పురాతన భారత దేశ పురాతన వస్తువులని, పురావస్తు శిధిలాలను,మాన్యుస్క్రిప్ట్స్ ని భధ్రపరచాలనే ఉద్దేశం తో ఏర్పాటు చెయ్య బడినది ఈ ఇన్స్టిట్యూట్. 1956 లో ప్రసిద్ద గుజరాతి వ్యాపారవేత్త అయిన కస్తూర్బాయి లల్బాయి చే నిర్మితమయింది. ఈ ఇన్స్టిట్యూట్ లోని మ్యూజియంలో హిందువుల , జైనుల , బౌద్దుల తత్వశాస్త్రం , వ్యాకరణం , పోయెట్రి లను భద్రపరుస్తారు. ఇక్కడి అతి పెద్ద సేకరణ అయిన జైన సాహిత్యం 76000 మనుస్క్రిప్ట్స్, 500 సచిత్ర వేర్షణ్ లు , 45000 ప్రచురిత పుస్తకాలు ఉన్నాయి.ఇక్కడి పురాతన పుస్తకాలు, సంస్కృత , అపభ్రంస , పాళీ , హిందీ , పురాతన గుజరాతి మరియు రాజస్థానీ భాష లలో ఉన్నాయి. శిలా శిల్పాలు, టెర్రా కోట , మినియెచుర్ మరియు
క్లోత్ పెయింటింగ్స్ , పెయింటెడ్ స్క్రోల్స్ , కంచు, చెక్క కళాకృతులు ,భారత నాణేలు , రాబింద్రనాథ్ టాగోర్ పెయింటింగ్స్ మరియు టిబెటన్ అండ్ నేపలీస్ ఆర్ట్ ను ఇక్కడ చూడవచ్చు.



Click it and Unblock the Notifications