కొన్నిసార్లు ఎర్ర కోటగా పిలిచే ఆగ్రా కోట నిర్మాణ శైలి, రూపకల్పన, ఎరుపురంగు వంటి విషయాలలో ఢిల్లీ దిగ్గజ౦, చిహ్నమైన ఎర్ర కోటకు అగ్రగామిగా నిలిచింది. ఈ రెండు కట్టడాలను ఎరుపు ఇసుక రాయితో నిర్మించారు. దీనికి దగ్గరగా రాగానే పర్యాటకులకు ఢిల్లీ ఎర్ర కోట గుర్తుకు రావడాన్ని ఇది వివరిస్తుంది. ఆగ్రాలోని మొదటి ప్రపంచ వారసత్వ ప్రదేశం తాజ్ మహల్ కాగా ఇది రెండవది. దీనిని మొఘల్ చక్రవర్తి అక్బర్ 1565 లో నిర్మించాడు. ఆసక్తికరమైన అంశం, ఈ కోట ద్వారం వద్ద ఉన్న ఒక ఫలకం వాస్తవానికి ఈ కోట క్రీ.శ. 1000 కంటే ముందు నిర్మించారని తెలియచేస్తుంది, అక్బర్ చక్రవర్తి దీనిని కేవలం పునరుద్ధరించాడు.
షాజహాన్ దీని పై తిరిగి పాలరాతి, దానిపై చిత్రాల నిర్మాణం చేయించి మరింత మెరుగు పరిచాడు. నెలవంక ఆకారంలో ఉన్న ఈ కోట యమునా నదికి ఎదురుగా ఉంది. ఇది ప్రాకారం, బురుజులు కోవలో రక్షణ గోడ లాంటి నిర్మాణాలను కల్గి ఉంది.



Click it and Unblock the Notifications