Search
  • Follow NativePlanet
Share
» » స్వర్గాన్ని చేర్చే యమకోణం

స్వర్గాన్ని చేర్చే యమకోణం

కాళేశ్వర, ముక్తేశ్వర దేవాలయం గురించి కథనం

భారత దేశం ధార్మిక దేశం అన్న సంగతి తెలిసిందే. అందువల్లే ఇక్కడ ఉన్నన్ని ధార్మిక ప్రాంతాలు మరేచోట మనకు కనిపించవు. ఇందులో ఒక్కొక్క క్షేత్రానికి ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది. ఇందులో కొన్ని నమ్మకాల పై ఆధారపడి ఉండగా మరొకొన్నింటి క్షేత్రాలకు సంబంధించి పురాణ గాధలు ప్రచారంలో ఉంది. ఇక ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్షేత్రం అత్యంత విశిష్టమైనది. ఇక్కడ ఒకే చోట మనం రెండు శివలింగాలను చూడటమే కాకుండా యమకోణం అనే విశిష్ట నిర్మాణాన్ని కూడా చూడవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ మీ కోసం...

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

P.C: You Tube

త్రిలింగ క్షేత్రాల్లో మహాకాళేశ్వర దేవాలయం కూడా ఒకటి. మిగిలిన రెండు శ్రీశైలం, ద్రాక్షారామం. త్రిలింగాల నడుమన ఉండే ప్రాతం కాబట్టే ఈ క్షేత్రానికి త్రిలింగమని పేరువచ్చినట్లు చెబుతారు. మరికొందరి వాదనను అనుసరించి తెలుగు అనే పదం త్రిలింగం నుంచే పుట్టినట్లు చెబుతారు.

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

P.C: You Tube
సుప్రసిద్ధ శైవ క్షేత్రాల్లో మహా పుణ్యక్షేత్రంగా కాళేశ్వరం ఉంది. ఇది కరీంనగర్ జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతమైన గోదావరి నది ఒడ్డున నెలకొని ఉంది. గోదావరి తీరంలో ఒక వైపున ఉన్న కాళేశ్వర పుణ్యక్షేత్రానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

P.C: You Tube
మన రాష్ట్రంలోని శైవ క్షేత్రాల్లో శ్రీ శైలంలోని మల్లికార్జున స్వామి, ద్రాక్షారామంలోని భీమేశ్వర స్వామి, కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాయలం ప్రసిద్ధి చెందినవి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అతర్వాహినిగా సరస్వతీ నదీ కూడా ప్రవహించడం వల్ల ఈ క్షేత్రాన్ని త్రివేణి సంగమ క్షేత్రం అని అంటారు.

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

P.C: You Tube
భారత దేశంలో ఎక్కడైనా ఒకే పానవట్టం మీద ఒకే శివలింగం ఉంటుంది. అయితే ఇక్కడ మాత్రం ఒకే పానవట్టం మీద రెండు శివలింగాలు ఉంటాయి. అందులో ఒకటి కాళేశ్వర లింగం కాగా, రెండవది ముక్తీశ్వర లింగం. ఈ ముక్తీశ్వర లింగానికి రెండు నాశికా నంధ్రాలుంటాయి.

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

P.C: You Tube
ఆ రంధ్రాల్లో ఎంత నీరు పోసినా పైకి రావు. త్రివేణి సంగమ తీరంలో ఆ నీరు కలుస్తుందని చారిత్రకాధారాల వల్ల తెలుస్తోంది. ఈ క్షేత్రం కాశీ క్షేత్రం కంటే గొప్పదని కాళేశ్వర ఖండం వల్ల తెలుస్తోంది. ఈ క్షేత్రం గురించి స్కాందపురాణం, గౌతమీ పురాణాల్లో కూడా పేర్కొనబడింది.

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

P.C: You Tube
ఈ దేవాలయంలో కాళేశ్వరుడికి ముందు పూజచేసి, అనంతరం ముక్తీశ్వరుడికి పూజలు చేస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. ఈ దేవాలయానికి సంబంధించిన కథనం ఒకటి ప్రచారంలో ఉంది. దానిని అనుసరించి ఈ ఆలయాన్ని దర్శించిన వారికి ముక్తేశ్వరస్వామి ముక్తిని ఇస్తుండటంతో యముడికి పనిలేకుండా పోతుంది.

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

P.C: You Tube
దీంతో యముడు ఈశ్వరుడిని వేడుకొనగా యముడిని కూడా లింగాకారంలో తన పక్కనే నిల్చోమని పరమేశ్వరుడు చెప్పాడని చెబుతారు. ముక్తేశ్వరుడిని చూసి యముడిని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్లని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట.

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

P.C: You Tube
అందుకే భక్తులు స్వామిని దర్శించుకొన్న తర్వాత కళేశ్వరుడిని తప్పకుండా సందర్శిస్తూ ఉంటారు. ఆలయంలోకి ప్రవేశించే సమయంలో యమకోణం ఉంటుంది. ఇందులో నుండి బయటికి వెళ్లితే యమదోషం పోతుందని భక్తులు తరతరాలుగా విశ్వసిస్తున్నారు. ఇందులోకి ఎలా వెళ్లాలన్న విషయాన్ని అక్కడ ఒక దిక్సూచి ఉంటుంది.

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

P.C: You Tube
కళేశ్వర క్షేత్రం శిల్పకళఆ నిలయం. ఇక్కడ ఇప్పటి వరకూ బయటపడ్డ అనేకశిల్పాల వల్ల గత వైభవం మనకు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ కాళేశ్వరం అరుదైన దేవాలయాలకు కూడా నిలయం. మనదేశంలో ప్రముఖ సరస్వతీ దేవి ఆలయాలు మూడు ఉన్నాయి.

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

P.C: You Tube
అందులో కాళేశ్వరంలో మహాసరస్వతి దేవాలయం కూడా ఒకటి. మిగిలిన రెండు ఆదిలాబాద్ జిల్లాలోని బాసరలోని జ్జానసరస్వతీ దేవాలయం, కాశ్మీరులోని బాలసరస్వతీ దేవాలయం. అదే విధంగా మనదేశంలో ప్రధానమైన సూర్యదేవాలయాలు కూడా మూడు ఉన్నాయి.

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

P.C: You Tube
అందులో కాళేశ్వరంలో ఉన్న సూర్యదేవాలయం కూడా ఒకటి. ఒరిస్సాలోని కోణార్క్, శ్రీకాకుళంలోని జిల్లాలోని అరసవిల్లిలో ఉన్నవి మిగిలిన దేవాలయం. ఇక కాళేశ్వరం అనేక తీర్థాల సమాగమం. ఇక్కడ బ్రహ్మతీర్థం, నరసింహతీర్థం, హనుమత్ తీర్థం, జ్జానతీర్థం, వాయుసతీర్థం, సంగమతీర్థం మొదలైనవి ఉన్నాయి.

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం


P.C: You Tube
కాళేశ్వరం తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలంలోని ఒక చిన్న గ్రామం. ఇది మండల కేంద్రమైన మహదేవ్ పూర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలోనూ, సమీప పట్టణమైన రామగుండం నుంచి 47 కిలోమీటర్ల దూరంలో ఈ కాళేశ్వరం ఉంది. ఇక్కడికి రామగుండం నుంచి నిత్యం బస్సు సర్వీసులు అందుబాటులో ఉంటాయి.

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

P.C: You Tube
కాళేశ్వరంలోని రైల్వేస్టేషన్ లేదు. సమీప రైల్వే స్టేషన్ రామగుండం. ఈ రెండింటి మధ్య దూరం 98 కిలోమీటర్లు. రామగుండం కు హైదరాబాద్ తో పాటు మిగిలిన నగరాల నుంచి రైలు సౌకర్యం ఉంది.

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

కాళేశ్వర, ముక్తేశ్వర ఆలయం

P.C: You Tube
హైదరాబాద్-సిద్ధిపేట-పెద్దపల్లి-కాళేశ్వరం చేరుకోవచ్చు. ఇందు కోసం 300 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అతేంకాకుండా హైదరాబాద్ బొంగిర్-వరంగల్-పర్కాల్-కాళేశ్వరం చేరుకోవచ్చు. ఇందుకు 260 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. ప్రయాణ సమయం 4 గంటల 15 నిమిషాలు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X