Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» చంపానేర్

చంపానేర్ – రాచరికపు ఆనందం !!

30

చావడా వంశపు రాజు వనరాజ్ చావడా చంపానేర్ ని స్థాపించారు, ఆయన మంత్రి చంపరాజ్ పేరిట ఈ రాజ్యం ఏర్పడింది. ఈ ప్రాంతంలో అగ్నిశిలలు లేత పసుపు రంగుతో పూర్తిగా “చంపక” పుష్పాన్ని పోలి ఉండడం వల్ల ఈ పేరు వచ్చిందని కొంతమంది చెప్తారు. పావ్ ఘడ్ కోటను కిచి చౌహాన్ రాజపుత్రులు చంపానేర్ కి కొంచెం పైన నిర్మించారు, తరువాత దీనిని మహ్మద్ బేగ్డా ఆక్రమించారు. ఆయన ఇక్కడ ఒక రాజధానిని ఏర్పాటు చేసుకుని దానికి మహ్ముదాబాద్ అని పేరుపెట్టాడు, ఆ నగరాన్ని పునర్నిర్మించి, అలంకరించి 23 సంవత్సరాలు అక్కడే గడిపాడు. తరువాత మొఘల్ పాలనలో రాజధాని అహ్మదాబాద్ కి మారడం వల్ల చంపానేర్ దాని కీర్తిని, ప్రాముఖ్యతను కోల్పోయింది.

అనేక సంవత్సరాలు ఇది అడవిలో ఒక భాగంగా మిగిలిపోయింది, తరువాత బ్రిటిష్ వారు సర్వే నిర్వహించడం వల్ల దాని ఉనికి మరోసారి బహిర్గతమయింది. దీని నిర్మాణం ఖచ్చితత్వంతో ఉండడం వల్ల ప్రజలు వాస్తుశిల్ప అందాన్ని చూడడానికి వచ్చేవారు. చంపానేర్ మసీదు, సికందర్ షాహ్ సమాధి, హలోల్, సాకర్ ఖాన్ దర్గా, మకాయి కోతార్/నవ్లఖ కోతార్, సిటాడెల్, హేలికాల్ మెట్ల భావి, బ్రిక్ సమాధి, పావ ఘడ్ కోట, ప్రాచీన ఆలయాలు, కోట గోడల ద్వారాలు, జంబూఘోడా వన్యప్రాణుల అభయారణ్యం, కేవ్ది ఎకో కాంప్ స్థలం, ధన్పరి ఎకో కాంప్ స్థలం మొదలైనవి చంపానేర్ లో సందర్శించదగ్గ ప్రదేశాలు.

పావ్ ఘడ్ కోట గోడల భాగాలు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. బరోడా నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంపానేర్ ని బస్సులు, ఇతర వాహనాలలో తేలికగా చేరుకోవచ్చు. చంపానేర్ ను 2004 లో యునెస్కో సైట్ గా ప్రకటించారు.

చంపానేర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

చంపానేర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం చంపానేర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? చంపానేర్

  • రోడ్డు ప్రయాణం
    బస్సు ద్వారా అందుబాటులోని గమ్యస్థానం నుండి చంపానేర్ చేరుకోవడానికి ఇది చౌకైన ఎంపిక. అహ్మదాబాద్, వదోదర నుండి గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వ౦ వారు నడిపే బస్సులు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా చంపానేర్ రైల్వే స్టేషన్ గొదావర నుండి వదోదర లైన్ లో ఉంది, ఇక్కడికి తరచుగా రైళ్ళు లేవు. చంపానేర్ నుండి 53 కిలోమీటర్ల దూరంలో ఉన్న వదోదర సమీప ప్రధాన రైల్వే కేంద్రం.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా ఈ ప్రాంతం నుండి షుమారు 24 కిలోమీటర్ల దూరంలో వదోదర సమీప స్థానిక విమానాశ్రయం. చంపానేర్ నుండి 155 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్ సమీప అంతర్జాతీయ విమానాశ్రయం.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
25 Apr,Sat
Check Out
26 Apr,Sun
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
25 Apr,Sat
Return On
26 Apr,Sun