Search
  • Follow NativePlanet
Share
» » భారతదేశంలోని టాప్ 8 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు

భారతదేశంలోని టాప్ 8 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు

భారతదేశంలోని టాప్ 8 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు

మ‌న‌దేశంలో చారిత్ర‌క నేప‌థ్య‌మున్న ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని ప్ర‌పంచ ఖ్యాతిని పొందాయి. అక్క‌డ వేసే ప్ర‌తి అడుగులోనూ అల‌నాటి చ‌రిత్ర క‌ళ్ల‌ముందు మెద‌లాడుతుంది.

అందుకే, భారతదేశంలోని టాప్ ఎనిమిది యునెస్కో ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన ప్రదేశాల జాబితాను మీకోసం అందిస్తున్నాం.

నలంద విశ్వవిద్యాలయం, బీహార్

నలంద విశ్వవిద్యాలయం, బీహార్

నలంద విశ్వవిద్యాలయం 17 వ శతాబ్దం BCE ఆవిర్భావం నుండి గర్వించదగిన ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ విహారంగా గుర్తింపు పొందింది. ఇది ప్రాథమికంగా వేద విజ్ఞాన జ్ఞానం అభ్యాసం ప్రోత్సహించడానికి నిర్మించబడింది. భారతదేశంలో గుప్త రాజవంశ పాలనలో ఈ ప్రదేశం ఎక్కువగా అభివృద్ధి చెందింది. నలంద మ్యూజియంలో పురాతన నాణేలు, పుస్తకాలు, బుద్ధుని విగ్రహాలు, నలంద చరిత్ర గురించి తెలియజేసే గ్రంథాలు ఉన్నాయి. మీ తదుపరి బీహార్ పర్యటనలో మీరు దీన్ని అస్స‌లు మిస్స‌వ్వోద్దు.

సుందర్బన్స్, పశ్చిమ బెంగాల్

సుందర్బన్స్, పశ్చిమ బెంగాల్

దక్షిణ బెంగాల్‌లో ఉన్న సుందర్‌బన్స్ ప్రధానంగా రాయల్ బెంగాల్ టైగర్‌కు ప్రసిద్ధి చెందింది. గంగా-బ్రహ్మపుత్ర డెల్టా చిత్తడి నేల‌ల్లో కొలువైన ఈ ప్ర‌దేశం సంద‌ర్శ‌కుల‌ను అస్స‌లు ఊపిరితీయ‌నీయ‌దు. ఇక్కడ మడ చెట్లు దారిపొడుగునా ద‌ర్శ‌న‌మిస్తాయి. సుందర్‌బన్స్ వన్యప్రాణుల అభయారణ్యంలో జింకలు, అడవి పంది, నక్కలు, మొసలి మరియు ఎగిరే నక్క వంటి జంతువులు ఈ ప్రాంతంలో అధికంగా ఉన్నాయి.

సాంచి స్థూపం, మధ్యప్రదేశ్

సాంచి స్థూపం, మధ్యప్రదేశ్

భారతదేశంలోని పురాతన రాతి కట్టడంగా చెప్పబడుతున్న సాంచి స్థూపం అశోక చక్రవర్తిచే నిర్మించబడింది. ఇక్క‌డ బుద్ధుని అవశేషాలు ఉన్నాయి. ఇది అనేక పురాతన బౌద్ధ శాసనాలు మరియు ప్రధాన ద్వారంపై చెక్క‌బ‌డిన చారిత్ర‌క విశేషాల‌ను సంద‌ర్శ‌కుల‌కు ప‌రిచ‌యం చేస్తుంది. ప్ర‌ధాన ద్వారం వద్ద బుద్ధుని యొక్క అందమైన విగ్రహాన్ని చూడొచ్చు.

సూర్య దేవాలయం, ఒడిసా

సూర్య దేవాలయం, ఒడిసా

పేరులో సూచించినట్లుగా కోణార్క్ సూర్య దేవాలయం సూర్య దేవుడైన సూర్యుడిని పూజించడానికి నిర్మించబడింది. ఈ ఆలయ స్తంభాల నిర్మాణానికి ఇనుమును ఉపయోగించడం అత్యంత ప్రత్యేకత. ఈ ఆలయ నిర్మాణ శైలిలో భారతదేశ ఏడు అద్భుత‌ కథనాలు చేర్చ‌బ‌డ్డాయి.

హంపి, క‌ర్ణాట‌క

హంపి, క‌ర్ణాట‌క

అత్యధికంగా ప‌ర్యాట‌కులు గూగుల్‌లో శోధించ‌బ‌డుతోన్నసంద‌ర్శ‌నీయ ప్ర‌దేశాల్లో హంపి పేరు త‌ప్ప‌కుండా చేర్చ‌బ‌డుతుంది. ఇక్క‌డి అద్బుత‌మైన రాతి నిర్మాణ శైలి ఈ ప్ర‌దేశానికి ఆ పేరును తెచ్చి పెట్టింది. దేశం నలుమూలల నుండి ప్రజలు సందర్శించే విరూపాక్ష దేవాలయంతో సహా అనేక దేవాలయాలు ఇక్క‌డ ఉన్నాయి.

రాణి కి వావ్, గుజరాత్

రాణి కి వావ్, గుజరాత్

భారతదేశంలో చాళుక్యుల పాలనలో నిర్మించబడిన రాణి కి వావ్ అనేక మెట్ల మార్గాలతో అనుసంధానించబ‌డి ఉన్న ఐదువంద‌ల‌ శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. దీనికి 2016లో INDOSAN ద్వారా "క్లీనెస్ట్ ఐకానిక్ ప్లేస్" అనే బిరుదు కూడా లభించింది .

ఖజురహో, మధ్యప్రదేశ్

ఖజురహో, మధ్యప్రదేశ్

ఖజురహోలోని దేవాలయాలు హిందూ మరియు జైన మతాలకు అంకితం చేయ‌బ‌డ్డాయి. ఇక్క‌డి దేవాల‌యాల‌లోని శిల్పాలు మరియు నిర్మాణాలు ఈ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ శిల్పాలు రోజువారీ జీవితంలోని భంగిమలను వర్ణిస్తాయి. అలాగే కొన్ని శృంగార భంగిమలను కూడా ప్రదర్శిస్తాయి.

ఆగ్రా కోట, న్యూ ఢిల్లీ

ఆగ్రా కోట, న్యూ ఢిల్లీ

ఆగ్రా కోట న్యూ ఢిల్లీ సమీపంలోని ఆగ్రాలో ఉంది. శిల్పకళా నైపుణ్యం కలిగిన ఈ భాగాన్ని మొఘల్ చక్రవర్తులు నిర్మించారు. ఈ కోట చాలా పెద్దది, దీనిని ఒక నగరంగా కూడా చూడవచ్చు. కోట లోపలి భాగాలు అద్బుతంగా చెక్కబడిన శిల్పాలు, స్తంభాలు మరియు పైకప్పులతో అలంకరించబడ్డాయి.

More News

    Read more about: nalanda university bihar
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+