Search
  • Follow NativePlanet
Share

పూంచ్ - అద్భుతమైన ప్రకృతి సౌందర్యం

27

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి శివారులో ఉన్న జిల్లా పూంచ్, మినీ కాశ్మీర్ గా ప్రసిద్ది చెందింది. అద్భుతమైన ప్రకృతి సౌందర్యం నడుమ ఉన్న ఈ పూంచ్ జిల్లా మూడు వైపులా నియంత్రణ రేఖ ఉంది.

ఎంతో మంది స్థానిక మరియు విదేశీ పాలకులచేత పరిపాలించబడిన ఈ పూంచ్ ప్రాంతానికి అత్యున్నతమైన చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. ఆరవ శతాబ్దంలో హుయన్ త్సాంగ్ అనే చైనీస్ బాటసారి ఈ ప్రాంతాన్ని దాటాడు. ఆ తరువాత, మంచి గుర్రాలకి, అలాగే ముస్లూం గా పేరొందిన చక్కటి టీ రకానికి ఈ ప్రాంతం ప్రసిద్ది అని రాశాడు.

పూంచ్ ని పరిపాలించిన రాజుగా స్వయంగా ప్రకటించుకోబడిన మిస్టర్ నార్ చేత ఈ ప్రాంతం 850 AD ప్రాంతంలో పరిపాలించబడినది. 1596 లో, మొఘల్ చక్రవర్తి జహంగీర్ చేత సిరాజ్-ఉద్-దిన్ రాజుగా ఎన్నుకోబడినాడు. ఆ తరువాత, 1798 AD లో ఈ ప్రాంతాన్ని ఒక గుజ్జర్ నాయకుడు పరిపాలించడం మొదలు పెట్టాడు.

చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మిక భవనాలు, అందమైన జలపాతాలు, లోయలు, పర్వతాలు, సరస్సులు వంటి పర్యాటక ఆకర్షణలు ఎన్నో ఈ జిల్లాలో ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతం 'పూంచ్ ఫోర్ట్'. 1713 లో పూంచ్ చక్రవర్తి రాజ రుస్తం సింగ్ ఈ కట్టడాన్ని నిర్మించారు. మొఘలుల నిర్మాణ శైలికి దగ్గరగా ఈ కట్టడం యొక్క నిర్మాణం ఉంటుంది.

పూంచ్ కి 45 కిలో మీటర్ల దూరంలో ఉన్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ 'నూరి చాంబ్'. ఈ ప్రాంతం యొక్క అందానికి ముగ్ధుడైన మొఘల్ రాజు జహంగీర్ తన ముద్దుల భార్య అయిన నూర్ జహాన్ పేరునే ఈ ప్రాంతానికి పెట్టాడు. ఇక్కడ ఉన్న అందమైన జలపాతంలో రాణి స్నానం చేసేవారు.

పూంచ్ కి 7 కిలో మీటర్ల దూరంలో ఉన్న గురుద్వారా నంగాలి సాహిబ్ ని సిక్కుల యొక్క అతి పవిత్రమైన పుణ్య క్షేత్రంగా పరిగణించవచ్చు. 1803 లో ఠాకూర్ భాయి మేలా సింగ్ చేత నిర్మింపబడ్డ ఈ కట్టడం ఇక్కడున్న మరొక ప్రధాన పర్యాటక ఆకర్షణ. 1947 లో ఈ గురుద్వారా భవనం కాల్చబడినది. అయితే మహానట బచితర్ సింగ్ మళ్ళీ ఈ భవనాన్ని పునరుద్ధరించారు. ప్రతి సంవత్సరం వేల మంది భక్తులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు. బైశాఖి అనే సిక్కుల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.

హిందువుల దేవుడు శివుడికి అంకితమివ్వబడిన స్వామి బుద్దా అమర్నాథ్ జి మందిర్ ఇక్కడున్న మరొక ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రం. పూంచ్ నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం పీర్ పంచల్ పర్వత శ్రేణి మధ్య నిర్మించబడినది. ఈ ఆలయం యొక్క ద్వారాలు నాలుగు దిక్కులు అయిన తూర్పు, పడమర, ఉత్తరం మరియు దక్షిణ ముఖంగా ఉంటూ హిందువులలో అన్ని కులాలకీ ఈ ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయన్న సందేశాన్ని అందిస్తున్నాయి.

శ్రీ దశనామి అఖర మందిర్, రామ్ మందిర్, జయారాట్ చోటే షా షహిబ్, జయారాట్ సైన్ ఇల్లహి బక్షి సాహిబ్, మరియు జయారాట్ సైన్ మీరన్ సాహిబ్ వంటివి ఇక్కడున్న మరికొన్ని ఆధ్యాత్మిక కేంద్రాలు.

ఏడు సరస్సుల లోయగా ప్రసిద్ది చెందిన గిర్గాన్ ధొక్ మరొక ప్రసిద్దమైన పర్యాటక ఆకర్షణ. గుమ్సాగర్, కల్దాచ్నిసర్, నందన్సర్, భాగ్సర్, నీల్సర్, కటోరసర్ మరియు సుఖ్సార్ అనే ఏడూ సరస్సులు ఈ లోయలో ఉన్నాయి. వాటిలో అన్నిటికంటే ఒక మైల్ పొడవు, అర మైల్ వెడల్పుగా ఉన్నది నందన్సర్. బెహ్రంగల, నంది శూల్, సురాన్కోట్, మండి, డెహ్ర-గలి అలాగే లోగాన్ వంటివి ఇక్కడున్న మరికొన్ని ప్రసిద్దమైన పర్యాటక ఆకర్షణలు.

ప్రజాదరణ పొందిన రవాణా విధానాల ద్వారా పర్యాటకులు పూంచ్ కి చేరుకోవచ్చు. సమీపంలో ఉన్న దేశీయ వైమానిక స్థావరం జమ్మూ విమానాశ్రయం. 234 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం గోవా, ముంబై, శ్రీనగర్, ఢిల్లీ, జైపూర్, చండిగర్హ్, లెహ్ వంటి ఎన్నో ప్రాంతాలకి అనుసంధానంగా వ్యవహరిస్తుంది. సమీపంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం ఢిల్లీ విమానాశ్రయం. వివిధ దేశాల నుండి వచ్చే పర్యాటకులు ఈ విమానాశ్రయం ద్వారా ఈ ప్రాంతానికి చేరుకుంటారు.

జమ్మూ తావి రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న రైలుకేంద్రం. జమ్మూ నుండి పూంచ్ కి తరచూ బస్సులు అందుబాటులో ఉంటాయి. రాష్ట్ర బస్సులు చవకగా అలాగే సౌకర్యవంతంగా ఉంటాయి.

తేలికపాటి వాతావరణ పరిస్థితి దృష్ట్యా ఈ ప్రాంతం ఏడాది పొడవునా సందర్శించేందుకు అనువుగా ఉంటుంది. అయినప్పటికీ, అక్టోబర్ అలాగే నవంబర్ నెలల్నిఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఉత్తమ సమయంగా భావించవచ్చు. .

పూంచ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

పూంచ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం పూంచ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? పూంచ్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం : పూంచ్ ని చేరుకునేందుకు జమ్మూ నుండి బస్సు సర్వీసులు తరచూ అందుబాటులో ఉంటాయి. అందుబాటులో ఉన్న ధరల కారణంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ బస్సులని పర్యాటకులు ఉపయోగించుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం : పూంచ్ కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ జమ్మూ తావి రైల్వే స్టేషన్. చెన్నై, హౌరా, బెంగుళూరు, ఢిల్లీ మరియు త్రివండ్రుం వంటి ప్రధాన భారతీయ పట్టణాలకు చక్కగా అనుసంధానమై ఉంది. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో పర్యాటకులకి టాక్సీ సేవలు లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయు మార్గం జమ్మూ లో ఉన్న సత్వరి విమానాశ్రయం పూంచ్ నుండి 234 కిలో మీటర్ల దూరంలో ఉన్న దేశీయ విమానాశ్రయం. ముంబై, గోవా, జైపూర్, ఢిల్లీ, చండీగర్హ్, లెహ్ మరియు శ్రీనగర్ వంటి ముఖ్యమైన పట్టణాలకి ఈ విమానాశ్రయం చక్కగా అనుసందానమై ఉంది. విమానాశ్రయం నుండి పూంచ్ ని చేరుకోవడానికి పర్యాటకులకి టాక్సీ సేవలు లభ్యమవుతాయి. ఢిల్లీ లో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా అంతర్జాతీయ పర్యాటకుల విచ్చేస్తారు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed