పడమటి కనుమలలో ఇమిడిపోయిన చిన్న మరియు ఆహ్లాదకరమైన సకలేశ్ పూర్ ప్రాంతం పర్యాటకులకు విహార స్ధలంగా ఎంతో అనువుగా ఉంటుంది. సకలేశ్ పూర్ పట్టణం సముద్ర మట్టానికి 949 మీ.ఎత్తున ఉండి బెంగుళూరు, మైసూర్ ల నుండి తేలికగా ప్రయాణించేలా ఉంటుంది. ఈ ప్రాంతం హాసన్ జిల్లాలో ఒక భాగంగా ఉంటుంది. మన దేశంలోని కాఫీ, యాలకలు వంటి సుగంధ ద్రవ్యాలు ఈ ప్రాంతంలో అధికంగా ఉత్పత్తి అవుతాయి.
పర్వతారోహకులకు ఒక స్వర్గం సకలేశ్ పూర్ ఒకప్పుడు మైసూరు రాజుల పాలనలో ఉండేది. వారికి ముందు ఆ ప్రాంతం హొయసలులు మరియు చాళుక్యుల పాలనలే ఉండేది. హొయసలుల కాలంలో ఈ ప్రాంతానికి సకలేశ్ పూర్ అనే పేరు వచ్చింది. హొయసలులు అక్కడకు వచ్చినపుడు ఒక శివ లింగం విరిగిపడి ఉండటం గమనించారని అపుడు ఆ ప్రాంతానికి సకలేశ్ పుర అని పేరు పెట్టారని స్ధానికులు చెపుతారు.
అయితే, మరి కొందరు ఆ పట్టణంలోని నివాసితులు వ్యవసాయం వలన అధిక ధనవంతులు కావటంతో కూడా పట్టణానికి ఆ పేరు వచ్చిందని కూడా చెపుతారు.
సకలేశ్ పూర్ లో జీవ వైవిధ్యం అధికం. పర్యాటకులకు ట్రెక్కింగ్ ఆసక్తిగా ఉంటుంది. పర్యాటకులు బిస్లే రిజర్వ్ అడవులలోను కుమారా పర్వత కొండలలోను ట్రెక్కింగ్ చేసి ఆనందిస్తారు.
మీరు ట్రెక్కింగ్ చేయలేని వారైనప్పటికి, పట్టణంలో తిరిగితే చాలు ఆనందపడతారు. ఈ ప్రదేశం చేరాలంటే, హాసన్ నుండి రైలులో 35 కి.మీ. ల దూరం ప్రయాణిస్తే చాలు. దీనికి సమీప విమానాశ్రయం మంగుళూరులో ఉంది.



Click it and Unblock the Notifications