. అక్కడికి వెలుతాడు

5. అక్కడికి వెలుతాడు

Image Source:

దీంతో అగస్తుడు తమిళనాడు ప్రాంతంలోని పాపనాశం అనే ప్రాంతానికి సంతోషంగా చేరుకుంటాడు. అటు పై శివుడు తన మాట ప్రకారం వివాహమైన వెంటనే పార్వతీ దేవితో కలిసి ఇక్కడ అగస్తుడికి కళ్యాణ మూర్తిగా దర్శనమిస్తాడు.

6. వెంటనే దర్శనమిస్తారు

6. వెంటనే దర్శనమిస్తారు

Image Source:

ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వివాహమైన వెంటనే తన కోసం ఇక్కడకు రావడంతో జన్మధన్యమైనట్లు అగస్తుడు మిక్కిలి ఆనంద పడుతాడు. అంతేకాకుండా ఆ దంపతులను ఎంతగానో స్తుతిస్తాడు.

7. వరాలు కూడా

7. వరాలు కూడా

Image Source:

ఆ మహర్షి ఆరాదనకు మెచ్చిన శివపార్వతులు ఇక్కడ తాము కొలువై ఉంటామంటారు. ఇక్కడ మాకంటే మొదట నీకే మొదట పూజ జరుగుతుందని వరం కూడా ఇస్తారు. అంతే కాకుండా ఈ ప్రాంతానికి దర్శించిన వారికి వెంటనే వివాహం జరుగుతుందని కూడా చెబుతారు. అందువల్లే ఇక్కడకు వెళ్లిన బ్రహ్మచారులకు వెంటనే వివాహం జరుగుతుందని భక్తులు నమ్ముతున్నారు.

8. చైత్రమాసం మొదటి రోజు

8. చైత్రమాసం మొదటి రోజు

Image Source:

ప్రతి ఏడాది చైత్రమాస మొదటి రోజు పరమశివుడి కళ్యాణం ఇక్కడ అత్యంత వైభవంగా జరుగుతుంది. దగ్గర్లో ఉన్న అగస్తమహాముని ఆలయం నుంచి అగస్తుడిని ఇక్కడికి తీసుకువచ్చి ఆయన సమక్షంలోనే పార్వతి పరమేశ్వరుల కళ్యాణం జరపడం ఎన్నో ఏళ్లుగా అనవాయితీగా వస్తోంది.

9. వివిధ పేర్లతో

9. వివిధ పేర్లతో

Image Source:

ఇక ఇక్కడ శివాలయంలో పరమశివుడు పాపనాశం అనే పేరుతో వెళిశాడు. పాపాలన్నింటిని వినాశనం చేస్తాడు కనుక ఆయనకు ఆ పేరు వచ్చిందని చెబుతారు. అదే విధంగా ఈ ఆలయంలోని స్వామికి పాపనాశర్, వైరాసర్, పళమరైనాయకర్, మక్కళామూర్తి, పరంజ్యోతి అనే పేర్లు ఉన్నాయి. ఇక ఆలయంలో అమ్మవారిని ఉలగమ్త్మ్, లోకనాయకి అని పిలుస్తారు.

10. అనేక తీర్థాలు, జలపాతాలు

10. అనేక తీర్థాలు, జలపాతాలు

Image Source:

ఇక అగస్తుడు ఉన్న ప్రాంతానికి పాత పాపనాశం అని పిలుస్తారు. ఇక పాపనాశంకు పశ్చిమ దిక్కులో ఉన్న తీర్థానికి కళ్యాణ తీర్థం అని పేరు. ఈ తీర్థానికి దగ్గర్లోనే తామ్రపర్ణి, దేవతీర్థం, భైరవ తీర్థం తదితర జలపాతాలు, పుష్కరిణిలు ఉన్నాయి.

11. చుట్లు పక్కల అంతా కొండలు

11. చుట్లు పక్కల అంతా కొండలు

Image Source:

ఇక ఈ ప్రాంతం చుట్టు పక్కల అంతా కొండలు ఉంటాయి. వీటిలో అనేక ఔషద మొక్కలు పెరుగుతున్నాయి. కొండల పై నుంచి వచ్చే నీరు ఈ మొక్కల గుండా ప్రవహించి కళ్యాణ తీర్థం, దేవతీర్థం, తామ్రపర్ణిలో కలుస్తున్నాయి. దీంతో ఆ నీటికి ఎటువంటి రోగాలనైనా మార్చే గుణముందని విశ్వసిస్తున్నారు.

12. ఔషద గుణాలు

12. ఔషద గుణాలు

Image Source:

ఈ నీటిలో ఔషద గుణాలున్నాయని ఆయుర్వేద వైద్యులు కూడా చెబుతుంటారు. దీంతో ఈ పాపనాశంకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా ఆయుర్వేదం వైద్య విధానం పై నమ్మకం ఉండే ఎంతో మంది ఇక్కడకు వచ్చి ఇక్కడ స్నానం చేస్తుంటారు.

13. అమ్మవారి భక్తుడు

13. అమ్మవారి భక్తుడు

Image Source:

పాపనాశంకు దగ్గరగా విక్రమపురం అనే గ్రామంలో శివజ్ఞాన స్వామి అనే కవి నివశిస్తూ ఉండేవాడు. ఆయన పాటలు కూడా బాగా పాడేవారు. అంతేకాకుండా అమ్మవారి భక్తుడు కూడా. ఈ క్రమంలో ప్రతి రోజూ పాపనాశంకు వచ్చి అమ్మవారి గురించి పాటలు పాడి తిరిగి వెళ్లే వాడు. అలా తిరిగి వెళ్లే సమయంలో కూడా పాటలు పాడే వాడు.

14. అమ్మవారు అతన్ని అనుసరించేది

14. అమ్మవారు అతన్ని అనుసరించేది

Image Source:

ఈ క్రమంలో ఒకసారి ఆ భక్తి పాటలను వింటూ అమ్మవారు కూడా కవిని అనుసరిస్తూ కొంత దూరం వెళ్లింది. ఈ దారిలో ఆయన నోట ఉన్న తాంబూలం ఎగిరి అమ్మవారి చీర పై పడిపోయింది. దీనిని సదరు కవి కాని లేక అమ్మవారు గాని గమనించలేదు.

15. మహారాజుకు చెబుతాడు

15. మహారాజుకు చెబుతాడు

Image Source:

అమ్మవారు తిరిగి తన స్థానినికి వచ్చేస్తారు. మరుసటి రోజు పూజారి వచ్చి ఆలయం తలుపులు తెలుస్తాడు. వెంటనే అమ్మవారి విగ్రహం పై తాంబులం ఎంగిలి కనిపిస్తుంది. దీంతో విషయం మొత్తం మహారాజుకు చెబుతాడు. మహారాజు కోపంతో సదరు కవిని ఉరితీస్తానని చెబుతాడు.

16. కలలో అమ్మవారు కనిపించి

16. కలలో అమ్మవారు కనిపించి

Image Source:

ఆ రోజు రాత్రి అమ్మవారు రాజు కలలో కనిపించి జరిగిన విషయం మొత్తం వివరిస్తుంది. తర్వాతి రోజు ఉదయం నిద్రలేచిన రాజు సేవకులతో కవిని తన రాజదర్భారుకు పిలిపిస్తాడు. ఆటు పై ఆయనకు ఒక పరీక్ష పెడుతాడు.

17. బంగారు తీగలు

17. బంగారు తీగలు

Image Source:

దర్భారులోని అమ్మవారి చేతిలో పూల చెండు ఉంచి దానిని బంగారు తీగలతో కట్టివేస్తాడు. ‘నీ గానానికి అంత శక్తి ఉంటే పాట ద్వారా ఆ బంగారు తీగలు వాటంతట అవే తెగిపోయి పూల చెండు కిందపడాలి.' అని సవాలు విసురుతాడు.

18. వాక్ శుద్ధి పెరుగుతుందని

18. వాక్ శుద్ధి పెరుగుతుందని

Image Source:

కవి అప్పటికప్పడు ఒక పాటను రచించి అమ్మవారి పై మనస్సు లగ్నం చేసి పాడుతాడు. దీంతో బంగారు తీగలు వాటంతట అవే తెగిపోయి పూల చెండు కింద పడిపోతుంది. దీంతో ఆయన భక్తితో పాటు అమ్మవారి శక్తి కూడా అందరికీ తెలుస్తుంది. అప్పటి నుంచి ఇక్కడ అమ్మవారిని దర్శిస్తే వాక్ శుద్ధి కూడా పెరుగుతుందని నమ్ముతారు. అందుకే జాతకం చెప్పేవారు పాపనాశంకు ఎక్కువగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు.

19. ఎక్కడ ఉంది.

19. ఎక్కడ ఉంది.

Image Source:

పాపనాశం తమిళనాడులోని తంజావూరు జిల్లాలలో ఉంది. తంజావూరు నుంచి పాపనాశంకు 25 కిలోమీటర్లు కాగా, కుంబకోణం నుంచి 15 కిలోమీటర్లు. తిరునల్వేలి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆయా ప్రాంతాల నుంచి పాపనాశం వెళ్లడానికి ప్రభుత్వ ప్రైవేటు బస్సులు చాలా ఉన్నాయి. ఇక్కడ కావేరి, తిరుమలై రాజన్, కడమురుట్టి అనే మూడు నదులు ప్రవహిస్తూ ఉంటాయి.

20. ప్రత్యేక సౌకర్యాలు

20. ప్రత్యేక సౌకర్యాలు

Image Source:

ఇక్కడ ఉన్న పెరియ కోయిల్ (పెద్ద ఆలయం అని అర్థం) ముందు ఉన్న తీర్థాల్లో స్నానం చేసి దుస్తులు మార్చుకోవడానికి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి