Search
  • Follow NativePlanet
Share

స్పితి - 'మధ్య లో ఉన్న భూమి'

18

స్పితి హిమాచల్ ప్రదేశ్ కి ఈశాన్య భాగంలో ఉన్న ఒక మారుమూల హిమాలయ లోయ. స్పితి అంటే 'మధ్య లో ఉన్న భూమి' అని అర్థం. టిబెట్ మరియు భారతదేశం మధ్యలో ఉండటం వల్ల, దీనికి ఆ పేరు వచ్చింది. చాలా ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం, అత్యద్భుతమైన అందానికి ప్రసిద్ది చెందింది. స్పితి ప్రాంతం బౌద్ధ సంస్కృతి మరియు ఆరామాలకు ప్రసిద్ధి చెందింది. స్పితి మరియు దాని పరిసర ప్రాంతాలు, భారతదేశంలో అతి తక్కువ జనసాంద్రత కలిగిన ప్రాంతాలలో లెక్కిస్తారు. భోతి, స్పితి యొక్క ప్రాంతీయ భాష.

కై ఆరామం, స్పితి లోని ప్రముఖ పర్యాటక ఆకర్షణ. ఇది భారతదేశం లోనే అతి పురాతన మఠం. పర్వత బైకింగ్ మరియు జడలబర్రె సఫారీ వంటి సాహస చర్యలు ఈ ప్రాంతపు ప్రధాన ఆకర్షణలు. ఈ ప్రాంతపు సహజ సౌందర్యం కారణంగా, పాప్ మరియు మిలరేపా వంటి కొన్ని బాలీవుడ్ సినిమాలు ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ఈ ప్రాంతంలో రెండు అతి ముఖ్యమైన పట్టణాలు, కాజా మరియు కేయలోంగ్. ఇక్కడ కనిపించే కొన్నిఅరుదైన జాతుల వృక్షజాలం మరియు జంతుజాలం, ఈ స్థల ప్రాముఖ్యతను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. గోధుమ, బార్లీ, బఠానీలు ఈ ప్రాంతంలో పంటలలో కొన్ని.

కొత్త ఢిల్లీ మరియు సిమ్లా వంటి ప్రధాన నగరాలకు అనుసంధానించబడిన భుంతర్, స్పితి కి సమీపంలోని విమానాశ్రయం. అంతర్జాతీయ పర్యాటకులు, భుంతర్ విమానాశ్రయానికి ఢిల్లీ నుండి విమానాలను తీసుకోవచ్చు. స్పితికి సమీపంలోని రైల్వే స్టేషన్, జోగిందర్ నగర్ నారో గేజ్ రైల్వే స్టేషన్. అంతేకాకుండా, చండీగఢ్ మరియు సిమ్లా, స్పితికి సమీపంలోని ప్రధాన రైల్వే స్టేషన్లు. ఇవి భారతదేశం యొక్క ప్రధాన నగరాలతో కలపబడి ఉన్నాయి. యాత్రికులకి, రైల్వే స్టేషన్ నుండి స్పితికి టాక్సీలు మరియు క్యాబ్ లు సులభంగా లభిస్తాయి. జాతీయ రహదారి- 21 ద్వారా రోడ్డు మార్గంలో కూడా స్పితి చేరుకోవచ్చు. స్పితి, రోహతంగ్ కనుమ మరియు కుంజం కనుమ, రెంటినించీ అందుబాటులో ఉంది. ఈ కనుమలు రెండూ, భారీ హిమపాతం వలన, నవంబర్ నుండి జూన్ వరకు మూసివేస్తారని గమనించాలి. 412 కి.మీ.ల దూరంలో ఉన్న కిన్నార్, స్పితి చేరుకోవటానికి ఉత్తమ మార్గం.

స్పితి యొక్క వాతావరణం, శీతాకాలంలో తప్ప సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది. వేసవి కాలం, మే మరియు అక్టోబర్ నెలల మధ్యలో ఉంటుంది. ఉష్ణోగ్రత 15 ° సెం. కి దాటి వెళ్ళదు కాబట్టి, ఈ స్థలం సందర్శించడానికి ఉత్తమ సమయం వేసవే. స్పితి వర్షపు చాయ ప్రాంతంలో ఉండటం వల్ల, ఇక్కడ చాలా తక్కువ వర్షాలు కురుస్తాయి. శీతాకాలంలో, ఈ ప్రాంతంలో భారీ హిమపాతం ఉంటుంది. ఉష్ణోగ్రతలు సున్నా డిగ్రీల కన్నా తక్కువకి వెళతాయి.

స్పితి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

స్పితి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం స్పితి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? స్పితి

  • రోడ్డు ప్రయాణం
    రహదారి: స్పితి సందర్శించే ఆసక్తిగల ప్రయాణీకులు, జాతీయ రహదారి- 21 ద్వారా కూడా గమ్యం చేరుకోవచ్చు.ఈ ప్రదేశం,మనాలి కి, రోహతంగ్ కనుమ ద్వారా కాజా కు వెళ్ళే మార్గంతో అందుబాటులో ఉంది. ఈ స్థలం చేరేందుకు, అన్ని వాతావరణాలకు సరిపడే ఉత్తమ మార్గం, సుమారు 412 కిలోమీటర్ల పొడవు గల సిమ్లా నుండి కిన్నార్ ద్వారా వెళ్ళే మార్గం. స్పితి చేరుకునేందుకు బస్సులు మరియు టాక్సీలు యాత్రికులకి సులభంగా లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం: జోగిందర్ నగర్, స్పితి కి సమీపంలోని నారో గేజ్ రైల్వే స్టేషన్. స్పితి సమీపంలో ప్రధాన రైల్వే స్టేషన్లు అయిన చండీగఢ్ మరియు సిమ్లా, చాలా భారత నగరాలతో నేరుగా కలపబడి ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    స్పితి, వాయు, రైలు లేదా రహదారుల ద్వారా సులభంగా చేరుకోవచ్చు. విమానయానం: భుంతర్, స్పితి సమీపంలోని విమానాశ్రయం. ఈ వైమానిక స్థావరం, సిమ్లా మరియు కొత్త ఢిల్లీ వంటి నగరాలతో నేరుగా అనుసంధానించబడింది. అంతర్జాతీయ ప్రయాణికులు ఢిల్లీ నుండి అనుసంధాన విమానం తీసుకోవచ్చు. విమానాశ్రయం వెలుపల, స్పితి చేరుకునేందుకు, టాక్సీలు మరియు కార్లు సులభంగా లభిస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
20 Sep,Sun
Return On
21 Sep,Mon
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
20 Sep,Sun
Check Out
21 Sep,Mon
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
20 Sep,Sun
Return On
21 Sep,Mon