• Follow NativePlanet
Share
» » ఈ క్షేత్రంలో యాచించినా, విగ్రాల పై ఉన్న పసుపును నోట్లో వేసుకున్నా అనంతమైన...

ఈ క్షేత్రంలో యాచించినా, విగ్రాల పై ఉన్న పసుపును నోట్లో వేసుకున్నా అనంతమైన...

Written By: Kishore

ఈ ఐదు సరస్సుల్లో మునిగితే మోక్షం తథ్యం

ఆ తిరుపతి మొక్కును ఈ తిరుపతి లో తీర్చుకోవచ్చు

ఇక్కడ పిండ ప్రధానం చేస్తే మోక్షం తథ్యం

భారత దేశంలో బాసర పుణ్యక్షేత్రం హిందువులకు ఎంతో పవిత్రమైనది. ఈ బాసర క్షేత్రాన్ని సందర్శిస్తే అంతులేని జ్ఞానం వస్తుందని భక్తుల విశ్వాసం. గోదావరి తీరంలో ప్రశాంత వాతావరణంలో ఉన్నటు వంటి బాసరలో సరస్వతి, లక్ష్మీ, పార్వతీ దేవులు కొలువై ఉన్నారు. అయినా ఇక్కడ ప్రధానంగా సరస్వతీ దేవినే కొలుస్తారు. ఇక్కడ దేవతను జ్ఞాన సరస్వతిగా కొలుస్తారు. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ఈ బాసర క్షేత్రం వివరాలు ఈ కథనంలో తెలుసుకొందాం.

1. రెండు దేవాలయాలు

1. రెండు దేవాలయాలు

Image Source:

భారత దేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన రెండు సరస్వతి దేవాలయాలు ఉన్నాయి. అందులో ఒకటి కాశ్మీరులో ఉండగా మరొకటి బాసరలోని సరస్వతి దేవాలయం. బాసరలోని సరస్వతి దేవాలయం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా భారత దేశంలోనే బాసర అత్యంత ప్రసిద్ధి గాంచినది.

2. వివిధ రాష్ట్రాల నుంచి

2. వివిధ రాష్ట్రాల నుంచి

Image Source:

ముఖ్యంగా అక్షరాభ్యాసం చేయడానికి ఇక్కడకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడకు చాలా మంది వస్తుంటారు. ఈ బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్టించినట్లు స్థల పురాణం చెబుతుంది.

3. కురుక్షేత్ర యుద్ధం

3. కురుక్షేత్ర యుద్ధం

Image Source:

కురుక్షేత్ర యుద్ధం తర్వాత వేద వ్యాసుడు మనశ్శాంతి కోసం తన కుమారుడైన శుకునితో దేశ సంచారం బయలు దేరాడు. అలా వెలుతున్న సమయంలో వారిద్ధరు ప్రస్తుతం బాసర ఉన్న ప్రాంతానికి వచ్చారు.

4. తమస్సు చేస్తాడు

4. తమస్సు చేస్తాడు

Image Source:

ఇక్కడి ప్రశాంత వాతావరణానికి ముగ్దుడైన వ్యాసమహర్షి తమస్సు చేయడం ప్రారంభించాడు. ఆయన తపస్సుకు మెచ్చిన జగన్మాత ప్రత్యక్షమయ్యి వరాలను కోరుకోమంది. అయితే తనకు తమ దర్శనమే పెద్ద వరమని మరే వరం అక్కర లేదని చెబుతాడు.

5. మూడు రూపాలను ప్రతిష్టించమని

5. మూడు రూపాలను ప్రతిష్టించమని

Image Source:

దీంతో సంతోషం చెందిన జగన్మాత ఇక్కడ తన ప్రతి రూపాలైన పార్వతి, లక్ష్మి, సరస్వతుల విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని చెబుతుంది. అంతే కాకుండా ఈ భూ మండలం ఉన్నంత వరకూ నీ పేరు పైనే ఈ ప్రాతం విరాజిల్లు తుందని చెప్పి మాయమవుతుంది.

6. మూడు గుప్పెళ్లతో ఇసుకను తెచ్చి

6. మూడు గుప్పెళ్లతో ఇసుకను తెచ్చి

Image Source:

దీంతో వ్యాసుడు పవిత్రమైన గోదావరి నది నుంచి మూడు గుప్పెళ్లతో ఇసుకను తెచ్చి మూడు విగ్రహాలను తయారు చేశాడు. ఇక అప్పటి నుంచి వ్యాసపురి, వ్యాసర, అటు పై బాసరగా మార్పు చెందింది. ఇక్కడ వ్యాస నిర్మితమైన ఇసుక విగ్రహాలకు పసుపు పూసి అలంకరించి పూజలు చేస్తారు.

7. ఇప్పటికీ చెక్కు చెదరలేదు

7. ఇప్పటికీ చెక్కు చెదరలేదు

Image Source:

లక్షల ఏళ్ల క్రితం ఇసుకతో ఏర్పాటు చేసిన విగ్రహాలు ఇప్పటికీ చెక్కచెదరకపోవడం విశేషం. ఇక విగ్రహాల పై ఉన్న పసుపును భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. తద్వార అనంతమైన విజ్జానం లభిస్తుందని భక్తులు చాలా కాలంగా నమ్ముతున్నారు.

8. వాల్మీకి

8. వాల్మీకి

Image Source:

మరో కథనం ప్రకారం వాల్మీకి మహర్షి ఇక్కడ రామాయణం రాయడానికి ముందు సరస్వతీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి రామాయణం రాసాడని చెబుతారు. ఈ గుడికి సమీపంలో వాల్మికి మహర్షి సమాధి, పాలరాతి శిల్పాలు ఉన్నాయి. ఈ గుహకు దగ్గరగా ఒక గుహ ఉంది.

9. సీతమ్మవారి నగలు

9. సీతమ్మవారి నగలు

Image Source:

ఈ గుహ పై మాలుకుడు అనే మహర్షి తపస్సు చేసినట్లు చెబుతారు. ఇక్కడ ఉన్న ఒక పెద్ద రాతి గుండు పై తడితే ఒక్కో వైపు ఒక్కో శబ్ధం వస్తుంది. ఈ రాతి గుండు లోపల సీతమ్మవారి నగలు ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు.

10. విదేశాల నుంచి కూడా

10. విదేశాల నుంచి కూడా

Image Source:

బాసర సరస్వతి దేవాలయంలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి దేశ విదేశాల నుంచి భక్తులు ఇక్కడకు వస్తుంటారు. ఆలయంలోని ప్రత్యేక మందిరంలో ఈ కార్యక్రమం సామూహికంగా జరుగుతుంది. తద్వారా తమ పిల్లలకు చదువు బాగా వస్తుందని ప్రజలు నమ్ముతారు. ఇక్కడ అక్షరాభ్యాసానికి ప్రత్యేక రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

11. మరో ఆచారం

11. మరో ఆచారం

Image Source:

ఈ బాసరలో ఉన్న మరో ముఖ్యమైన ఆచారం యాచించడం. ఏదేని ఒక బలమైన కోరిక నెరవేరాలని కోరుకున్న వారు 11, 21, లేదా 41 రోజుల పాటు ఈ ఊరిలో యాచించాల్సి ఉంటుంది.

12. గురువు ఉపదేశం అవసరం

12. గురువు ఉపదేశం అవసరం

Image Source:

ఇందుకు గురువు ఉపదేశం అవసరం. ఈ ఉపదేశం తీసుకున్నవారు అత్యంత నియమనిష్టలతో వ్రతాన్ని పూర్తి చేయాలి. మధ్యాహ్నం యాచకం ద్వారా వచ్చిన భిక్షను మాధుకరం అని అంటారు.

13. చాళుక్యుల కాలంలో

13. చాళుక్యుల కాలంలో

Image Source:

ప్రధాన దేవాలయాన్ని చాళుక్యుల కాలంలో నిర్మించబడినట్లు ఆధారాలు లభించాయి. ఈ మందిరంలో శిల్ప సంపద లేకపోయినా గోదావరి నదీ తీరంలో నిర్మించిన ఈ ఆలయ పరిసర ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉంటాయి.

14. దత్త మందిరం కూడా

14. దత్త మందిరం కూడా

Image Source:

ప్రధాన దేవాలయానికి తూర్పు భాగంలో దత్తమందిరం ఉంది. ఇక్కడ మనం దత్త పాదుకలను కూడా చూడవచ్చు. దీనికి దగ్గర్లోనే మహాకాళీ దేవాలయం కూడా ఉంది. అటు పై ఇక్కడే ఉన్న వ్యాస మందిరంలో వ్యాసభగవానుడి విగ్రహంతో పాటు వ్యాస లింగాన్ని కూడా మనం చూడవచ్చు.

15. మాఘ శుద్ధ పంచమినాడు

15. మాఘ శుద్ధ పంచమినాడు

Image Source:

మాఘ శుద్ధ పంచమినాడు సరస్వతీ దేవి జన్మదినోత్సవాన్ని ఇక్కడ ఘనంగా జరుపుకుంటారు. వసంతపంచమికి 15 రోజుల ముందు నుంచి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అటు పై వసంత పంచమి తర్వాత మూడు రోజుల వరకూ అత్యంత వైభవంగా జరుగుతాయి.

16. శిథిలాలు మాత్రమే

16. శిథిలాలు మాత్రమే

Image Source:

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్లో నీలం నది ఒడ్డున సరస్వతీ దేవి శక్తి పీఠం ఉండేది. అయితే ప్రస్తుతం ఇక్కడ శారద పీఠం శిథిలాలు తప్ప మరే ఇతర ఆధారాలు లేవు. ఇది ఒకప్పుడు కాశ్మీరి పండితుల విద్యా కేంద్రంగా విరిజిల్లింది. ఇక్కడ ఆది శంకరాచార్యుడు సర్వ జ్జాన పీఠాన్ని అధిరోహించినట్లు చెబుతారు.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి