• Follow NativePlanet
Share
» »శివ లింగం పెరగకుండా మేకు కొట్టిన ప్రదేశం...సందర్శిస్తే కైలాసాన్ని చూసినంత పుణ్యం

శివ లింగం పెరగకుండా మేకు కొట్టిన ప్రదేశం...సందర్శిస్తే కైలాసాన్ని చూసినంత పుణ్యం

Written By: Beldaru Sajjendrakishore

సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుని సంహరించినపుడు ఆ రాక్షసుని గొంతులోని శివలింగము ముక్కలై 5 ప్రదేశములలో పడినదని, ఆ 5 క్షేత్రములే పంచారామములని కథనము. అందులో మొదటిది అమరారము. ఇది ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో ఉంది. ఇక్కడ ఉన్న శివుడిని అమరేశ్వరుడిగా పిలుస్తారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా ఇక్కడ 16 అడుగుల శివలింగం ఉంటుంది. ఇది అంతకంతకూ పెరిగి పోకుండా ఒక మేకును కొట్టారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఇక ఈ అమరావతి హిందువులకే కాకుండా బౌద్ధులకు కూడా ఎంతో ముఖ్యమైన పవిత్ర స్థలం. పురాణ ప్రాధ్యన్యత ఉన్నదే కాకుండా చారిత్రాత్మకంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది. ఈ నేపథ్యంలో అమరావతికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన కథనం

1. భీమేశ్వర పురాణంలో

1. భీమేశ్వర పురాణంలో

1. భీమేశ్వర పురాణంలో

Image Source:

శ్రీనాధుడు (క్రీ||శ|| 14 నుండి 15వ శతాబ్డము) రచించిన బీమేశ్వర పురాణములో ఈ పంచారామముల ఉత్పత్తిని గురించి వివరించబడింది. క్షీరసాగర మథనంలో వెలువడిన అమృతాన్ని మహావిష్ణువు మోహినీ రూపము ధరించి సురాసురులకు పంచుచుండగా, పంపకంలో అన్యాయం జరిగిందని అసంతృప్తి చెందిన రాక్షసులు త్రిపురనుల, నాధుల నేత్రత్వములో తీవ్రమైన జపతపములను ఆచరించగా శివుడు మెచ్చి, వారికి వరములిచ్చాడు.

2. ఒక్క లింగము మాత్రం చెక్కు చెదరలేదు

2. ఒక్క లింగము మాత్రం చెక్కు చెదరలేదు

2. ఒక్క లింగము మాత్రం చెక్కు చెదరలేదు

Image Source:

కొత్తగాసంపాదించిన శక్తితో రాక్షసులు దేవతలను అనేక బాధలకు గురిచేయడంతో వారు మహదేవుని శరణువేడుకున్నారు. దేవతల మోర ఆలకించిన శివుడు దేవతల మీద జాలిపడి తన పాశుపతంతో రాక్షసులనూ వారి రాజ్యాన్ని కూడా బూడిద గావించాడు. శివుని ఈ రుద్రరూపమే త్రిపురాంతకుడుగా ప్రసిధ్దికెక్కినది. ఈ దేవాసుర యుద్ధంలో త్రిపురాసురులు పూజ చెసిన ఒక పెద్ద లింగము మాత్రము చెక్కుచెదరలేదు.

3. దానినే ఐదు భాగాలుగా చేసి

3. దానినే ఐదు భాగాలుగా చేసి

3. దానినే ఐదు భాగాలుగా చేసి

Image Source:

దీనినే మహదేవుడు ఐదు ముక్కలుగా ఛెదించి ఐదు వేరు వేరు ప్రదేసములందు ప్రతిష్ఠించుటకు గాను పంచిపెట్టడం జరిగింది. లింగ ప్రతిష్ఠ చెసిన ఈ ఐదు ప్రదేశములే పంచారమములుగా ప్రసిద్ధి కెక్కినవని తెలుస్తోంది. అందులో మొదటిది అమరేశ్వరం. ఈ లింగాన్ని దర్శిస్తే కైలాసాన్ని చూసినంత పుణ్యమని భక్తులు చాలా కాలంగా విశ్వసిస్తారు.

4. మరో కథనం మేరకు

4. మరో కథనం మేరకు

4. మరో కథనం మేరకు

Image Source:

హిరణ్యకశ్యపుని కుమారుడు నీముచి. నీముచి కొడుకు తారకాసురుడనే రాక్షసుడు. అతడు పరమేశ్వరుడి గురించి ఘోర తపస్సు చెసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. అంతే కాకుండా ఒక అర్భకుడి (బాలుడి) చెతిలో తప్ప ఇతరులెవ్వరి వల్లా తనకు మరణం లెకుందా ఉండేలా వరం పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా! సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడం చేసేవాడు.

5. కుమారస్వామి

5. కుమారస్వామి

5. కుమారస్వామి

Image Source:

దేవతలు ఈ తారకాసురిడిని గెలవలేకపొవటము దేవతలకు చాలా ఇబ్బంది కరంగా మారింది. దీంతో తమకొక అపూర్వ శక్తిమంతుడైన బాలుడ్ని ప్రసాదించమని ప్రార్ధిస్తారు. దేవతల కోరిక నెరవేరింది. శివ బాలుడు - కుమారస్వామి ఉదయించాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు. కుమారస్వామి వేసిన బాణం దెబ్బకు తారకాసురిడి శరీరంలో ఉన్న ఆత్మలింగం ఐదు ముక్కలుగా మారి ఐదు చోట్ల పడినట్లు చెబుతారు. అవే పంచారామాలుగా మారాయని చెబుతారు.

6. మొదట చంద్రుడు పూజించాడు

6. మొదట చంద్రుడు పూజించాడు

6. మొదట చంద్రుడు పూజించాడు

Image Source:

ఇక అమరావతిలో పడిన శివ లింగం మొదటి భాగాన్ని మొదట చంద్రుడు ప్రతిష్ఠించి, అమరేశ్వరుడనే నామకరణం చేసి పూజించినట్టు స్థలపురాణం తెలియజేస్తుంది. దేవతల గురువు బృహస్పతి ఆదేశం మేరకు అప్పట్లో ఈ శివలింగం చుట్టూ పరివార దేవతలను ప్రతిష్ఠించడని. అమరుల నివాస ప్రాంతంగా మారిన కారణంగా ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని పురాణ కథనాలు వివరిస్తున్నాయి.

8. మూడు ప్రాకారాలు

8. మూడు ప్రాకారాలు

8. మూడు ప్రాకారాలు

Image Source:

చాముండికా సమేతుడైన అమరేశ్వరుడు ఇక్కడ విశేష పూజలను అందుకుంటూ ఉంటాడు. ఇక్కడి స్వామివారు త్రిగుణాలకు అతీతుడు అనే భావాన్ని ఆవిష్కరించేలా మూడు ప్రాకారాలతో ఆలయం కనువిందు చేస్తుంటుంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, జ్వాలాముఖీ దేవి కనిపిస్తారు. మధ్య ప్రాకారంలో వినాయకుడు, కాలభైరవుడు, కుమార స్వామి, ఆంజనేయ స్వామి ఉంటారు. ధ్వజ స్తంభం దగ్గరగా సూర్య భగవానుడు ప్రతిష్ఠితమై ఉన్నాడు.

9. ఎంతో మంది రాజులు

9. ఎంతో మంది రాజులు

9. ఎంతో మంది రాజులు

Image Source:

వందల సంవత్సరాల నుంచి ఎంతోమంది రాజులు తరతరాలుగా ఈ స్వామివారిని దర్శించుకుని తరించారనడానికి తగిన ఆధారాలు ఉన్నాయి. కన్నడాంధ్ర ప్రభువైన శ్రీకృష్ణదేవరాయలు అమరావతిని సందర్శించి ఇక్కడి అమరేశ్వరునికి నైవేద్య, మహాపూజలు నిర్వహించినట్టు, పెదమద్దూరు గ్రామ పంటభూముల్ని ఆలయానికి దానమిచ్చినట్టుగా ఇక్కడ ఉన్న రాజశాసనం తెలియజేస్తోంది. అటు పై కూడా ఎంతో మంది రాజులు ఈ దేవాలయ అభివద్ధికి పాటుపడ్డారు.

10. బంగారాన్ని దానంగా

10. బంగారాన్ని దానంగా

10. బంగారాన్ని దానంగా

Image Source:

ఒరిస్సా గజపతులపై విజయానంతరం 1517లో చారిత్రక ప్రాంతం కృష్ణాతీరమైన అమరావతిని దర్శించిన కృష్ణదేవరాయలు ఇక్కడ తులాభారం తూగాడు. తన బరువుతో సరిసమానమైన బంగారాన్ని పేదలకు పంచిపెట్టినట్టుగా శాసనంలో ఉంది. అందుకు గుర్తుగా రాయలు నిర్మించిన తులాభార మండపం, దానిముందు వేయించిన శాసనం నేటికీ ఇక్కడ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఆలయంలోని దక్షిణ రెండో ప్రాకారంలో ఈ మండపం ఉంది.

11. ధరణి కోటగా

11. ధరణి కోటగా

11. ధరణి కోటగా

Image Source:

నేడు అమరావతి అమరేశ్వరునిగా కొలువందుకుంటున్న స్వామి నాడు ధరణికోట అమరేశ్వరస్వామిగా వెలుగొందు తున్నాడని ఇక్కడ ఉన్న శాసనాల ద్వారా తెలుస్తోంది. రాయలు తన భార్య చిన్నాదేవి చేత కృష్ణవేణీ తీరాన రత్నధేను మహాదానం, మరో భార్య అయిన తిరుమల దేవి చేత సప్తసాగర మహాదానం చేయించినట్టుగా ఇందులో రాసి ఉంది.

12. రాజధానిగా కూడా

12. రాజధానిగా కూడా

12. రాజధానిగా కూడా

Image Source:

అమరావతికి సమీపంలో ఉత్తరాన ఉన్న ధరణికోట ఒకప్పటి ఆంధ్ర శాతవాహనుల రాజధానియైన ధాన్యకటకం. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం పరిఢవిల్లింది. బౌద్ధమత చరిత్రలో ధాన్యకటకానిది ప్రముఖ స్థానం. ప్రాచీన బౌద్ధ వాజ్మయములో విశిష్ట స్థానము పొందిన 'ఆంధ్రపురి'యే ధాన్యకటకం. క్రీ.పూ. 4వ శతాబ్దిలో గ్రీకు రాయబారి మెగస్తనీసు పేర్కొన్న 30 ఆంధ్ర దుర్గాలలో ఈ నగరమొకటి.

13. శాతవాహనులకు రాజధాని

13. శాతవాహనులకు రాజధాని

13. శాతవాహనులకు రాజధాని

Image Source:

సుమారు 16 కి.మీ చుట్టుకొలత కలిగిన మహానగరం ఈ ధాన్యకటం. నేటి అమరావతి, ధరణికోట అందులోని భాగాలే. మౌర్యులకు పూర్వము క్రీ. పూ. 4-3 శతాబ్దాలలో ఈ ప్రాంతం గణతంత్ర రాజ్యం (జనపదం)గా ఉన్న ఆధారాలున్నాయి. బుద్ధుని జీవితకాలము నుండి క్రీ. శ 14వ శతాబ్దివరకు ఇక్కడ బౌద్ధం నీరాజనాలందుకొంది. ఆంధ్ర పాలకులలో మొదటి వారైన శాతవాహనులకు సుమారు రెండు వందల ఏళ్లు వారి సామ్రాజ్యానికి రాజధానిగా వుండేది.

14. కాలచక్ర ప్రక్రియను ఇక్కడే బోధించాడు

14. కాలచక్ర ప్రక్రియను ఇక్కడే బోధించాడు

14. కాలచక్ర ప్రక్రియను ఇక్కడే బోధించాడు

Image Source:

గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావతి లోనే బోధించాడు. అందువలన అమరావతి బుద్ధునికంటే ముందు నుండే ఉన్నదని నిర్ధారణ ఔతున్నది. దీనికి చారిత్రక ఆధారాలు వజ్రయాన గ్రంథంలో పొందుపరచబడి ఉన్నాయి. దీన్ని చెన్నై లోని ప్రభుత్వ ప్రదర్శనశాలలో భద్రపరచారు. అంతే కాకుండా ఇక్కడ దొరికిన శిల్పాలలో ఎక్కువ బ్రిటిష్ మ్యూజియం, లండన్ లలో భద్రపరిచారు.

15. కార్బన్ డేటింగ్ ద్వారా

15. కార్బన్ డేటింగ్ ద్వారా

15. కార్బన్ డేటింగ్ ద్వారా

Image Source:

కార్బన్ డేటింగ్ ద్వారా ఈ పట్టణం క్రీ.పూ.5వ శతాబ్దికి చెందిందని తెలిసింది. అద్భుతమైన శిల్పకళతో అలరారే స్థూపంపై బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలు, బౌద్ధచిహ్నాలు చెక్కబడి ఉన్నాయి. స్థూపంపై బ్రాహ్మీ లిపిలో శాసనాలు చెక్కబడి ఉన్నాయి. చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ ఈ పట్టణములో నివసించి అచటి వైభవము గురించి ప్రశంసించాడు. ఆయన రచనల్లో కూడా ఈ అమరావతి ప్రస్తావన కనిపిస్తుంది. అంతే కాకుండా ఈ నగరం ప్రస్తావన పలు శాసనాల్లో కూడా మనం చూడవచ్చు.

16. అమరావతి స్థూపం

16. అమరావతి స్థూపం

16. అమరావతి స్థూపం

Image Source:

గౌతమ బుద్ధుని అవశేషాలను పూజల నిమిత్తమై పొందుపరచి వాటిపై కట్టిన కట్టడాన్ని స్థూపం అంటారు. ఆంధ్రదేశమందు, ముఖ్యముగా కృష్ణానదీ లోయలో, బౌద్ధమతము మౌర్యకాలము నుండి పరిఢవిల్లింది. [అమరావతి (ధరణికోట), భట్టిప్రోలు, జగ్గయ్యపేట (బేతవోలు,ఘంటసాల, శాలిహుండం మొదలైన చోట్ల స్థూప నిర్మాణము జరిగినట్లు లభించిన ఆధారాలను అనుసరించి తెలుస్తోంది. వీటిలో అమరావతి స్థూపం ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

17. తవ్వకాల్లో

17. తవ్వకాల్లో

17. తవ్వకాల్లో

Image Source:

1980లో జరిగిన పుష్కరాల సమయంలో అమరావతిలో పెద్ద ఎత్తున పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ప్రస్తుతం మనం చూస్తున్న విశాలమైన ఆలయద్వారం ఎత్తైన గాలిగోపురం గతంలో చిన్నద్వారం చిన్న గాలిగోపురంగా ఉండేవి. మొత్తం విచ్ఛిన్నం చేసి కొత్త నిర్మాణం కొరకు లోతుగా పునాదులు తీయబడ్డాయి. ఈ తవ్వకాలలో భౌద్ధ సంస్కృతికి చెందిన పాలరాతి శిల్పాలు అనేకం లభించాయి. ప్రస్తుతం మ్యూజియంలో కనిపిస్తున్న నంది ఈ తవ్వకాలలో లభించిందే. అలాగే మరికొన్ని చిన్న శిల్పాలు ఈ తవ్వకాలలో లభించాయి.

18. ఎలా చేరుకోవాలి

18. ఎలా చేరుకోవాలి

18. ఎలా చేరుకోవాలి

Image Source:

కృష్ణా నది తీరం ఒక విహార ప్రదేశంగా వేలాది పర్యాటకులని ఆకర్షించే ఈ పట్టణానికి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న విజయవాడ నుండి చేరుకోవడానికి నేరుగా బస్సులున్నాయి. 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు నుండి నేరుగా బస్సులు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ పర్యాటకశాఖ విజయవాడ నుండి అమరావతికి మోటర్ పడవ సౌకర్యం కల్పించింది. ఎన్నో ఆకర్షణలు కల ఈ ప్రదేశం, చారిత్రకులనే గాక పర్యాటకులని కూడా ఆకర్షిస్తోంది. ప్రస్తుతం అమరావతిలో దలైలామా అమరావతి వచ్చిన సమయంలో ఆరంభించిన బౌద్ధనిర్మాణం పని జరుగుతూ ఉంది.

19. పంచారామాలు ఏవంటే

19. పంచారామాలు ఏవంటే

19. పంచారామాలు ఏవంటే

Image Source:

1. అమరారామము, 2. దక్షారామము, 3. సోమారామము (భీమవరము), 4. కుమారారామము లేదా భీమారామము (సామర్లకోట), 5. క్షీరారామము (పాలకొల్లు) అనేవి పంచారామములు. రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ వారు పంచారామాలను బస్సులో ఒక్కరోజులో దర్శించే యాత్రా సౌకర్యాన్ని కలిగిస్తున్నారు. సుమారు 700 కి.మీ. సాగే ఈ యాత్ర ప్రతిరోజు రాత్రి 8.00 గంటలకు మొదలై మళ్ళీ మరునాడు రాత్రి 8.00 గంటలకు ముగుస్తుంది.

20. అదే పేరుతో

20. అదే పేరుతో


20. అదే పేరుతో

Image Source:

విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కూడా అమరావతి పేరున జరుగుతోంది. భారత ప్రధాని శ్రీ నరేంద్రమోడి గారు ఉద్దండరాయునిపాలెం లో రాజధాని నగర నిర్మాణానికి 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు శిలాన్యాసం (శంకుస్థాపన) గావించారు. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా భవన సముదాయానికి 2016 అక్టోబర్ 28 వ తేదిన అప్పటి కేంద్ర పట్టణాభివృధ్ది మంత్రి, ప్రస్తుతఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారు శంకుస్థాపన గావించారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి