దుర్గాదాస్ కి ఛత్రి, ఉజ్జయిని దేవాలయ పట్టణంలో ఉన్న ఒక గొప్ప స్మారక కట్టడం. దీనిని రాజపుత్రుల చరిత్రకాలంనాటి ఒక చిరస్మరణీయ వ్యక్తి, వీర్ దుర్గాదాస్ యొక్క స్మారక చిహ్నంగా ఛత్రి రూపంలో కట్టించారు. మహారాజ జశ్వంత్ సింగ్ మరణం తరువాత వీర్ దుర్గాదాస్ మొఘలులకు వ్యతిరేకంగా పోరాడాడు మరియు అజిత్ సింగ్, ఔరంగజేబ్ ఇష్టానికి వ్యతిరేకంగా జోధ్పూర్ సింహాసనాన్ని అధిరోహించటానికి సహాయం చేశాడు.
ఈ ధైర్యశాలి 1718లొ మరణించాడు మరియు అతని కోరిక ప్రకారం అంత్యక్రియలు శిప్రా నది ఒడ్డున జరిగాయి. ఈ స్మారక చిహ్నం రాజ్ పుట్ నిర్మాణ శైలిని కలిగి ఉండి, ఇది పర్యాటకులకు ఒక ప్రముఖ ఆకర్షణగా ఉన్నది. ఈ ఛత్రి వీర్ దుర్గాదాస్ మరణం తరువాత జోధ్పూర్ పాలకులు అతని జ్ఞాపకాలకు గుర్తుగా కట్టించారు. ఈ స్మారక చిహ్నం ఆ ప్రాంతానికి ఒక ఆభరణంలా శోభనిస్తున్నదని ఇక్కడివారి నమ్మకం.



Click it and Unblock the Notifications