Search
  • Follow NativePlanet
Share

లాహౌల్ - పర్వత ప్రాంతాల సౌందర్యం !

11

ఇండియా కి, టిబెట్ కి సరిహద్దు రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్ లో లాహౌల్ వుంది. లాహౌల్, స్పితి అనే రెండు వేర్వేరు జిల్లాలు, పర్వత ప్రాంతాలు 1960లో కలపబడి లాహౌల్ & స్పితి అనే ఒకే జిల్లాగా ఏర్పడ్డాయి. ఇక్కడి వారు తెల్లటి మేని ఛాయతో, తేనె రంగు కళ్ళతో ఇండో-ఆర్యన్, టిబెటన్ జాతికి చెందిన వారు. ఎక్కువ మంది భౌద్దాన్ని అనుసరిస్తూ ఆ సాంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తారు. లడఖ్, టిబెట్ లో లాంటి భాషనే ఇక్కడా మాట్లాడతారు. విహారాలపై రెపరెపలాడే ప్రార్ధనా జండాలు ఈ ప్రాంతానికి ముఖ్య చిహ్నాలు. ఈ విహారాలన్నీ ఇక్కడి ప్రజల ధార్మిక ధోరణిని ప్రతిబింబిస్తాయి.

బీడు భూములు అవడం వల్ల ఇక్కడ గడ్డి, పొదలు మాత్రమె పెరుగుతాయి. బంగాళా దుంపల సాగు, పాడి, నేత పని ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి. గోడలు లోపలికి 10 డిగ్రీల వాలుతో వుండేలా ఇక్కడ ఇళ్ళను టిబెట్ నిర్మాణ శైలిలో నిర్మించారు. చెక్క, రాళ్ళు, సిమెంట్ లాంటి పదార్ధాలతో ఈ ఇళ్ళను నిర్మించారు – ఇలాంటి పదార్ధాలు భూకంప ప్రమాదం వుండే చోట ఎక్కువగా వాడతారు.

అడవి దున్నలు, డోజోల్లాంటి జంతువులు ఇక్కడ స్వేచ్చగా తిరుగాడుతూ కనిపిస్తాయి. ఇక్కడ వృక్ష సంపద తరిగిపోవడంతో టిబెటన్ దుప్పి, ఆర్గలి, కియాంగ్, మస్క్ జింక, మంచు చిరుతలు లాంటి జంతువులను ప్రమాదంలో వున్న జాతులుగా ప్రకటించారు.

విహారాలకు, కిబ్బర్ వన్యప్రాణి అభాయారణ్యానికి ప్రసిద్ది పొందిన కిబ్బర్ గ్రామం ఇక్కడి ప్రధాన పర్యాటక ఆకర్షణ. పిన్ వాలీ నేషనల్ పార్క్, కీ విహారం, కున్ జుమ్ పాస్ ఇక్కడి ఇతర ఆకర్షణలు.

న్యూ డిల్లీ, షిమ్లా లాంటి ప్రధాన నగరాలకు అనుసంధానం చేయబడిన భుంటార్ లాహౌల్ కి సమీప విమానాశ్రయం. విమానాశ్రయం నుంచి లాహౌల్-స్పితి చేరడానికి టాక్సీలు, కాబ్ లు తేలిగ్గా దొరుకుతాయి. జోగీందర్ నగర్ ఇక్కడికి సమీపంలోని చిన్న రైల్వే స్టేషన్ కాగా, ప్రధాన రైల్వే స్టేషన్ చండీఘర్ నుంచి అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు నడుస్తాయి. రోహతంగ్ పాస్, కున్ జుమ్ పాస్, కిన్నౌర్ ల గుండా రోడ్డు మార్గం లో లాహౌల్ చేరుకోవచ్చు.

లాహుల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

లాహుల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం లాహుల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? లాహుల్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ద్వారా: లాహౌల్ కు 21 వ నెంబరు జాతీయ రహదారి ద్వారాను, రోహతంగ్ పాస్ నుంచి కాజా మార్గంలో మనాలీ గుండాను చేరుకోవచ్చు. ఐతే నవంబర్ మధ్య నుంచి మీ మధ్య వరకు రోహతంగ్ పాస్ భారీ మంచు పాతం కారణంగా మూసి ఉంటుందని పర్యాటకులు గుర్తుంచుకోవాలి. లాహౌల్ చేరుకోవడానికి కుంజుం పాస్ మరో మార్గం. ఐతే కిన్నౌర్ ద్వారా వెళ్ళే మార్గం అన్నిటికన్నా శ్రేయస్కరం.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ద్వారా: జోగిందర్ నగర్, లాహౌల్ కి దగ్గరలోని నారో గేజ్ రైలుకేంద్ర౦. అయితే, భారతదేశం లోని ప్రధాన నగరాలకు ప్రత్యక్షంగా అనుసంధానించబడి ఉన్న ప్రధాన రైల్వే స్టేషన్ చండీగర్ లో ఉంది. రైల్వే స్టేషన్ నుండి పర్యాటకులు ఈ ప్రదేశానికి చేరుకోవడానికి టాక్సీలు, కాబ్ లు అందుబాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా: న్యూ డిల్లీ, షిమ్లా వంటి ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్నలాహౌల్ నుండి సమీప విమానాశ్రయం భుంటార్ లో ఉంది. పర్యాటకులు విమానాశ్రయం బైట అద్దె టాక్సీలు, కాబ్స్ ద్వారా లాహోల్ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jun,Wed
Check Out
11 Jun,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jun,Wed
Return On
11 Jun,Thu