శివగంగ - ట్రెక్కింగ్ ఆసక్తి కలవారికి అద్భుత విహార స్ధలం

శివగంగ ట్రెక్కింగ్ చేసేవారికి మంచి ప్రదేశం. ఇది బెంగుళూరుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. కనుక పగటి పూటే ఉదయం వెళ్ళి సాయంత్రానికి తిరిగి రావచ్చు.  

యాత్రికులకు సరైన ప్రదేశం శివగంగ ప్రదేశం ఒక చిన్న కొండ. అక్కడి కొండపైగల శివాలయం కారణంగా ఆ ప్రదేశానికి ఆ పేరు వచ్చింది. ఇక్కడే ఒక అందమైన నీటి బుగ్గ కూడా ఉంది. స్ధానికులు ఈ నీటి బుగ్గ గంగానది నుండి వచ్చిందని చెపుతూ దీనికి శివగంగ అని పేరు పెట్టారు. కొండపైనగల శివాలయం దక్షిణ కాశి అనే మారు పేరుతో కూడా చెప్పబడుతుంది.

శివగంగ పట్టణంలో పురాతన గంగాధరేశ్వర దేవాలయం కూడా ఉంది. ఇతిహాసం మేరకు ఇక్కడ ఒక రహస్య సొరంగ మార్గం ఉందని అది బెంగుళూరులోని గావి గంగాధరీశ్వర దేవాలయానికి దోవతీస్తుందని చెపుతారు. అయితే, నేటికీ ఈ సొరంగమార్గం కాన రాలేదు. పాతాళ గంగ దేవాలయంలో  నీటి బుగ్గ భూమినుండి ఆశ్చర్యకరరీతిలో ప్రవహిస్తూంటుంది. నీటి స్ధాయి ఎప్పటికపుడు మారుతూ అదే రీతిలో ఉంటుంది. ఈ కొండపై పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. సాహస క్రీడలు చేయాలనుకునేవారు కొండలు ఎక్కవచ్చు.  డబ్బాస్ పేట, శివగంగకు సమీపంలోని పట్టణం. సుమారు 8 కి.మీ.ల దూరంలో ఉంటుంది. బెంగుళూరు నుండి వచ్చేవారు టుంకూరు బస్ ఎక్కాలి అక్కడనుండి మరో బస్ ను డబ్బాస్ పేటకు అందుకోవాలి. డబ్బాస్ పేట నుండి శివగంగకు ప్రయివేట్ వాహనాలు కూడా కలవు.

Please Wait while comments are loading...