Search
  • Follow NativePlanet
Share
» »అందుకే దేవతలు భూమి పై ఇక్కడికి వచ్చి వన విహారం చేసిది

అందుకే దేవతలు భూమి పై ఇక్కడికి వచ్చి వన విహారం చేసిది

భారత దేశంలోని ఫ్లవర్స్ వ్యాలీ గురించి కథనం.

అందమైన పుష్పాలు ఎంతసేపు చూసిన తనివి తీరదు. అటువంటి పుష్పాలు కోట్ల సంఖ్యలో ఒకే చోట చూస్తే ఆ ఆనందమే వేరు. అటువంటి ప్రాంతాలు భారత దేశంలో చాలా చోట్ల ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్. కాస్ మైదానం. జు కోవు పూల వనం. యమ్ తంగ్.

వీటిని ఫ్లవర్స్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. జూన్ మొదలు అక్టోబర్ వరకూ ఇక్కడ వేల జాతులకు చెందిన కోట్లాది పుష్పాలు వికసిస్తాయి. ఈ పూల అందాలను చూడటానికి భారత దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తారు.

ఈ మూడు ట్రెక్కింగ్ కు కూడా అనుకూలమైన ప్రాంతాలు. దీంతో వీకెండ్ సమయంలో ఇక్కడికి ట్రెక్కర్స్ క్యూ కడుతారు. అయితే సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉన్నా ఈ ప్రాంతాలను చేరుకోనే క్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం. అంతే కాకుండా నిపుణుల సహకారంతో ఇక్కడి వెళ్లడం ఉత్తమమని గుర్తించుకోండి.

ఫ్లవర్స్ వ్యాలీ

ఫ్లవర్స్ వ్యాలీ

P.C: You Tube

యునెస్కో గుర్తింపు పొందిన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తాఖండ్ లో ఉంది. సముద్రమట్టానికి 3,658 మీటర్ల ఎత్తున ఉన్న ఈ పూలలోయ ఇది. 1982లో దీనిని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు.

ఫ్లవర్స్ వ్యాలీ

ఫ్లవర్స్ వ్యాలీ

P.C: You Tube

సుమారు 87 చదరపు కిలోమీటర్ల విస్తరించి ఉన్న ఈ భారీ ఉద్యానవనాన్ని పుష్పవతి నది రెండుగా విభజిస్తుంది. ఏడాది మొత్తం మంచుతో ముడుచుకున్న కొండలు జూన్ వచ్చేనాటికి ఈ ప్రాంతంలో వేలాది జాతులు పుష్పాలు వికసిస్తాయి.

ఫ్లవర్స్ వ్యాలీ

ఫ్లవర్స్ వ్యాలీ

P.C: You Tube

లిల్లీ, హిమాలయన్ డేజీ, అరుదైన పుష్పాలుగా చెప్పే బ్రహ్మకమలాలు, ఇలా ఎన్నెన్నో పూలు లోయంతా పరుచుకొని పర్యాటకుల కోసం ఎదురుచూస్తూ ఉంటాయి. పర్యాటకులను సాదరంగా ఆహ్వానిస్తాయి.

ఫ్లవర్స్ వ్యాలీ

ఫ్లవర్స్ వ్యాలీ

P.C: You Tube

జూన్ రెండో వారం నుంచి మొదలయ్యే పూలవసంతం అక్టోబర్ వరకూ కొనసాగుతుంది. 75 ఏళ్లు పైబడిన వారితో పాటు ఆరేళ్లు దాటని చిన్నారులను ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కు అనుమతించరు.

ఫ్లవర్స్ వ్యాలీ

ఫ్లవర్స్ వ్యాలీ

P.C: You Tube

ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం రుషికేష్ నుంచి 320 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోవిందఘాట్ వరకూ బస్సులో, ట్యాక్సీలో వెళ్లొచ్చు. రవాణా సదుపాయం బాగుంది.

ఫ్లవర్స్ వ్యాలీ

ఫ్లవర్స్ వ్యాలీ

P.C: You Tube

గోవిందఘాట్ నుంచి 13 కిలోమీటర్లు కొండలు, లోయలు గుండా ట్రెక్కింగ్ చేస్తే గంగారియా బేస్ క్యాంప్ వస్తుంది. అక్కడి నుంచి నాలుగైదు కిలోమీటర్లు నడవాలి.

ఫ్లవర్స్ వ్యాలీ

ఫ్లవర్స్ వ్యాలీ

P.C: You Tube

ఇక లోయలో పూల సొగసు చూడటానికి మరో పది నుంచి పదిహేను కిలోమీటర్లు తిరగాలి. ఇంత తిరిగినా పూల పరిమళాల వల్ల అలసట దరి చేరదు. అందువల్లే ట్రెక్కర్స్ తోపాటు సాధారణ పర్యాటకులు ఇక్కడికి ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు.

ఫ్లవర్స్ వ్యాలీ

ఫ్లవర్స్ వ్యాలీ

P.C: You Tube

ఉదయం 7 నుంచి మధ్యాహ్నం నుంచి 2 గంటల వరకూ లోనికి వెళ్లొచ్చు. లోపలికి వెళ్లినవారు సాయంత్రం 5 గంటల లోపు బయటికి వచ్చేయాలి. రుషికేష్ నుంచి ఐదు రోజుల ప్యాకేజీకి రూ.7,500 నుంచి రూ.12,000 వసూలు చేస్తారు.

ఫ్లవర్స్ వ్యాలీ

ఫ్లవర్స్ వ్యాలీ

P.C: You Tube
నాగాలాండ్, మణిపూర్ సరిహద్దులో జు కోవు పూలలోయ ఉంటుది. ఇక్కడ జు కోవు లిల్లీ ప్రధాన ఆకర్షణ. జులై రెండో వారం నుంచి అక్టోబర్ వరకూ ఈ లోయమొత్తం పూలతో కళకళలాడుతూ ఉంటుంది. నాగాలాండ్ రాజధాని కోహిమా నుంచి 25 కిలోమీటర్లు ప్రయాణిస్తే జు కోవు చేరుకోవచ్చు.

ఫ్లవర్స్ వ్యాలీ

ఫ్లవర్స్ వ్యాలీ

P.C: You Tube

మహారాష్ట్రలోని కాస్ మైదానంలో కొన్ని కోట్ల పూల మొక్కలను చూడవచ్చు. ప్రతి ఏడాది ఆగస్టు నుంచి సెప్టెంబర్ నెలల్లో ఈ నేలలో రంగురంగుల పూలు పుట్టుకువస్తాయి.

ఫ్లవర్స్ వ్యాలీ

ఫ్లవర్స్ వ్యాలీ

P.C: You Tube

దాదాపు ఆరు వందల రకాల పూల మొక్కలను ఇక్కడ చూడవచ్చు. ప్రపంచంలో ఎక్కడా కనిపించని 40 రకాల మొక్కలు ఇక్కడ పుష్పించడం విశేషం. అందుకే కాస్ మైదానం యునెస్కో చేత వైవిద్య కేంద్రంగా గుర్తింపు పొందింది.

ఫ్లవర్స్ వ్యాలీ

ఫ్లవర్స్ వ్యాలీ

P.C: You Tube

ఆగస్టు, సెప్టెంబర్ వచ్చిందంటే చాలు ముంబైకర్లు, పూణె వాసులు చలో కాస్ అంటూ తమ కాళ్లకు పనిచెబుతారు. పూణే నుంచి 135 కిలోమీటర్ల దూరంలో ఈ కాస్ పూల వనం ఉంటుంది. సతారా నుంచి కాస్ కేవలం 23 కిలోమీర్లు మాత్రమే.

ఫ్లవర్స్ వ్యాలీ

ఫ్లవర్స్ వ్యాలీ

P.C: You Tube

సిక్కిం రాజదాని గ్యాంగ్ టక్ కు సుమారు 130 కిలోమీటర్ల దూరంలో యమ్ తంగ్ లోయ ఉంటుంది. సముద్ర మట్టానికి 11,800 అడుగుల ఎత్తులో ఉన్న లోయలో యయ్ తంగ్ నది గలగల కదిలిపోతూ ఉంటుంది.

ఫ్లవర్స్ వ్యాలీ

ఫ్లవర్స్ వ్యాలీ

P.C: You Tube

నదికి అటూ ఇటూ అదమైన పూలవనం కనిపిస్తుంది. జూన్ నుంచి డిసెంబర్ వరకూ ఇక్కడ పర్యాటకుల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడికి 16 కిలోమీటర్ల దూరంలో సముద్రమట్టానికి సుమారు 15,400 అడుగుల ఎత్తులో ఉన్న జీరో పాయింట్ మరో ఆకర్షణ.

ఫ్లవర్స్ వ్యాలీ

ఫ్లవర్స్ వ్యాలీ

P.C: You Tube

లాచుంగ్ సమీపంలో బాగ్ డోగ్రా విమానాశ్రయం ఉంది. కలకత్తా నుంచి విమానాశ్రయంలో బాగ్ డోగ్రాకు వెళ్లి అక్కడి నుంచి లాచుంగ్ మీదుగా బస్సులో కాని ట్యాక్సీలో కాని 220 కిలోమీటర్ల దూరంలోని యమ్ తంగ్ చేరుకోవచ్చు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X