Search
  • Follow NativePlanet
Share
» »ఆలయం నీడ ఇక్కడ మనతో పాటు వస్తుంది...ఇక్కడే నృత్యంలో పార్వతి పై శివుడు గెలిచింది.

ఆలయం నీడ ఇక్కడ మనతో పాటు వస్తుంది...ఇక్కడే నృత్యంలో పార్వతి పై శివుడు గెలిచింది.

తమిళనాడు చిదంబరం పట్టణంలో ఉన్న నటరాజు ఆలయం నిర్మాణం మొదలుకొని అక్కడి దైవారాధన వరకూ ప్రతి ఒక్కటి నిఘూడ రహస్యం. ఇక టెంపుల్ టూరిజానికి ఈ చిదంబరం పేరుగాంచింది. రానున్న వేసవి సెలవుల నేపథ్యంలో ఈ చిదంబర నటరా

By Beldaru Sajjendrakishore

తమిళనాడులో ఆలయాలకు కొదువు లేదు. ఇక చిదంబరంలోని నటరాజు ఆలయంలో ఆశ్చర్యాలకు కూడా కొదువు లేదు. ఇక్కడ శివుడు ఎక్కడా లేనట్లు నిరాకార రూపంతో పాటు మొత్తం మూడు రూపాల్లో దర్శనమిస్తాడు. శైవాల ప్రాంగణంలోనే వైష్ణవాలయం ఉన్న అతి కొన్ని దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ దేవాలయం నిర్మాణానికి మానవుడి దేహ నిర్మాణానికి పోలిక ఉంటుంది. దైవ దర్శనం ముగిసిన తర్వాత మనం తిరిగి వచ్చే సమయంలో వెనక్కు తిరిగి చూస్తే ఆలయం గోపురం మన వెంటనే వస్తున్న అనుభూతి కలుగుతుంది. దేవాలయంలో ఉన్న 9 ద్వారాల్లో ఏ ద్వారం గుండా వచ్చినా ఇదే అనుభూతి కలుగుతుంది. ఇన్ని విశిష్టతలు కలిగిన నటరాజ ఆలయం గురించిన పూర్తి సమాచారం నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1. తిల్లై చెట్లతో కూడిన వనం

1. తిల్లై చెట్లతో కూడిన వనం

Image source

పూర్వం ప్రస్తుతం చిదంబర ఆలయంలో తిల్లై చెట్లతో కూడిన పెద్ద అడవి ఉండేది. అక్కడ కొంతమంది మునులు నివసించేవారు. వీరు మంత్రాలతో దేవుడిని కూడా తమ ఆధీనంలోకి తీసుకురావచ్చని భావించేవారు.

2.యాచకుడి రూపంలో

2.యాచకుడి రూపంలో

Image source

వీరికి బుద్ధి చెప్పాలన్న ఉద్దేశంతో పరమశివుడు ఓ యాచకుడు (బిచ్చగాడి) రూపంలో అక్కడికి వస్తాడు. ఆయన మోహన రూపాన్ని చూసిన మునుల భార్యాలు సర్వం మరిచిపోయి బిచ్చగాడి రూపంలో ఉన్న శివుడి వెంట పడుతారు.

3. పాములను సృష్టించి

3. పాములను సృష్టించి

Image source

ఈ ఘటన మునులకు ఆగ్రహం తెప్పిస్తుంది. దీంతో మునులు మంత్రాలతో అసంఖ్యాకమైన పాములను సృష్టించి యాచగాడి రూపంలో ఉన్న శివుడి పైకి వదులుతాడు. శివుడు వాటిని తన నడుమునకు చుట్టుకొంటాడు.

4. పులిని కూడా

4. పులిని కూడా

Image source

మరింత ఆగ్రహించిన ఋషులు, ఒక భయానకమైన పులిని సృష్టించిగా శివుడు ఆ పులిని చీల్చి దాని చర్మాన్ని నడుము చుట్టూ శాలువా వలె ధరిస్తాడు.

5. రాక్షసుడి పై నృత్యం

5. రాక్షసుడి పై నృత్యం

Image source

పూర్తిగా విసుగు చెందిన ఋషులు, వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని మొత్తం కూడదీసుకొని ముయాలకన్ ఒక శక్తివంతమైన రాక్షసడుని సృష్టించి పరమశివుడి పైకి వదులుతాడు. పరమ శివుడు ఒక చిరునవ్వుతో, రాక్షసుడి యొక్క వెన్ను మీద కాలు మోపి, కదలకుండా చేసి ఆనంద తాండవం చేస్తాడు మరియు ఆతని నిజ స్వరూపాన్ని చూపిస్తాడు.

6.స్వయంభువుగా

6.స్వయంభువుగా

Image source

దీంతో భగవంతుడు వాస్తవమని మరియు అతను మంత్రాలకు మరియు ఆగమ సంబంధమైన క్రతువులకు అతీతుడని గ్రహించి మునులు పరమశివుడికి లొంగిపోతారు. శివుడు ఆనంద తాండవం చేసిన ప్రదేశంలో మునుల కోరిక పై స్వయంభువుగా వెలిచాడని కథనం

7. మరో కథనం ప్రకారం

7. మరో కథనం ప్రకారం

Image source

వైష్ణవుల యొక్క చారిత్రాత్మక వాదన ప్రకారం ఈ ఆలయం మొదట శ్రీ గోవిందరాజ స్వామి యొక్క నిలయం. పరమ శివుడు, ఆయన సతీమణి పార్వతీ దేవితో తో కలసి శ్రీ గోవిందరాజ స్వామి వద్దకు వచ్చి వారిరువురి మధ్య జరిపిన నృత్య పోటీకి న్యాయ నిర్ణేతగా వ్యవహరించమని వేడుకొన్నారు.

8. గోవిందరాజ స్వామి సూచన మేరకు

8. గోవిందరాజ స్వామి సూచన మేరకు

Image source

శ్రీ గోవిందరాజస్వామి ఇందుకు అంగీకరింస్తారు. దీంతో పార్వతి పరమేశ్వరుల మధ్య వారిరువురి మధ్య నృత్య పోటీ జరుగుతుంది. నృత్య పోటీలో ఇద్దరూ సమవుజ్జీలుగా నిలుస్తూ ఒకరి కొకరు తీసిపోకుండా నాట్యం చేస్తుంటారు. ఆ సమయంలో, శివుడు, తాను గెలుచుటకు సలహా కొరకు శ్రీ గోవిందరాజస్వామిని సమీపించగా, శివుడిని కాలు ఎత్తి పెట్టి నిలిపి ఉంచుకొమ్మని ఉపాయం చెప్పాడు.

9. ఆ భంగిమ ఆడవారికి నిషిద్ధం

9. ఆ భంగిమ ఆడవారికి నిషిద్ధం

Image source

కానీ నాట్య శాస్త్రం ప్రకారం ఈ భంగిమ స్త్రీలకు నిషేధించబడింది. దీంతో తత్వం గ్రహించిన పరమశివుడు చివరికి ఆ భంగిమలోనే నిలుచుట చేత పార్వతి తన యొక్క ఓటమిని అంగీకరిస్తుంది. ఇందుకు నిదర్శనంగానే ఆ ప్రదేశంలో పరమశివుడు ఆ నాట్య భంగిమలో కొలువై ఉన్నాడు.

10. అదే చిదంబర రహస్యం

10. అదే చిదంబర రహస్యం

Image source

పంచభూత క్షేత్రాల్లో ఒకటైన ఆకాశ లింగం ఇక్కడే ఉంది. అదుకు గుర్తుగా గర్భగుడిలో ఎటువంటి లింగం ఉండదు. అయితే దేవుడు కొలవై ఉన్నాడని చెప్పడానికి అన్నట్లు ఈ గుడిలో ఒక తెర ఉంటుంది. ఆ తెర తీస్తే ఐదు బంగారు బిల్వపత్రాలు వేలాడుతూ కనిపిస్తాయి. దీనినే చిదంబర రహస్యం అని అంటారు.

11. మూడు రూపాల్లో దర్శనం

11. మూడు రూపాల్లో దర్శనం

Image source

ఇక్కడ శివుడు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు. మొదటిది సంపూర్ణ రూపం అంటే నటరాజు రూపంలో శివుడు కనిపిస్తాడు. రెండు అసంపూర్ణ ఆకారంలో చంద్రమౌళేశ్వరుడిగా స్పటిక లింగ ఆకారంలో దర్శనిస్తారు. మూడు నిరాకారం. అంటే ఆకారం లేనిది. అదే ఆకాశ లింగ రూపం. ఇలా ఒకే క్షేత్రంలో వేర్వేరు రూపంలో దర్శనమిచ్చే ఆలయం దేశంలో మరెక్కడా లేదు.

12. మాన దేహం నిర్మాణంతో ముడిపడి

12. మాన దేహం నిర్మాణంతో ముడిపడి

Image source

ఆలయం మొత్తం 40 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడి ఉంటుంది. ఆలయానికి తొమ్మిది 9 ముఖద్వారాలు ఉంటాయి. ఇవి మానవ శరీరంలోని 9 రంధ్రాలను సూచిస్తాయి.

13. ఉచ్వాస, నిశ్చాసలకు ప్రతీకలు.

13. ఉచ్వాస, నిశ్చాసలకు ప్రతీకలు.

Image source

ఆలయం పైకప్పు మీద శివాయనమ అను నామం చెక్కబడి ఉన్న 21,600 బంగారపు పలకలుఉంటాయి. ఇవి ఒక రోజులో మనవవులు తీసుకుని వదిలే ఉచ్వాస, నిశ్చాసలకు ప్రతీకలు.

14. నాడుల సంఖ్యకు ప్రతీక

14. నాడుల సంఖ్యకు ప్రతీక

Image source

ఈ బంగారపు పలకలను బిగించుటకు ఉపయోగించిన 72000 బంగారపు మేకులు మానవ శరీరంలోని నాడుల సంఖ్యని సూచిస్తుంది. అదే విధంగా పై కప్పుని 64 దూలాలతో కట్టగా అవి 64 కళలను సూచిస్తాయి.

15.నీడ మనవెంటే..

15.నీడ మనవెంటే..

Image source

నటరాజును దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఆలయం ఎటు వైపు నుంచి బయటికి వస్తున్నా గోపురం నీడ మనను వెంబడిస్తున్నట్లే కనిపిస్తుంది. ఈ విషయం ఇక్కడకు వచ్చిన ప్రతి భక్తుడుకి అనుభవం.

16. ఎక్కడ ఉంది.

16. ఎక్కడ ఉంది.

Image source

తమిళనాడులోని కడలూర్ జిల్లాలోని కారైకల్ ‌కి ఉత్తరంగా 60 కిలో మీటర్ల దూరంలో, మరియు పాండిచ్చేరికి దక్షిణంగా 78 కిలో మీటర్ల దూరంలో ఉన్న చిదంబర పట్టణంలో ఈ ఆలయం ఉంది.

17 ఎలా చేరుకోవాలి

17 ఎలా చేరుకోవాలి

Image source

చిదంబరానికి దగ్గర్లో పాండిచ్చేరి ఎయిర్ పోర్టు ఉంది. ఇక్కడి నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణం. చిదంబరంలో పెద్ద రైల్వే స్టేషన్ ఉంది. దేశంలో చాలా ప్రాంతాల నుంచి ఇక్కడకు రైలు సౌకర్యం ఉంది. అదే విధంగా అనేక నగరాల నుంచి చిదంబరానికి బస్సు సౌకర్యాలు ఉన్నాయి.

18. వివిధ నగరాల నుంచి

18. వివిధ నగరాల నుంచి

Image source

బెంగళూరు నుంచి చిదంబరానికి 387 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణ సమయం సుమారు ఏడు గంటలు. ఇక హైదరాబాద్ నుంచి 845 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

19. దగ్గర్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు...

19. దగ్గర్లో ఉన్న పర్యాటక ప్రాంతాలు...

Image source

చిదంబరంలో నటరాజస్వామి దేవాలయంతోపాటు అనేక వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి. అంతేకాకుండా పిచావరం అటవీ ప్రాంతం, పిచావరం బ్యాక్ వాటర్ ఫారెస్ట్ తదితరాలను చూడవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X