Search
  • Follow NativePlanet
Share
» »బోయవాడి ఆకలి తీర్చిన శివుడి తల నుంచి రక్తమాంసాల వాసన అయినా...

బోయవాడి ఆకలి తీర్చిన శివుడి తల నుంచి రక్తమాంసాల వాసన అయినా...

వాడపల్లి అగస్తేశ్వర దేవాలయం, వాడపల్లి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయ గురించిన కథనం

భారత దేశం ఆలయాల నిలయమన్న సంగతి తెలిసిందే. కొన్ని ఆలయాలు నదుల తీరం వెంబడి ఉంటే మరికొన్ని సముత్రపు ఒడ్డుకు ఆనుకొని ఉన్నాయి. అయితే చాలా తక్కువ ఆలయాలు మాత్రం సంగమ స్థలాలల్లో కొలువై ఉన్నాయి.

అంటే నది సముద్రం కలిసే చోటు కాని, ఒక నది మరో నదిలో కలిసే ప్రదేశంలో కాని ఆలయాలు నిర్మించారు. ఇలా సంగమం ప్రాంతంలో నిర్మించిన ఆలయాల సందర్శనం వల్ల పంచ హత్య మహాపాతకాలు నశించిపోతాయని హిందూ భక్తులు నమ్ముతారు.

అందువల్లే పుణ్యక్షేత్రాల సందర్శన పై నమ్మకం ఉన్న వారు తమ తీర్థయాత్రలో భాగంగా తప్పకుండా ఈ సంగమ క్షేత్రాలను సందర్శింస్తూ ఉంటారు. ఇటువంటి కోవకు చెందినదే శ్రీ అగస్త్యేశ్వస్వామి ఆలయం. ఆ ఆలయ విశిష్టతలకు సంబంధించిన కథనం మీ కోసం...

వాడపల్లిలో

వాడపల్లిలో

P.C: You Tube

తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా వాడపల్లిలో కృష్ణా నది, ముచికుందా నదుల సంగమం ఉంది. అదే వాడపల్లి తెలంగాణతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఇలా రెండు నదుల సంగమ ప్రాంతాల సంఖ్యను వేళ్ల మీద లెక్కపెట్టవచ్చు.

కృష్ణా నది, ముచికుందా నదుల సంగమం

కృష్ణా నది, ముచికుందా నదుల సంగమం

P.C: You Tube

ఇక కృష్ణా నది, ముచికుందా నదుల సంగమం అయిన వాడపల్లి వద్ద ఉన్న రెండు అతి పురాతన దేవాలయాల్లో మీనాక్షి అగస్త్యేశ్వరాలయం ఒకటి. ఈ గుడిలో శివుడి పానుపట్టం భూ ఉపరి తలయానికి కొంత ఎత్తులో ఉంటుంది.

నీటి మట్టం ఎప్పుడూ ఒకే రకంగా

నీటి మట్టం ఎప్పుడూ ఒకే రకంగా

P.C: You Tube

దాని మీద శివలింగం మరో రెండు అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ శివలింగం మీద ఒక చిన్న గుంట ఉండి అందులో నుంచి నీరు ఎప్పుడూ ఉబికి వస్తూ ఉంటుంది. అయితే ఆ నీరు శివలింం నుంచి కిందకు పొర్లదు. అంతే కాకుండా ఆ గుంటలో నీటి మట్టం ఎప్పుడూ ఒకే రకంగా ఉంటుంది.

ఒక బోయవాడు పక్షిణి కొట్టబోతే

ఒక బోయవాడు పక్షిణి కొట్టబోతే

P.C: You Tube

ఇందుకు సంబంధించి స్థానిక కథనం ఒకటి ప్రచారంలో ఉంది. ఒక రోజు ఒక బోయవాడు పక్షిణి కొట్టబోతే ఆ పక్షి వచ్చి ఈ శివలింగం వెనుకాల దాక్కొంది. శివుడు జాలిపడి ఆ పక్షిని రక్షించాలనుకొన్నాడు. అయితే బోయవాడు వచ్చి ఆ పక్షి తనదని దానిని తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు.

గొడ్డలితో శివుడి శిరస్సును కొంత మేర ఖండించి

గొడ్డలితో శివుడి శిరస్సును కొంత మేర ఖండించి

P.C: You Tube

దీంతో శివుడు తాను ఈ పక్షికి మాట ఇచ్చానని అయితే నీ కోరిక కూడా సమంజసంగా ఉందని చెబుతారు. నీ ఆకలి తీర్చుకోవడానికి వీలుగా నా తల నుంచి కొంత మాంస తీసుకోవాలని సూచిస్తాడు. ఆ బోయవాడు ఇందుకు అంగీకరించి తన వద్ద గొడ్డలితో శివుడి శిరస్సును కొంత మేర ఖండించి చేతి వేళ్లతో కొంత మాంసాన్ని తీసుకొంటాడు.

అందువల్లే అలా

అందువల్లే అలా

P.C: You Tube

ఆ చేతివేళ్ల గుర్తులను మనం ఇప్పటికీ అక్కడ చూడవచ్చు. ఇక స్వామివారి గాయన్ని కడగడానికి నేరుగా గంగమ్మే ఇక్కడికి వచ్చిందని చెబుతారు. అందువల్లే ఈ శివలింగం పై గుంటలో నీరు ఎల్లప్పుడు ఉంటుందని చెబుతారు.

శంకరాచార్యలు శిష్యసమేతంగా

శంకరాచార్యలు శిష్యసమేతంగా

P.C: You Tube

ఇదిలా ఉండగా క్రీస్తుశకం 1524లో శ్రీ శంకరాచార్యలు శిష్యసమేతంగా ఈ ఆలయాన్ని సందర్శించారు. ఆ బిలం (గుంట) లోతు ఎంత ఉందో తెలుసుకోవడానికి ఒక ఉద్దరిణికి తాడు కట్టి ఆ బిలంలో వదిలారు. ఎంత సమయమైనా ఆ తాడు అలా వోపలికి వెళుతూనే ఉంది. దీంతో ఆ తాడును పైకి లాగారు.

రక్త మాంసాలు అంటుకున్నాయి కాని

రక్త మాంసాలు అంటుకున్నాయి కాని

P.C: You Tube

ఆ ఉద్దరిణికి రక్త మాంసాలు అంటుకున్నాయి కాని ఆ బిలం లోతు తెలియలేదు. దీంతో శంకరాచార్యలు లయకారకుడైన నిన్ను పరీక్షించడానికి నేను ఎంతవాడినని పరి పరి విధాలుగా ప్రార్థించాడు. తర్వాత ఈ వివరాలను తెలుపుతూ అక్కడ పాళీ భాషలో రాతి శాసనం కూడా వేయించాడు.

భూత, ప్రేత పిశాచాల భయం ఉండదు

భూత, ప్రేత పిశాచాల భయం ఉండదు

P.C: You Tube

సదరు శాసనాన్ని మనం ఇప్పటికీ చూడవచ్చు. ఇది నదీ సంగమం కనుక ఇక్కడ అస్తికలు నిమజ్జనం కూడా చేస్తుంటారు. ఈ వాడపల్లి శ్రీ అగస్త్యేశ్వస్వామి సందర్శనం వల్ల భూత, ప్రేత పిశాచాల భయం ఉండదని స్థానిక భక్తుల నమ్మకం.

ప్రయాణం ఇలా

ప్రయాణం ఇలా

P.C: You Tube

హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ల వెళ్లే బస్సులన్నీ ఈ వాడపల్లి మీదుగానే వెలుతాయి. ఈ వాడపల్లి పుణ్యక్షేత్రానికి దర్గరి రైలు మార్గం మిర్యాలగూడ. అక్కడి నుంచి ప్రభుత్వ, ప్రైవేటు బస్సులతో పాటు ఆటో సౌకర్యం కూడా ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X