» »ఈ క్షేత్రాల్లో మీ జాతకాలు మారిపోతాయి....దోషాలు పోయి అదృష్టవంతులవుతారు

ఈ క్షేత్రాల్లో మీ జాతకాలు మారిపోతాయి....దోషాలు పోయి అదృష్టవంతులవుతారు

Written By: Beldarau Sajjendrakishore

పుట్టిన తేది, నక్షత్రాన్ని అనుసరించి మనం జీవితం ఎలా ఉంటుంది, ఏ స్థాయికి చేరుతామన్న విషయం ఆధారపడి ఉంటుందని చాలా మంది విశ్వాసిస్తారు. అందువల్లే పిల్లలు పుట్టిన వెంటనే వారి జాతకాన్ని పండితుల చేత రాయించి భద్రపరుస్తారు. పెరిగి పెద్దవారయ్యే క్రమంలో సదరు జాతకంలో దోషాలు ఉంటే మనం చేసే అనేక కార్యక్రమాలకు ఆటంకాలు ఎదురౌతాయి. ఆలస్యంగా వివాహం కావటం,నిరుద్యోగం, సంతానం లేకుండా వుండటం ఇంకా అనేక సమస్యలు ఎదురవ్వటం ఈ జాతకంలోని దోషాలవల్లనే.

ముఖ్యంగా రాహువు, కేతువు మరియు శని వల్ల దోషలు కలుగుతాయనేది నమ్మకం. వీరికి శాంతి కలిగిస్తే మనం చేపట్టిన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్వఘ్నంగా కొనసాగుతాయని పండితులు చెబుతారు. ఇలాంటి పరిహార పూజలకు కొన్ని క్షేత్రాలు మరియు దేవాలయాలు మన భారతదేశం అంతటా ప్రసిద్ధిచెంది వున్నాయి.ఇది కూడా ఒక మత పర్యటన. మన దక్షిణభారతదేశంలో అనేక మహిమాన్వితమైన దేవాలయాలు వున్నాయి.మరి ఆ దేవాలయాలు ఏవేవి? అన్న విషయం నేటివ్ ప్లానెట్ పాఠకుల కోసం

1.పావగడ

1.పావగడ

Image source:


ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఉన్న పావగడలో శనేశ్వరుడి దివ్య క్షేత్రం ఉంది. ఇక్కడ ప్రతి శనివారం విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. తమ దోష నివారణ కోసం ఇక్కడకు దేశం నలుమూలల నుంచి వచ్చి పూజలు చేయిస్తుంటారు.

2. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం

2. కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం

Image source:


సాధారణంగా సర్పదోషం వల్ల మనం చేపట్టే కార్యక్రమాలకు ఆటంకాలు కలుగుతాయని చాలా మంది జ్యోతిష్యులు నమ్ముతారు. ఈ సర్పదోశ పరిహారం కోసం కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో ఎక్కువ మంది పూజలు చేస్తారు. ఇక్కడ ముఖ్యంగా సుబ్రహ్మణ్యస్వామి ప్రధానంగా పూజలు అందుకుంటాడు. సర్పదోష నివారణ పూజల కోసం దేశంలోనే ఇది ప్రఖ్యాతి గాంచింది.

3. శ్రీకాళహస్తి

3. శ్రీకాళహస్తి

Image source:


మరికొంతమంది జాతకాల్లో రాహుకేతు దోషాలు ఉంటాయి. వీటి పరిహారం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ర్టం, చిత్తూరు జిల్లాలోని కాళహస్తికి వెలుతారు. దేశం నలుమూల నుంచి వీఐపీలు ఎంతో మంది ఇక్కడకు వస్తుంటారు. ఇది విశిష్టమైన పుణ్యక్షేత్రం పంచభూత లింగాల్లోని వాయులింగం ఇక్కడే ఉంది.

4. విరూపాక్ష దేవాలయం

4. విరూపాక్ష దేవాలయం

Image source:

హంపీలోని విరూపాక్షస్వామి దేవాలయంలో కాళ సర్పదోశ నివారణ పూజలు చేస్తారు. దేశంలోని చాలా చోట్ల నుంచి భక్తులు ఇక్కడకు వచ్చి దోశ నివారణ పూజలు చేయిస్తుంటారు.

5. మున్నార నాగరాజ దేవాలయం

5. మున్నార నాగరాజ దేవాలయం

Image source:

కేరళలోని అలప్పుజ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్నారశాలలో నాగరాజ దేవాలయం ఉంది. ఇక్కడ సర్పదోష నివారణ పూజలు చేస్తారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే దేవాలయంలోని పూజలు అన్నీ మహిళలే చేస్తారు.

6.మహాకాళేశ్వర దేవాలయం

6.మహాకాళేశ్వర దేవాలయం

Image source:

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వున్న మహాకాళేశ్వర దేవాలయం కూడా కాళసర్ప దోషాలని నివారించటానికి సందర్శించవలసిన క్షేత్రాలలో ఒకటి. ఇది 12 పవిత్రమైన జ్యోతిర్లింగ ప్రదేశాలలో ఒకటి. దేవాలయంలో నాగాబలి లేదా కాళసర్పదోషాలను నివారించటానికి అనేక పూజలను ఇక్కడ ఆచరిస్తారు.

7. ఘాటి సుబ్రమణ్య స్వామి ఆలయం

7. ఘాటి సుబ్రమణ్య స్వామి ఆలయం

Image source:

ఈ దేవాలయం బెంగుళూరినుంచి కేవలం 60కిమీల దూరంలో వుంది. కుక్కే సుబ్రహ్మణ్య స్వమి దేవాలయం తర్వాత నాగ దోశ నివారణకు ఇది అత్యంత పరమ పవిత్రమైన స్థలం. ఆదివారం, మంగళవారం ఎక్కవు మంది భక్తులు ఈ క్షేత్రానికి వచ్చి తమ జాతక దోషాలకు పరిహార పూజలను చేయిస్తుంటారు.

8. మోపిదేవి

8. మోపిదేవి

Image source:


ఆంధ్రప్రదేశ్ కృష్ణాజిల్లాలో చల్లపల్లి నుంచి కేవలం 5కిమీ ల దూరంలో వున్న మోపీదేవి సుబ్రహ్మణ్యస్వామిదేవాలయం నాగదోష పరిహార పూజలకు పేరుగాంచిన ప్రదేశం.ఇక్కడ సుబ్రహ్మణ్యస్వామి శివలింగరూపంలో వెలసియున్నాడు.