Search
  • Follow NativePlanet
Share
» »30 అడుగుల పై నుంచి పిల్లాడిని కిందికి విసిరేస్తేనే ఆరోగ్యం బాగుపడుతుందంట

30 అడుగుల పై నుంచి పిల్లాడిని కిందికి విసిరేస్తేనే ఆరోగ్యం బాగుపడుతుందంట

భారతదేశంలో వింత ఆచారాలను కలిగిన దేవాలయాల గురించి కథనం.

భారత దేశం నమ్మకాలకు పెట్టింది పేరు. కొన్ని నమ్మకాలు తరతరాలుగా సంప్రదాయాలుగా వస్తున్నాయి. అవి ఎప్పుడు, ఎలా మొదలయ్యాయి, ఎవరు మొదలు పెట్టారు, ఎందుకు మొదలు పెట్టారు, దాని వల్ల నిజంగా ప్రయోజనం ఉందా మొదలైన ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు మాత్రం ఉండటం లేదు. అయితే ఆ నమ్మకాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దీని వల్ల ఉపయోగం మాట దేవుడెరుగు ఉపద్రవం ముంచుకువస్తుందని చెప్పినా కొంతమంది వినడం లేదు. అటువంటి ఆచారాన్ని అనుసరిస్తున్న ఓ క్షేత్రానికి సంబంధించిన వివరాలు మీ కోసం...

నగరాల, బాగల్ కోట

నగరాల, బాగల్ కోట

P.C: You Tube

నగరాల కర్నాటకలో బాగా వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచిన బాగల్ కోట జిల్లాలో ఉంది. జిల్లా కేంద్రమైన బాగల్ కోట నుంచి ఈ గ్రామానికి 35 కిలోమీటర్లు. అదే విధంగా సమీప పట్టణం బిలాగి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది.

నగరాల, బాగల్ కోట

నగరాల, బాగల్ కోట

P.C: You Tube
క`ష్ణా నది ఒడ్డున ఉన్న ఈ గ్రామంలో ప్రసిద్ధి చెందిన దిగంబరేశ్వర దేవాలయం, కప్పర పదియమ్మ దేవి గుట్ట ఉన్నాయి. ఇందులో దిగంబరేశ్వర మఠం వద్ద ఏడాదికి ఒకసారి పెద్ద ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవంలో జరిగే తంతు మనలను భయపెడుతుంది.

నగరాల, బాగల్ కోట

నగరాల, బాగల్ కోట

P.C: You Tube
ముఖ్యంగా చిన్నపిల్లల ఏడుపులతో ఆ ప్రాంతం మొత్తం దద్దరిల్లుతుంది. అయినా కూడా వారి తల్లిదండ్రులు మాత్రం ఆ విధంగా పిల్లలు ఏడిస్తేనే శుభం కలుగుతుందని నమ్ముతారు. అందువల్లే ఈ విషయం పై స్థానిక ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నించినా కూడా తల్లిదండ్రుల ఆలోచనా విధానాలను మాన్పించలేకపోతున్నాయి.

నగరాల, బాగల్ కోట

నగరాల, బాగల్ కోట

P.C: You Tube
ఈ విషయం పై చాలా మంది కోర్టులో కేసులు వేసినా ప్రయోజనం లేకుండా పోయింది. బాలల హక్కులకు భంగం కలుగుతుందని సామాజిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వైద్యులు ఇటువంటి చర్యల వల్ల పిల్లల్లో శారీరక, మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు.

నగరాల, బాగల్ కోట

నగరాల, బాగల్ కోట

P.C: You Tube
అయినా కూడా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఇంతకు అక్కడ ఏమి జరుగుతుందంటే ఏడాదికి ఒకసారి జరిగే ఉత్సవంలో భాగంగా 30 అడుగుల ఎత్తు నుంచి చిన్న పిల్లలను ఒక్కసారిగా కిందికి పడేస్తారు.

నగరాల, బాగల్ కోట

నగరాల, బాగల్ కోట

P.C: You Tube
కింద ఉన్నవారు ఓ రగ్గు సహాయంతో ఆ పిల్లలను పట్టుకొంటారు. కొంత ఏమరుపాటుగా ఉన్నా పిల్లల పరిస్థితి ఊహించడానికి కూడా వీలుకాదు. చాలా మంది ఈ తంతును చూడటానికే ఈ గ్రామానికి వస్తుంటారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X