Search
  • Follow NativePlanet
Share
» »శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

By Beldaru Sajjendrakishore

భారత దేశం ఎన్నో ఆలయాల నిలయం. కొన్ని ఆలయాలకు అత్యంత శక్తి ఉందని భక్తుల నమ్మకం. అక్కడకు వెళితే తమ భవిష్యత్తు బంగారు బాట అవుతుందని తలుస్తారు. ఇందు కోసం ఎంత దూరమైనా వెళ్లి అక్కడి దేవతల ఆశిర్వాదం తీసుకుంటారు. అంటువంటి కోవకు చెందినదే సూర్యనర్ కోవిల్ సూర్యదేవాలయం ఇక్కడ ప్రత్యేకత.

రజస్వలకాని వారు ఇక్కడ కుర్చొంటేరజస్వలకాని వారు ఇక్కడ కుర్చొంటే

వినాయకుడు పుట్టిన ప్రదేశం...సందర్శిస్తే సంతానభాగ్యం, అపారతెలివితేటలు సొంతంవినాయకుడు పుట్టిన ప్రదేశం...సందర్శిస్తే సంతానభాగ్యం, అపారతెలివితేటలు సొంతం

బ్రహ్మయజ్జం చేసిన చోట...రక్తం ప్రవహించిన నది...స్నానం చేస్తే...బ్రహ్మయజ్జం చేసిన చోట...రక్తం ప్రవహించిన నది...స్నానం చేస్తే...

ఈ దేవాలయాన్ని దర్శిస్తే భవిష్యత్తులో శని బాధలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ దేవాలయంలో ఒకొక్క గ్రహానికి ఒక్కొక్క ఉప దేవాలయం ఉండటం గమనార్హం. అంతేకాకుండా ఈ దేవాలయం దర్శనం వల్ల భవిష్యత్తులో గ్రహాల వల్ల కలిగే బాధలు కూడా నశిస్తాయని భక్తులు నమ్ముతారు. అందువల్లే దేశం నలుమూలల నుంచి ఇక్కడకు ఎక్కువ సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

1. తమిళనాడు

Image source:

సురియనార్ కోయిల్, తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో ఉన్న ఒక గ్రామం. నవగ్రహ ఆలయాలు లేదా స్థలాలలో ఒకటైన ఈ ఆలయం సూర్యునికి అంకితం చేయబడింది. సూర్యుని విగ్రహం ఉన్న ఈ హిందూ ఆలయం శివసూర్యనారాయణ ఆలయానికి ఈ గ్రామం పేరుగాంచింది. భక్తులు ఈ ఆలయంలో ఇతర గ్రహాల విగ్రహాలను కూడా చూడవచ్చు. ఈ ఆలయం భావిష్యశాస్త్ర ప్రాముఖ్యతకు ప్రసిద్ది చెందింది

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

2. ఆరోగ్యం పై ప్రభావం

Image source:

భక్తులు పెద్ద సంఖ్యలో సంపద కోసం గ్రహాల ప్రభావం బలోపేతం చేయడానికి, వారి ఆరోగ్యంపై గ్రహాల చెడు ప్రభావాలను తగ్గించుకోవడానికి ఈ స్థలాన్ని సందర్శిస్తారు. శివసూర్యనారాయణ ఆలయ నిర్మాణ౦, చరిత్ర ఈ ఆలయం పడమటి వైపు ఉంది, గ్రహాల నుండి అత్యంత ప్రయోజనకరమైన కిరణాలను పొందేటట్లు నిర్మించారు. సదరు నిర్మాణంలో భారతీయ ఖగోళ శాస్ర్త విధానాలను అవలంభించారని చెబుతారు.

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

3. కులోత్తుంగ చోలదేవ

Image source:

ఈ ఆలయాన్ని కులోత్తుంగ చోలదేవ రాజు పాలనలో క్రీశ 1100 సంవత్సరంలో నిర్మించారు. 3 వరుసలతో అసాధారణ పరిమాణం గల గోపురం, పైన 5 గోపురాలు ఈ ఆలయ గొప్పతనాలు. ఇక్కడ సూర్య తీర్ధం అని పిలిచే పవిత్ర నీటి తొట్టె కూడా ఉంది. గురు భగవాన్ ఇక్కడ సూర్య భగవానుని ప్రార్ధనలు చేశాడు. ఇక్కడ తిరుమంగలకుడి వద్ద ముందు శివుడు (ప్రాణనాదేశ్వర్), పార్వతి (మంగలామ్బిగై) ని పూజించాలి, తరువాత సూర్యనారాయణ, ఇతర నవగ్రహాలను పూజించాలి.

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

4. సూర్య విగ్రహం

Image source:


సురియనార్ కోయిల్ లో శివసూర్యనారాయణ ఆలయంలో సూర్యుని విగ్రహం ఉంది, ఇది తమిళనాడు లోని నవగ్రహ ఆలయాలలో ఒకటి. ఈ ఆలయంలో మిగిలిన ఎనిమిది గ్రహాల విగ్రహాలు కూడా ఉన్నాయి. కలవ మునివర్ తానూ త్వరలో కుష్టు వ్యాధికి గురౌతానని అంచనా వేసి చెప్పాడని చెప్తారు. అందువల్ల అతడు ఆ రోగం నుండి రక్షించబడటానికి నవగ్రహాలని ప్రర్ధించాలని నిర్ణయించుకున్నాడు.

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

5. బ్రహ్మదేవుని శాపం

Image source:


నవగ్రహాలు అతని అంకితభావానికి సంతోషపడ్డారు, వారు అతని కొరికను విన్నారు. అయినా అతని విధి మారలేదు, ఎవరూ దానిని సరిచేయలేదు, అపుడు ఆ బ్రహ్మదేవుడు ఇది విని చాలా కోపోద్రిక్తుడయ్యాడు. కలవ మునివర్ అనుభవించిన బాధలు 9 గ్రహాలు అనుభవించాలని శపించాడు. అప్పటినుండి నవగ్రహాలన్నీ కుష్టు తో చాలా ఏళ్లు బాధపడ్డాయి.

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

6. అలా విమోచనం పొందాయి

Image source:


తరువాత, నవగ్రహాలు బ్రహ్మతో ఇదంతా మర్చిపోయి, ఈ శాపాన్ని అధిగమించే మార్గాన్ని చెప్పమన్నారు. తిరుమంగలకుడి సందర్శించి, ప్రాణనాదేశ్వర్ (వెల్లెరుక్కకడు వద్ద) ను పూజించమని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు. ప్రాణనాదేశ్వర్, మంగలామ్బిగై (ఆయన భార్య) కు ప్రార్ధనలు చేసిన తరువాత నవగ్రహాల స్థానానికి దగ్గరలో వినాయకుడి విగ్రహాన్ని ఉంచుతారు, ఈ ప్రదేశంలో తపస్సు ప్రారంభించారు. దేవుని ఆశీర్వాదం వల్ల, నవగ్రహాలు పాప విమోచనం (వారి పాపానికి విమోచన) పొందాయి.

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

7. చాలా మంది వస్తారు

Image source:


కలవ మునివర్ నవగ్రహాలకు తన కృతజ్ఞతను తెలుపుకోవడానికి నవగ్రహాలు తపస్సు చేసిన ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలో, ప్రధాన దేవత శివసూర్యనారాయణ తన ఇద్దరు భార్యలు ప్రత్యూష, ఉష తోపాటు (సూర్యుడి రధాన్ని సూచించే) రాదోత్సవానికి నిలబడ్డారు. విజయ దశమి, రథ సప్తమి పండుగల సమయంలో అనేకమంది భక్తులు ఈ ఆలయానికి గుంపులుగా వస్తారు.

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

8 దర్శించే సమయం

Image Source:

సందర్శించు సమయం : ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు మరియు తిరిగి సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. సూరియనార్ కోయిల్ లోను, చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రదేశాలు తిరుమంగలకుడి లోని ప్రాణనాదేశ్వర్ ఆలయం, కన్జనూర్ లోని అగ్నీశ్వర్ స్వామీ ఆలయం (వీనస్ గ్రహ నవగ్రహ ఆలయం)

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

శని బాధలు తప్పించే సూర్యదేవాలయం ఇదే

9. ఎలా వెళ్లాలి

Image source:


సూరియనార్ కోయిల్ చేరుకోవడం ఎలా ?? సూరియనార్ కోయిల్, కుంబకోణం నుండి షుమారు 15 కిలోమీటర్ల దూరంలో, స్వామిమలై నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మయిలాడుతురైకి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం నుండి అడుతురై సమీప రైల్వే స్టేషన్. అక్కడి నుంచి మనం ప్రైవేటు ట్యాక్సీలు మాట్లాడుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X