Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» హళేబీడ్

హళేబీడ్  - రాచరిక వైభవాలు....శిధిలాల ప్రదర్శన

16

హళేబీడు అంటే ప్రాచీన నగరం అని అర్ధం చెప్పవచ్చు. ఒకప్పుడు హొయసల రాజులు తమ రాచరిక హంగులను ఈ ప్రదేశంలో ప్రదర్శించారు. పురాతనకాలంలో దానిని ద్వారసముద్రం అంటే సముద్రానికి ప్రవేశం అనే అర్ధంలో పిలిచేవారు.  హళేబీడు కర్నాటక రాజధాని బెంగుళూరుకు 184 కి.మీ. దూరంలో హాసన్ జిల్లాలో ఉంది. సాంస్కృతిక రాజధాని మైసూరు పట్టణానికి 118 కి.మీ. ల దూరంలో ఉంది. 12వ శతాబ్దంలో ఈ నగరం రాచరిక వైభవాలతో విలసిల్లింది. తర్వాతి కాలంలో ఈ నగరాన్ని బహమనీ సుల్తాన్లు కొల్లగొట్టటం చేత దానిని హళేబీడు అని పిలిచేవారు.

హళీబీడులోని పర్యాటక దృశ్యాలు

ఈ పట్టణంలో గల హొయసలేశ్వర మరియు శాంతలేశ్వర దేవాలయాలు అప్పటి పాలకుడు విష్ణువర్ధన మరియు రాణి శాంతల ఆదేశాలపై  కేతుమల్ల నిర్మించాడు. 12వ శతాబ్దంలో పాలకులు జైన మతాన్ని అనుసరించినప్పటికి, ఈ ప్రాంతంలో అనేక శివాలయాలు వారిచే నిర్మించబడినవి కనపడతాయి. ఈ దేవాలయాల నిర్మాణంలో వారి రాచరిక వైభవం, సంస్కృతులను, సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఎంతో అందంగా శిల్పాలు చెక్కబడ్డాయి.  ప్రస్తుతం ఇది శిధిలమైన నగరం అయినప్పటికి పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తుంది. హళీబీడు పట్టణ సందర్శన చేయాలంటే అక్టోబర్ నుండి జనవరి వరకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ పట్టణంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 8962 మంది ప్రజలు నివసిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రతి మూలనుండి బస్సుపై ఈ పట్టణానికి చేరుకోవచ్చు.

కళలకు, శిల్ప సంపదలకు నెలవు అయిన ఈ పట్టణం చెన్న కేశవ దేవాలయంకల  బేలూరు నుండి 16 కి.మీ. ల దూరంలో ఉంటుంది. హళీబీడును దేశంలో వారసత్వ ప్రదేశంగా తప్పక చూడవలసిన ప్రదేశంగా గుర్తించారు.

హళేబీడ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

హళేబీడ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం హళేబీడ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? హళేబీడ్

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - హళేబీడు ప్రధాన నగరం బెంగుళూరుకు 222 కి.మీ.ల దూరంలో ఉంటుంది. బెంగుళూరుతో సహా అనేక ప్రధాన నగరాలనుండి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులను నడుపుతుంది. ప్రయివేటు వాహనాలు, లగ్జరీ, డీలక్స్ బస్సులు బెంగుళూరు మెజస్టిక్ బస్ స్టాండ్ నుండి నడుస్తాయి. హళేబీడు చేరిన పర్యాటకులు, చుట్టు పక్కల ప్రదేశాలు చూడాలంటే, హళేబీడులో కూడా ప్రయివేటు వాహనాలు లభ్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - హళీబీడులో రైలు స్టేషన్ లేదు. హాసన్ రైలు స్టేషన్ దగ్గరగా ఉంటుంది. ఇది 27 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడినుండి ప్రధాన నగరాలైన బెంగుళూరు, మైసూర్ మరియు మంగుళూర్ లకు రైళ్ళు నడుస్తాయి. హాసన్ నుండి టాక్సీలు, క్యాబ్ లలో హళేబీడు చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    హళేబీడు ఎలా చేరాలి? విమాన ప్రయాణం - హళేబీడు చేరాలంటే, మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, దేశీయ, విదేశీయ పర్యాటకులకు ఎంతో అనువుగా ఉంటుంది. ఇది సుమారు 168 కి.మీ. ల దూరం ఉంటుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jun,Wed
Check Out
11 Jun,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu