Search
  • Follow NativePlanet
Share
» »ఫ్రెండ్స్ తో...బెస్ట్ హాంగ్ఔట్ స్పాట్స్ ఇవే

ఫ్రెండ్స్ తో...బెస్ట్ హాంగ్ఔట్ స్పాట్స్ ఇవే

బెంగళూరులో హాంగ్ఔట్ స్పాట్స్ కు సంబంధించిన కథనం

By Kishore

ఈ క్షేత్రంలో యాచించినా, విగ్రాల పై ఉన్న పసుపును నోట్లో వేసుకున్నాఈ క్షేత్రంలో యాచించినా, విగ్రాల పై ఉన్న పసుపును నోట్లో వేసుకున్నా

ఈ ఐదు సరస్సుల్లో మునిగితే మోక్షం తథ్యంఈ ఐదు సరస్సుల్లో మునిగితే మోక్షం తథ్యం

నోరూరించే స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ ఫేమస్నోరూరించే స్ట్రీట్ ఫుడ్ ఇక్కడ ఫేమస్

బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో యువత ఎక్కువగా ఎంజాయ్ చేసేది వీకెండ్స్ మాత్రమే. మిగిలిన రోజుల్లో సరైన సమయం దొరక్క పోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్ తో హాంగ్ఔట్ కోసం చీప్ అండ్ బెస్ట్ ప్రాంతాల కోసం వెదికే వారికి ఈ కథనం సరైన పరిష్కారం అందిస్తుంది. ఇక్కడ సూచించిన ఈ ప్రాంతాల్లో ఖర్చు తక్కువ ఫన్ ఎక్కువ. మరెందుకు ఆలస్యం వీకెండ్ తో పాటు బోర్ కొట్టినప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్లి రిలాక్స్ అవ్వండి.

1. ది హమ్మింగ్ ట్రీ

1. ది హమ్మింగ్ ట్రీ

Image source:

ఓపెన్ మైక్ ఇష్టపడే వారికి ది హమ్మింగ్ ట్రీ బెస్ట్ ఆప్షన్. బెంగళూరులోని ఇందిరా నగర్ లో ఉన్న ఓపెన్ మైక్ ది హమ్మింగ్ ట్రీలోకి వెళ్లడానికి ఎటువంటి ఎంట్రీ ఫీ లేదు. ఒక వైపు మంద్రమైన సంగీతం వినిపిస్తుంటే మరో వైపు స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేడయం మరిచిపోలేని అనుభూతిని మిగులుస్తుంది.
అన్నట్టు ఇక్కడ సింగర్స్ పాటకు పాదాలను కూడా కదపవచ్చు.. అదే డ్యాన్స్ కూడా చేయవచ్చన్నమాట. ఇందుకు కూడా ఎటువంటి ఫీజును చెల్లించాల్సిన అవసరం లేదు.

2. రస్తా కెఫే

2. రస్తా కెఫే

Image source:

లాంగ్ డ్రైవ్ అంటే మీకు చాలా ఇష్టమా. తరుచూ లాంగ్ డ్రైవ్ లు వెలుతుంటారా? ఇలాంటి వారికి రస్తా కెఫే అత్యుత్తమమైన హాంగ్ఔట్ డెస్టినేషన్. బెంగళూరు నుంచి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో మైసూరు రోడ్డులో ఉన్న ఈ రస్తా కెఫే రోజుకు 20 గంటల పాటు తెరిచే ఉంటుంది. వీకెండ్ లో కాస్త రద్దీ ఎక్కువగానే ఉంటుంది.

3. అమిబా బౌలింగ్ అడ్డా

3. అమిబా బౌలింగ్ అడ్డా

Image source:

బెంగళూరుకు మొట్టమొదటిసారి టెన్ పిన్ బౌలింగ్ క్రీడను పరిచయం చేసింది అమీబా బౌలింగ్ అడ్డానే. నగరంలోని చర్చ్ స్ట్రీట్, వైట్ ఫీల్డ్ లో అమిబా బౌలింగ్ ఉంది. వీకెండ్ లో ఫ్రెండ్స్ తోపాటు టెన్ పిన్ బౌలింగ్ ఆడటం బెంగళూరులో ఇటీవల వస్తున్న హాంగ్ఔట్ ట్రెండ్.

4. కమర్షియల్ స్ట్రీట్

4. కమర్షియల్ స్ట్రీట్

Image source:

బెంగళూరులో ఎప్పుడూ బిజీగా ఉండే ప్రాంతాల్లో కమర్షియల్ స్ట్రీట్ కూడా ఒకటి. ఇక్కడ రోడ్డు పొడవునా అనేక దుకాణాలు ఉంటాయి. కుటీర పరిశ్రమల్లో తయారైన వస్తువులతో పాటు ఇంటర్నేషనల్ బ్రాండ్ వస్తువుల వరకూ ఇక్కడ ప్రతి ఒక్కటీ దొరుకుతాయి. షాపింగ్ అంటే మీకు క్రేజీ అయితే ఫ్రెండ్స్ తో కలిసి డే ఎండ్ లేదా వీక్ ఎండ్ లో హాంగ్ఔట్ చేయడానికి ఇది అనువైన ప్రాంతం.

5.డ్యు ఆర్ట్ కెఫే

5.డ్యు ఆర్ట్ కెఫే

Image source:

మీరు మీ ఫ్రెండ్స్ ఫుడ్ లవర్స్ అయితే మీకు డ్యు ఆర్ట్ కెఫే మీకు ఖచ్చితంగా నచ్చుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇండియాన్ నుంచి కాంటినెంటల్ వరకూ అనేక రకాల ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. ముఖ్యంగా చాకొలేట్ కేక్ విత్ చీజ్ ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీ టేస్టీ ఫుడ్ ను తింటూ ఫ్రెండ్స్ తో కలిసి హాట్ హాట్ టాపిక్స్ మాట్లాడుకోవడం మరిచిపోలేని అనుభూతి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X