Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » ఎర్ర కోట

ఎర్ర కోట, ఢిల్లీ

5

నేడు ఎర్రకోట లేదా లాల్ కిలా గా పిలువబడే కోటను గతం లో కిలా ఎ మొహాల్ల అని పిలిచేవారు. ఇది షాజానాబాద్ కు కొత్త రాజధాని నగరంగా వుండేది. ఈ కోటను సుమారుగా 17 వ శతాబ్దపు మధ్య భాగం లో నిర్మించారు. దీనిని ఉస్తాద్ అహ్మద్ నమూనా చేసారు. నిర్మాణం 1639 లో మొదలై, 1648 వరకు కొనసాగింది. అయితే, 19 వ శతాబ్దం లో కొన్ని మార్పులు చేసారు.

ఎర్ర రాతి తో నిర్మించిన ఈ కోట ప్రపంచం లోనే సుందరమైనది. ఇది సుమారు 2.41 కి. మీ. ల విస్తీర్ణం కలిగి రెండు మెయిన్ గేటు లు ...లాహోరు గేటు మరియు ఢిల్లీ గేటు ...కలిగి వుంది. లాహోరు గేటు రాజ కుటుంబాల ఉపయోగానికి కల బాజార్లు కల చట్టా చౌక్ వైపు వుంటుంది.

ఈ ఎర్ర కోట ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో సంస్థ చే ప్రకటించబడింది. అందమైన ఈ నిర్మాణం ఎన్నో అద్భుత కట్టడాలను కలిగి వుంటుంది. ఈ అద్భుతాలలో దివాన్ యి ఆం ఒకటి. ఈ ప్రదేశం లో రాజు ప్రజల సమస్యలను విని పరిష్కరించే వాడు.

ప్రైవేటు మీటింగుల కు కాన్ఫరెన్స్ లకు దివాన్ యి ఖాస్ అనే భవనం కలదు. తర్వాతి కాలం లో మోతీ మసీదు ని నిర్మించారు. ఈ మసీదు మొగల్ చక్రవర్తి ఔరంగజేబ్ కు వ్యక్తిగత మసీదు గా నిర్మించారు.

చట్టా చౌక్ ప్రదేశం ఢిల్లీ లోని రెడ్ ఫోర్ట్ లో ఒక షాపింగ్ ప్రదేశం. ఇక్కడ రాజ కుటుంబాలకు అవసరమైన సిల్క్, ఆభరణాలు, ఇతర వస్తువులను మొగల్ పాలన లో విక్రయించే వారు.

దివాన్ యి ఆం లేదా ప్రజల హాలు అనే ఈ ప్రదేశం లో చక్రవర్తి షాజహాన్ ప్రజల ఫిర్యాదులను వినేవాడు. బాల్కనీ లో ఒక సింహాసనం పై కూర్చొని ఈ ఫిర్యాదులను వినేవాడు.

దివాన్ యి ఖాస్ లేదా ఖాస్ మహల్ అనేది ఢిల్లీ లోని రెడ్ ఫోర్ట్ లో ఒక ప్రైవేటు ప్రదేశం. ఇందులో షా జహాన్ చక్రవర్తి తన రాచ అతిధులతో సమావేశం అయ్యేవాడు. రెడ్ ఫోర్ట్ లో రాజుల స్నానపు ప్రదేశాల కు పడమరగా మోతీ మసీదు అనే మసీదు కలదు.

ఎర్ర కోట లోని ముంతాజ్ మహల్ మహిళల ప్రైవేటు ప్రదేశం. ఇపుడు దీనిని ఒక మ్యూజియం గా చేసారు. రెడ్ ఫోర్ట్ లో షా జహాన్ నిర్మించిన ఆరు భవనాలలో ముంతాజ్ మహల్ ఒకటి.

ఎర్ర కోట లో రంగ మహల్ ప్రవేశాన్ని నక్కర్ ఖాన అంటారు. మూడు అంతస్తులు కల ఈ భవనం రాచ కుటుంబ సభ్యుల సంగీత వాయిద్యాలకు ఉపయోగించేవారు. ఇక్కడకు వచ్చేవారు ఇక్కడే ఏనుగులను దిగే కారణంగా ఈ నిర్మాణాన్ని హాతి పోల్ అని కూడా అంటారు.

రెడ్ ఫోర్ట్ లోని రంగ మహల్ ను పాలస్ ఆఫ్ కలర్స్ లేదా బేగం మహల్ అని కూడా అనేవారు. ఇక్కడ చక్రవర్హి షాజహాన్ తన భార్యలను, ఉంపుడు గత్తె లను ఉంచేవాడు.

ఇపుడు, ప్రతి సంవత్సరం, భారత దేశ ప్రధాన మంత్రి స్వాతంత్ర దినోత్సవం నాడు, దేశ స్వాతంత్రానికి గుర్తుగా జాతీయ పతాకాన్ని ఎగుర వేస్తారు. సాయంకాల లో సౌండ్ మరియు లైట్ ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఇక్కడే ఒక పురావస్తు మ్యూజియం మరియు, ఇండియన్ వార్ మెమోరియల్ మ్యూజియం కూడా వున్నాయి.

సోమవారాలు తప్ప, వారం లోని మిగిలిన రోజులలో ఉదయం 8 గం. నుండి సాయంకాలం 6 గం. వరకు ఈ కోట తెరిచే వుంటుంది. ఈ కోట సందర్శనకు గాను అవసరమైన సౌకర్యాలుగా గైడ్ లు, ఒక చిన్న కేంటీన్, టాయ్ లెట్లు, వీల్ చైర్ లు , పార్కింగ్ స్థలాలు కలవు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
31 Mar,Tue
Check Out
01 Apr,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
31 Mar,Tue
Return On
01 Apr,Wed