• Follow NativePlanet
Share
» »విషపు రాళ్లతో మలచబడిన ప్రపంచంలో ఏకైక విగ్రహం...సందర్శిస్తే సంతాన సాఫల్యం

విషపు రాళ్లతో మలచబడిన ప్రపంచంలో ఏకైక విగ్రహం...సందర్శిస్తే సంతాన సాఫల్యం

Written By: Beldaru Sajjendrakishore

ఇక్కడ పిండ ప్రధానం చేస్తే మోక్షం తథ్యం

నైట్ ట్రెక్కింగ్ ఎప్పుడైనా వెళ్లారా?

కబాబ్ కోసం ఓ పర్యటన

భారతదేశం అనేక ఆలయాల నిలయం అన్న విశయం తెలిసిందే. ప్రతి ఆలయంలోని గర్భగుడిలో మూలవిరాట్టును రాయి, లేదా ఏదేని లోహంతో తయారు చేసి ప్రతిష్ట చేసి ఉంటారు. అయితే టెంపుల్ స్టేట్ అంటే దేవాలయాల రాష్ట్రంగా పేరుగాంచిన తమిళనాడులోని ఒక దేవాలయంలో మాత్రం మూల విరాట్టు విషపు స్వభావం కలిగిన రాళ్లతో మలచబడింది. అయితే వాటికి కొంత ఔషద గుణాలు ఉన్నాయని చెబుతారు. అప్పట్లో వైద్యమే లేదని భావించే కుష్టు రోగానికి కూడా ఈ విగ్రహం నుంచి వచ్చే విభూతి మందుగా పనిచేసేది. ఇక ఈ క్షేత్రాన్ని సందర్శించి ఒక ప్రత్యేక పూజ చేస్తే సంతానం కలుగుతుందని చెబుతారు. ఇందుకు సంబంధించిన వివరాలననీ ఈ కథనంలో తెలుసుకుందాం.

1.స్థల పురాణం ప్రకారం

1.స్థల పురాణం ప్రకారం

1.స్థల పురాణం ప్రకారం

Image source:

స్థల పురాణం ప్రకారం ప్రమద గణాలకు అధిపతిని ఎవ్వరిని చేయాలనే చర్చ కైలాసంలో జోరుగా జరుగుతుంది. చివరికి వినాయకుడు, కుమారస్వామిలో ఒక్కరు ఆ పదవికి అర్హులన్న విషయాన్ని అక్కడ ఉన్న పెద్దలు తేల్చుతారు. చివరికి వారిద్ధరికి ఒక పోటీ పెట్టాలని నిర్ణయిస్తారు.

2.ఎవరు ముందుగా

2.ఎవరు ముందుగా

Image Source:

దీని ప్రకారం ఎవరు భూ మండలాన్ని మూడు సార్లు ముందుగా ప్రదక్షణ చేసి కైలాసానికి వస్తారో వారిని విజేతగా ప్రకటించి ప్రమద గణాలకు అధిపతి చేయాలని భావిస్తారు. దీని ప్రకారం పోటీకి అటు వినాయకుడితో పాటు ఇటు కుమారస్వామి కూడా సిద్ధమవుతారు.

3. వినాయకుడు అలా

3. వినాయకుడు అలా

3. వినాయకుడు అలా

Image Source:

కుమార స్వామి వెంటనే తన నెమలి వాహనం పై భూ మండలం చుట్టి రావడానికి బయలు దేరుతాడు.అయితే గణపతి ఆకారంలో చాలా పెద్దవాడు. ఇక అతని వాహనమైన ఎలుక కూడా నెమలితో పోలిస్తే చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తుంది. దీంతో గణపతి బాగా ఆలోచించి ఆది దంపతులైన తల్లిదండ్రులకు పూజ చేయడం వారి చుట్టూ ప్రదక్షణ చేస్తే ఈ విశ్వంలోని ప్రతి పుణ్యక్షేత్రం దర్శించిన ఫలం దక్కుతుందని భావిస్తాడు.

4. మొదట వినాయకుడే కనిపిస్తాడు

4. మొదట వినాయకుడే కనిపిస్తాడు

4. మొదట వినాయకుడే కనిపిస్తాడు

Image Source:

దీంతో ఆ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తాడు. అందువల్ల కుమారస్వామి ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లినా మొదట వినాయకుడే కనబడుతాడు. చివరికి కైలాసం చేరుకున్నా అక్కడ కూడా తన కంటే వినాయకుడే ఉంటాడు.

5.కినుకు వహిస్తాడు

5.కినుకు వహిస్తాడు

5.కినుకు వహిస్తాడు

Image Source:

దీంతో తాను పందెంలో ఓడిపోయానని భావించి కొంత కినుకు వహిస్తాడు. అలిగి ప్రస్తుతం పళిని క్ష్క్షేత్రం ఉన్న పర్వత శిఖరం పైకి చేరుకుని ఒంటరిగా కుర్చొండి పోతాడు. దీంతో ఆయన తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరులు అక్కడకు చేరుకుని కుమారస్వామిని బుజ్జగించడం మొదలు పెడుతారు.

6. అందుకే ఆ పేరు

6. అందుకే ఆ పేరు

6. అందుకే ఆ పేరు

Image Source:

ఈ క్రమంలో ఈ విశ్వంలోని అన్ని జ్జానాలకు నీవే అధిపతివి అని చెబుతూ జ్జాన ఫలాన్ని అందజేశాడంట. అందువల్లే ఈ ప్రదేశం ఫళనీ అయ్యింది. తమిళంలో నీ అంటే నీవు ఫలం అంటే ఫలము అని అర్థం ఆ రెండింటి కలబోత ఫలితంగా ఈ ప్రదేశానికి ఫలనీ అని పేరు వచ్చినట్లు చెబుతారు.

7.జ్జానం పెరుగుతుంది

7.జ్జానం పెరుగుతుంది

7.జ్జానం పెరుగుతుంది

Image Source:

అంతే కాకుండా ఈ క్షేత్రాన్ని సందర్శిస్తే జ్జానం పెరుగుతుందని కూడా శివుడు వరం ప్రసాధిస్తాడు. అందువల్లే ఈ క్షేత్రాన్ని ఎక్కువ మంది సందర్శిస్తూ ఉంటారు.ఇక సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో జరిగే కావిడి (కొన్ని ప్రాంతాల్లో దీనిని కావడి అని కూడా పిలుస్తారు.) ఉత్సవం ఇక్కడే మొదట ప్రారంభమయ్యింది. ఇందుకు సంబంధించి స్థానిక పూజారులు ఒక కథనం చెబుతారు.

8.యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు

8.యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు

8.యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు

Image Source:


దేవతలు, రాక్షసులకు జరిగిన యుద్ధంలో చాలా మంది రాక్షసరాజులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో ఇడుంబన్ అనే ఓ రాక్షసుడు తన ప్రాణాలు కాపాడమని అగస్తమహాముని కాళ్లు పట్టుకుంటాడు. శరణు వేడిన వాడిని చంపడం భావ్యం కాదని భావించిన అగస్తుడు విషయాన్ని తన గురువైన సుబ్రహ్మణ్యస్వామికి తెలుపుతాడు.

9.కిటుకు చెబుతాడు

9.కిటుకు చెబుతాడు

9.కిటుకు చెబుతాడు

Image Source:

శరణు కోరిన వాడిని చంపడం సరికాదు. అదే సమయంలో రాక్షస గుణాలు ఉన్న ఇతడిని సంహరించ కుండా వదిలి పెట్టడం కూడా మంచిది కాదని భావిస్తాడు. చివరికి ఇతనిలో ఉన్న రాక్షస గుణాలను పాలద్రోలాలని భావించి అగస్త మహామునికి ఒక కిటుకు చెబుతాడు.

10.రెండు పర్వతాలను

10.రెండు పర్వతాలను

10.రెండు పర్వతాలను

Image Source:

దాని ప్రకారం ఇడుంబుడు కైలాసానికి వెళ్లి శివగిరి, శక్తిగిరి అనే రెండు పర్వతాలను కావడిలో భూమి పైకి తీసుకువస్తాడు. మార్గ మధ్యలో పళని ఉన్న చోటుకు రాగానే బరువు ఎక్కువై కావడిని కింద పెడుతాడు. ఈ విషయాన్ని అక్కడే బాలుడి రూపంలో ఉన్న కుమారస్వామి చూసి నవ్వుతాడు. దీంతో ఆగ్రహం చెందిన ఇడుంబుడు ఆ కవాడిని తిరిగి తన భుజాల పై పెట్టుకుని ముందుకు కదలాలని ప్రయత్నిస్తాడు.

11.ఎంత ప్రయత్నించినా

11.ఎంత ప్రయత్నించినా

11.ఎంత ప్రయత్నించినా

Image Source:

అయితే ఎంత ప్రయత్నించినా ఆ కావడిలో ఒక వైపు మిక్కిలి బరువుగా మరో వైపు తేలికగా మారి పోతుంది. కుమారస్వామి మరలా పకపకా నవ్వుతాడు. దీంతో కోపగించుకున్న ఆ రాక్షసరాజు పిల్లవాడిని చంపడానికి వెనుకా ముందు చూడకుండా ఈ పర్వత శిఖరం పైకి పరుగెడుతాడు.

12.యుద్ధం జరుగుతుంది

12.యుద్ధం జరుగుతుంది

12.యుద్ధం జరుగుతుంది

Image Source:

అప్పుడు వారిద్దరికి యుద్ధం జరుగుతుంది. చివరికి కుమారస్వామి దెబ్బకు ఆ రాక్షసుడు ప్రాణం పోగొట్టుకునే స్థితికి వస్తాడు. దీంతో తాను పోరాడుతున్నది మామూలు పిల్లవాడితో కాదని సాక్షాత్తు అగస్త మహాముని గురువైన కుమారస్వామితో అని తెలుసుకుని మిక్కిలి బాధపడటమే కాకుండా తన తప్పును మన్నించమని వేడుకుంటాడు.

13.బుద్ధి చెబుతాడు

13.బుద్ధి చెబుతాడు

13.బుద్ధి చెబుతాడు

Image Source:

అప్పుడు కుమార స్వామి ‘చిన్నపిల్లవాడు నవ్వితే నవ్వినాడు అని భావించి నీవు ముందుకు వెళ్లి పోయి ఉంటే నీకు క్షమా గుణం ఉన్నట్లు . అలా కాక బాలుడని చూడకుండా ఏకంగా చంపడానికే ప్రయత్నించావు. అదే రాక్షస గుణం.' అని చెబుతాడు.

14.వేడు కొంటాడు

14.వేడు కొంటాడు

14.వేడు కొంటాడు

Image Source:

దీంతో బుద్ది తెచ్చుకున్న ఆ రాక్షసుడు తన తప్పును మన్నించమని పరిపరి విధాలుగా వేడుకుంటాడు. దీంతో కుమార స్వామి ఆ రాక్షసుడిని మన్నిస్తాడు. అంతేకాకుండా ఆ ఇడుంబుడి కోరిక పై ఇక పై కావిడిలతో నడుచుకుంటూ ఈ పర్వతం పైకి ఎక్కి ఎవరైతే తనను దర్శించుకుంటారో వారికి వెయ్యి యజ్జాలు చేసిన ఫలితం దక్కుతుందని వరమిస్తాడు.

15.అలా సంప్రదాయం మొదలయ్యింది

15.అలా సంప్రదాయం మొదలయ్యింది

15.అలా సంప్రదాయం మొదలయ్యింది

Image Source:

అంతే కాకుండా నీవళ్లనే కావిడి సంప్రదాయం మొదలవుతోంది కాబట్టి ఇక పై తాను కొలువై ఉన్న అన్ని క్షేత్రాల్లో నీకు కూడా స్థానం కల్పిస్తానని చెబుతాడు. నా భక్తులు మొదట నిన్ను దర్శనం చేసుకున్న తర్వాతనే నన్ను పూజిస్తారని కూడా వరమిస్తాడు. అప్పటి నుంచి సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్న అన్ని క్షేత్రాల్లో కావిడి సంప్రదాయం మొదలయ్యింది.

16.సంతానం కలుగుతుంది

16.సంతానం కలుగుతుంది

16.సంతానం కలుగుతుంది

Image Source:

కావిళ్లలో పాలు, నెయ్యి, విభూతి తదితరాలను ఉంచి స్వామివారికి సమర్పిస్తుంటారు. దంపతులు కావిళ్లను మోయడం వల్ల తప్పక సంతానం కలగడమే కాకుండా వారి సంతతికి కూడా ఏ వైన దాంపత్య సంబంధ దోషాలు ఉంటే తొలిగి పోతాయని నమ్ముతారు.

17.విషంతో

17.విషంతో

17.విషంతో

Image Source:

భారతదేశంలో ఏ గుడిలోనైనా గర్భగుడిలోని మూలవిరాట్టును రాయి, లోహం లేదా చెక్కతో చేయబడి ఉంటుంది. అయితే ప్రపంచంలో ఒకే ఒక విగ్రహం మాత్రం నవ పాశానాలు అంటే తొమ్మిది విష పదార్థాలతో తయారు చేశారు. అయితే ఈ పాశానాల్లో కొన్నింటికి ఔషద గుణాలు ఉన్నట్లు చెబుతారు. అందుకు నిదర్శంగా గతంలో జరిగిన సంఘటనలను అక్కడి పూజారులు మనకు వివరిస్తారు.

18.కుష్టు రోగం నయమయ్యేది

18.కుష్టు రోగం నయమయ్యేది

18.కుష్టు రోగం నయమయ్యేది

Image Source:

ఈ ఆలయం లోని స్వామి వారి విగ్రహం ఉరు అంటే తొడ భాగం నుంచి విభూతిని తీసి భక్తులకు ఇచ్చేవారు. ముఖ్యంగా కుష్టు రోగులు ఈ విభూతిని ప్రసాదంగా తీసుకవడంతో పాటు పుండ్లు పై ఆ విభూతిని రాసుకుంటే కుష్టు రోగం నయమయ్యేదని చెబుతారు.

19.మనం ఇప్పటికీ గమనించవచ్చు

19.మనం ఇప్పటికీ గమనించవచ్చు

19.మనం ఇప్పటికీ గమనించవచ్చు

Image Source:

అలా విభూతిని తీసి తీసి సదరు ప్రాంతంలో విగ్రహం అరిగిపోయిన విషయాన్ని మనం కూడా గమనించవచ్చు. అయితే ఇది ఇలాగే కొనసాగితే విగ్రహం పూర్తిగా నశించిపోతుందని భావించిన పెద్దలు విగ్రహం నుంచి విభూతిని తిసి ఇవ్వడాన్ని పూర్తిగా నిలిపివేశారు.

20.ఇది నాల్గవది

20.ఇది నాల్గవది

20.ఇది నాల్గవది

Image Source:

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రాల్లో పళని నాల్గవది. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.
స్వామి వారి క్షేత్రాల్లో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్యక్షేత్రాల్లో పళని ముందు వరుసలో ఉంటుంది. పళనిలో ప్రస్తుంతం ఉన్న దేవాలయాన్ని కేరళ రాజు అయిన చీమన్ పెరుమాళ్ నిర్మించాడు. తరువాత పాండ్యు రాజులు ఈ కాలంలో మందిరం బాగా అభివ`ద్ధి చెందిందని చెబుతారు.

21.ఎలా చేరుకోవాలి

21.ఎలా చేరుకోవాలి

21.ఎలా చేరుకోవాలి

Image Source:

పళని తమిళనాడులోని మదురైకి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. మధురై, కోయంబత్తూరు, తిరుచిరాపల్లి, చెన్నై బెంగళూరు నగరాల నుంచి కూడా ఇక్కడకు నిత్యం బస్సులు ఉన్నాయి. పళనిలో రైల్వే స్టేషన్ ఉంది. మధురై, కోయంబత్తూరు నుంచి పళనికి నేరుగా రైలు సౌకర్యం ఉంది.

22.విమాన మార్గం

22.విమాన మార్గం

22.విమాన మార్గం

Image Source:

ఇక పళనికి దగ్గరగా కోయంబత్తూరు (116 కి.మీ.), మదురై (129 కి.మీ.), తిరుచిరాపల్లి ( 158 కి.మీ.), బెంగళూరు (306 కి.మీ.), చెన్నై ( 471 కి.మీ.) విమానాశ్రయాలు ఉన్నాయి. అక్కడి నుంచి పళనికి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులతో పాటు ట్యాక్సీల సదుపాయం కూడా ఉంది.

పర్యాటకానికి సంబంధించిన వివరాలు తెలుసుకోండి
పర్యాటక చిట్కాలు, పర్యాటకానికి సంబంధించిన కథాలు తక్షణం పొందండి