Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తడియాండమోల్

తడియాండమోల్ - కర్నాటకలో రెండవ అతి పెద్ద శిఖరం

11

తడియాండమోల్ కర్నాటకలో రెండవ ఎత్తైన శిఖరం. ఇది పడమటి కనుమలలో ఉంది. కూర్గ్ జిల్లాలో కక్కాబే పట్టణానికి సమీపంలో ఉంది. ఇది సరిగ్గా కేరళ - కర్నాటక సరిహద్దులలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 1748 మీటర్ల పొడవున ఉంటుంది. ఈ శిఖరం ట్రెక్కర్లకు, పర్వతారోహకులకు ఎంతో సవాలుగా ఉంటుంది.  

తడియాండమోల్ లో చూడదగిన ప్రదేశాలేమిటి? తడియాండమాల్ అంటే పెద్ద పర్వతం అని మళయాళ భాషలో అర్ధంగా చెపుతారు. ట్రెక్కింగ్ పట్ల ఆసక్తి లేనివారికి సగం దూరం కార్లలో వెళ్ళవచ్చు. అయితే, చివరి కొద్ది దూరం కష్టంగా ఉంటుంది. అయినప్పటికి శిఖరం పైకి ఎక్కి చూస్తే పడిన కష్టం అంతా పోయి ఎంతో ఆనందం కలుగుతుంది.

 ఈ పర్వత మొదటి లేదా కింది భాగంలో గల నలక్కండ్ ప్యాలెస్ కు చారిత్రక ప్రాధాన్యం కలదు. దీనిని 1792 లో దొడ్డ వీర రాజేంద్ర తన సైనికులకు సురక్షిత వసతి కొరకు నిర్మించారు. శిఖరం చేరే కొద్ది కిలోమీటర్ల ముందరగా ట్రెక్కర్లు పురాతన పడిలఘుతప్ప దేవాలయంలో కొద్ది సేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ దేవాలయం స్ధానికులకు ఎంతో పవిత్రమైన దేవాలయంగా చెపుతారు. శిఖర ఏటవాలులలోని షోలా అడవులు చాలా ప్రాచీనమైనవి మరియు ఇంతవరకు ఎవరూ చొరబడనివిగా చెపుతారు.

తడియాండమోల్ కు కేరళ మరియు కర్నాటక రాష్ట్రాలనుండి తేలికగా చేరవచ్చు. దీనికి సమీప ఎయిర్ పోర్ట్ 321 కి. మీ. ల దూరంలో బెంగుళూరు లో కలదు.  దీనికి సమీప రైలు స్టేషన్ 263 కి.మీ.ల దూరంలో బెంగుళూరులో కలదు. బెంగుళూరు నుండి తడియాండమోల్ కు అయిదుగంటల సమయంలో టాక్సీలలో చేరవచ్చు.     

తడియాండమోల్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తడియాండమోల్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తడియాండమోల్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తడియాండమోల్

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - బెంగుళూరు నుండి మరియు ఇతర సమీప నగరాలు, పట్టణాలనుండి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ బస్సులను నడుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - తడియాండమోల్ కు రైలు స్టేషన్ లేదు. మంగుళూరు రైలు స్టేషన్ సమీపంగా 131 కి.మీ.ల దూరంలో ఉంది. ఇక్కడినుండి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు రైళ్ళు నడుస్తాయి. పర్యాటకులు టాక్సీలు, క్యాబ్ లేదా బస్ లలో తడియండమోల్ చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    తండియాండమోల్ చేరటం ఎలా? విమాన ప్రయాణం - దేశంలోని వివిధ ప్రాంతాలనుండి వచ్చే పర్యాటకులకు మంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 139 కి.మీ. ల దూరంలోను బెంగుళూరు విమానాశ్రయం 321 కి.మీ. ల దూరంలోను ఉండి సేవలను అందిస్తాయి. అయితే, ఐరోపా, ఆసియా, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలనుండి వచ్చే పర్యాటకులకు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సిఫార్సు చేయదగినది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Jun,Thu
Return On
12 Jun,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Jun,Thu
Check Out
12 Jun,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Jun,Thu
Return On
12 Jun,Fri