Search
  • Follow NativePlanet
Share
» »బియ్యపు మూట ఇస్తే కోర్కెలు తీర్చే రంగులు మారే వినాయకుడు

బియ్యపు మూట ఇస్తే కోర్కెలు తీర్చే రంగులు మారే వినాయకుడు

బియ్యపు మూట ఇస్తే కోర్కెలు తీర్చే రంగులు మారే వినాయకుడికి సంబంధించిన కథనం.

By Beldaru Sajjendrakishore

మన భారతదేశంలో వున్న ఆలయాలు ఎంతో ప్రసిద్ధి చెందినవి. దేశంలోని కీర్తిపతాకాలు దేశం అంతా వ్యాపించాయి. మన దేశంలో తమిళనాడులో చాలా ఎక్కువగా ఆలయాలు వున్నాయి. అందుకే తమిళనాడు రాష్ట్రాన్ని టెంపుల్ స్టేట్ అంటారు. ఇందులో కేరళాపురం గ్రామం కన్యాకుమారికి దగ్గరలో వుంది. కేరళాపురం పురాతన ఆలయాలకు ప్రసిద్ధి.ఎక్కువగా శివాలయాలు వున్నాయి. ఈ శివాలయంతో పాటు పురాతన వినాయకుని ఆలయం వుంది. ఈ దేవాలయంలో 6నెలలకు ఒక సారి మూలవిరాట్ అయిన వినాయకుడు రంగులు మారటం ఇక్కడ విశేషం. మార్చి నుండి ఆగస్ట్ వరకు నల్లని రంగులో,ఆగస్ట్ నుండి ఫిబ్రవరి వరకు తెల్లనిరంగులో వినాయకుడు మారుతూవుంటాడు.ఆలయంలోని ప్రాంగణంలో వున్న బావిలోని నీరు కూడా రంగు మారుతుంది. వినాయకుడు నల్ల రంగులో వున్నప్పుడు నీళ్ళు తెల్లగాను, వినాయకుడు తెల్లగా వున్నప్పుడు నీళ్ళు నల్లగానూ మారతాయి. ఇందుకు గల కారణాలు ఇప్పటి వరకూ తెలియదు.

1.అద్భుతమైన వినాయకుడు

1.అద్భుతమైన వినాయకుడు

1.అద్భుతమైన వినాయకుడు

Image Source:

రంగులు మారే శ్రీ మహాదేవార్ అతిశయ వినాయగర్ రంగులు మారే శ్రీ మహాదేవార్ అతిశయ వినాయగర్ ఆలయం తమిళనాడులోని నాగర్ కోయిల్ జిల్లాలోని కేరళాపురం గ్రామంలో ఒక అద్భుతమైన వినాయక దేవాలయం ఉంది.

2.రంగులు మారుతుంది

2.రంగులు మారుతుంది

2.రంగులు మారుతుంది

Image Source:

ఈ ఆలయంలోని మూలవిరాట్టు అయిన వినాయకుడు ఆరు నెలలకు ఒకసారి రంగులు మారుతుంది. ఇందుకు గల కారణాలు ఇప్పటి వరకూ ఎవరూ కనిపెట్టలేకపోయారు.

3.బావిలోని నీరు కూడా

3.బావిలోని నీరు కూడా

3.బావిలోని నీరు కూడా

Image Source:

మరో విచిత్రం అంతేకాక, ఇక్కడ మరో విచిత్రం కూడా వుంది. ఈ ఆలయం ఆవరణలో ఓ మంచి నీటి బావి వుంది. ఈ బావిలో నీళ్ళు కూడా రంగులు మారతాయి. వినాయకుడు నల్లగా వున్నప్పుడు నీళ్ళు తెల్లగా మారతాయి.

4.తెల్లగా ఉంటే నల్లగా

4.తెల్లగా ఉంటే నల్లగా

4.తెల్లగా ఉంటే నల్లగా

Image Source:

వినాయకుడు తెల్లగా వున్నప్పుడు ఈ బావిలో నీళ్ళు నల్లగా మారతాయి. అంతేకాదు ఈ ఆలయంలో వున్న మర్రిచెట్టు దక్షిణాయనంలో ఆకులు రాల్చి, ఉత్తరాయణంలో చిగురించటం ప్రారంభిస్తుంది.

5. అందుకే ఆ పేరు

5. అందుకే ఆ పేరు

5. అందుకే ఆ పేరు

Image Source:

శ్రీ మహాదేవార్ అతిశయ వినాయగర్' ఆలయం ఈ ఆలయం క్రీశ.12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సం.లో ఈ ఆలయం నిర్మించారనీ, చరిత్రకారుల అంచనా. నిజానికిది శివాలయం.ఈ ఆలయప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం వుంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించటం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని 'శ్రీ మహాదేవార్ అతిశయ వినాయగర్' ఆలయం అంటారు.

6. ఎన్నోసార్లు పున: నిర్మించారు

6. ఎన్నోసార్లు పున: నిర్మించారు

6. ఎన్నోసార్లు పున: నిర్మించారు

Image Source:

2300 సంవత్సరాల చరిత్ర ఆ కాలంలో ఈ ఆలయాన్ని ఎన్నో సార్లు పునర్నిర్మించటం జరిగింది. ఈ ఆలయం 12వ శతాబ్ది కాలం నాటిదని, 1317 సంవత్సరంలో ఈ ఆలయం నిర్మించారనీ, ఈ ఆలయంకు 2300 సంవత్సరాల చరిత్ర ఉన్నదనీ, చరిత్రకారుల అంచనా మాత్రమే కాదు, స్ధానికులు కూడా అదే చెప్తారు. నిజానికిది ‘శివాలయం'.

7. ఆ సమయంలో నల్లగా

7. ఆ సమయంలో నల్లగా

7. ఆ సమయంలో నల్లగా

Image Source:

వినాయకుని మహత్యం ఉత్తరాయణ కాలంలో -మార్చి నుంచి జూన్ వరకూ ఈ వినాయకుడు నల్లని రంగులో ఉంటాడు. దక్షిణాయన కాలంలో - జూలై నుంచి ఫిబ్రవరి వరకూ తెల్లని రంగులో వుంటాడు. ఈ విధంగా రంగులు మారడం ఈ వినాయకుని మహత్యం అని భక్తుల విశ్వాసం.

8. మొదట శివాలయం

8. మొదట శివాలయం

8. మొదట శివాలయం

Image Source:

ఈ ఆలయ ప్రాకార ప్రాంగణంలో ముందు శివాలయం ఉంది. ఆ తర్వాతే ఈ ఆలయం నిర్మించడం జరిగింది. అందుకే ఈ ఆలయాన్ని ‘శ్రీ మహాదేవర్ అతిశయ వినాయగర్' ఆలయం అని అంటారు. ఆ కాలంలో ఈ ఆలయం మీద వైష్ణవుల ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ కారణంగా, ఈ ఆలయాన్ని ఎన్నోమార్లు పునర్నిర్మించడం జరిగింది.

9. అలా కనిపించింది

9. అలా కనిపించింది

9. అలా కనిపించింది

Image Source:

ఈ ఆలయానికో చారిత్రక చరిత్ర కూడా ఉంది. ఆ రోజులలో ‘కేరళపురం' రాజుగారు తీర్థయాత్రలకని ‘రామేశ్వరం' వెళ్లడం జరిగింది. అక్కడ తన పరివారంతో కలసి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తన్న సమయంలో, ఆయనకు ఒక వినాయక విగ్రహం, సముద్ర కెరటాలలో తడుస్తూ కనిపించింది.

10 మరొక విగ్రహం కూడా ఇచ్చాడు

10 మరొక విగ్రహం కూడా ఇచ్చాడు

10 మరొక విగ్రహం కూడా ఇచ్చాడు

Image Source:

రాజుగారు ఆ విగ్రహాన్ని రామేశ్వరం రాజుగారికి అప్పగించబోతే..‘దొరికిన వారికే ఆ విగ్రహం చెందడం ధర్మం' అని భావించి, రామేశ్వరం రాజు ఆ విగ్రహాన్ని ‘కేరళపురం' రాజుకే ఇస్తూ, మరొక ‘మరకత(పచ్చల) గణపతిని కూడా బహూకరించాడు. కేరళపురం రాజుగారు ఆ రెండు విగ్రహాలనూ తన రాజ్యం తీసుకుని వచ్చి ప్రతిష్ఠించాడు.

11. తురుష్కుల దండయాత్ర

11. తురుష్కుల దండయాత్ర

11. తురుష్కుల దండయాత్ర

Image Source:

అయితే తురుష్కుల దండయాత్రలో ఆ మరకత గణపతి కొల్లగొట్టబడి, ఈ గణపతి మాత్రం మన అదృష్టం కొద్దీ ఇక్కడ మిగిలిపోయాడు. ఈ ఆలయం ప్రతిష్ఠ కూడా ఆగమశాస్త్రానుసారం జరగలేదు. ఒక రాతిపీఠం మీద అతి సాధారణంగా ఈ వినాయక విగ్రహాన్ని స్థాపించారు. అయినా ఈ ఆలయం ఇంత ప్రఖ్యాతి చెందడానికి ఈ వినాయకుని మహిమే కారణం అంటారు భక్తులు.

12. అతి పురాతరమైన వర్ణచిత్రాలు

12. అతి పురాతరమైన వర్ణచిత్రాలు

12. అతి పురాతరమైన వర్ణచిత్రాలు

Image Source:

ఈ ఆలయ ప్రాకార గోడల మీద అతి పురాతరమైన వర్ణచిత్రాలు చూపరులను ఎంతగానో ఆకర్షిస్తాయి. ఈ వినాయకునికి ఉదయము, సాయంకాలము కూడా అభిషేకాలు జరుగుతూండడం విశేషం. ఏ కోరికతోనైనా భక్తులు ఈ స్వామికి కొబ్బరికాయ గానీ, బియ్యపుమూట గానీ, ముడుపుగా చెల్లిస్తే వారి కోరిక తప్పకుండా నెరవేరుతుందనేది ఎవరూ కాదనలేని నిజం.

 13. కేరళపురం ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

13. కేరళపురం ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

13. కేరళపురం ఆలయానికి ఎలా చేరుకోవాలి ?

Image Source:

రోడ్డు మార్గం : కన్యాకుమారి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి 32 కి. మీ ల దూరంలో ఉన్న తక్కలై వరకు బస్సులు తిరుగుతాయి. అక్కడి నుండి సమీపాన ఉన్న కేరళపురం ఆలయం వరకు రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు.

14. రైలు, విమాన మార్గాలు

14. రైలు, విమాన మార్గాలు

14. రైలు, విమాన మార్గాలు

Image Source:

కన్యాకుమారి రైల్వే స్టేషన్ చేరుకొని, బస్సులలో లేదా టాక్సీ ఎక్కి ఆలయానికి చేరుకోవచ్చు. వాయు మార్గం దగ్గరలో వున్న ఎయిర్ పోర్ట్ త్రివేండ్రం ఎయిర్ పోర్ట్.

15. దగ్గరగా ఉన్న ప్రదేశాలు

15. దగ్గరగా ఉన్న ప్రదేశాలు

15. దగ్గరగా ఉన్న ప్రదేశాలు

Image Source:

కన్యాకుమారి లో అనేక టెంపుల్స్ మరియు బీచ్ లు కలవు . ఇవి యాత్రికులను, పర్యాటకులను బా గా ఆకర్షిస్తాయి. అలాగే కుటుంబ సభ్యులతో, స్నేహితులతో వినోద పర్యటనకు వచ్చే వారికి కన్యాకుమారి లో కల బీచ్ లు ప్రధాన ఆకర్షణలు గా ఉన్నాయి. కన్యాకుమారి పట్టణం సూర్యోదయాలకు మరియు సూర్యాస్తమయాలకు ప్రసిద్ధి. ప్రత్యేకించి పౌర్ణమి రోజులలలో ఈ ప్రాంతం చాలా అందంగా వుంటుంది.

16. ఎలా చేరుకోవాలి ?

16. ఎలా చేరుకోవాలి ?

16. ఎలా చేరుకోవాలి ?

Image Source:

రైల్వే స్టేషన్ : కన్యాకుమారి సమీప రైల్వే స్టేషన్ (47 KM). విమానాశ్రయం : తిరువనంతపురం సమీప విమానాశ్రయం (50 KM). రోడ్డు/ బస్సు మార్గం : కన్యాకుమారి, నాగర్ కోయిల్ తో పాటు సమీప పట్టణాల నుండి ప్రభుత్వ. ప్రవేట్ బస్సులు, వాహనాలు తిరుగుతుంటాయి.

17. విమానం ద్వారా

17. విమానం ద్వారా

17. విమానం ద్వారా

Image Source:

త్రివేండ్రం ఎయిర్ పోర్ట్ 80 km ల దూరంలో కలదు. రైలు ద్వారా : కన్యాకుమారి రైల్వే స్టేషన్ 20 కిలోమీటర్ల దోరంలో కలదు. రోడ్డు ద్వారా : త్రివేండ్రం, తిరునల్వేలి, కన్యాకుమారి మరియు సమీప పట్టణాల నుండి నాగర్ కోయిల్ కు బస్సులు నడుస్తాయి.

18. నేరాన్ని రుజువు చేసే శుచీంద్ర శివుడు !

18. నేరాన్ని రుజువు చేసే శుచీంద్ర శివుడు !

18. నేరాన్ని రుజువు చేసే శుచీంద్ర శివుడు !

Image Source:


మిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారికి కేవలం 13 కి.మీ. దూరంలో శుచీంద్రం అనే ఊరు కలదు. ఇక్కడ లింగరూపమైన శుచీంద్రుడు త్రిమూర్తి రూపంలో కొలువుదీరి ఉంటాడు. ఇక్కడి లింగం స్వయంభూ గా వెలసినది. లింగం అడుగున బ్రహ్మ, మధ్యన విష్ణువు, పైన శివుడు ఉంటారు. ఇక్కడి దేవుడికి ఉన్న మహిమ వల్ల నేరం తప్పక రుజువవుతుందని భక్తలు నమ్ముతారు.

19 ఇలా వెళ్లాలి

19 ఇలా వెళ్లాలి

19 ఇలా వెళ్లాలి

Image Source:

కన్యాకుమారి, త్రివేండ్రం తదితర సమీప పట్టణాల నుండి శుచీంద్రం పట్టణానికి డైరెక్ట్ గా బస్సులు కలవు. బెంగళూరు ,చెన్నై, కోయంబత్తూర్, కొచ్చిన్, కాలికట్ ప్రాంతాల నుండి కన్యాకుమారి కి, తిరువనంతపురానికి బస్సులు నడుస్తుంటాయి.

20. వివేకానందుడు ధ్యానం చేసిన ప్రదేశం !

20. వివేకానందుడు ధ్యానం చేసిన ప్రదేశం !

20. వివేకానందుడు ధ్యానం చేసిన ప్రదేశం !

Image Source:


స్వామి వివేకానందుడు దేశంలోని పుణ్య క్షేత్రాలన్నీ దర్శించాలని, ఆయా ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజల జీవన నాడిని తెలుసుకోవాలని కాలినడకన దేశాటన సాగిస్తాడు. అలా చేస్తూ చేస్తూ .. ఆయన కాశీ నుండి కన్యాకుమారి చేరుకుంటాడు. వివేకానందుడు కన్యాకుమారి ఒడ్డుకు చేరుకొని అక్కడ ఉన్న పెద్ద బండరాయి వరకు ఈత కొట్టుకుంటూ చేరుతాడు. ఇప్పడు అదే బండరాయి వివేకానంద రాక్ మెమోరియల్ గా ప్రసిద్ధి కెక్కింది. కన్యాకుమారి ఒడ్డు నుండి రాక్ మెమోరియల్ చేరుకోవటానికి ఫెర్రీ సౌకర్యం కలదు. గురువారం తప్ప, మిగితా అన్ని దినాలలో రాక్ మెమోరియల్ తెరిచే ఉంచుతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X