Search
  • Follow NativePlanet
Share

ఐహోళే - రాతి శిల్పాల రమణీయత

43

ఐహోళే పర్యాటక ప్రదేశంలోని రాతి శిల్పాలు సామాన్యులను మరియు పురావస్తు శాస్త్రవేత్తలను కూడా అబ్బుర పరుస్తాయి. ఈ పట్టణంలో చాళుక్యులచే నిర్మించబడిన అనేక దేవాలయాలున్నాయి. వాస్తవానికి ఈ దేవాలయాలు చాళుక్యుల శిల్పకళా నైపుణ్యాలను చాటుతూంటాయి. ఐహోళే లోని ఈ దేవాలయాల కళా వైభవం చాళుక్య రాజులు కళల కొరకు చేసిన తీవ్రమైన కృషిని చాటుతాయి.    

ఐహోళే పట్టణ ఇతిహాస చరిత్ర

ఐహోళే పట్టణం చాళుక్యుల మొదటి రాజధానిగా ఉండేది. మలప్రభ నది ఒడ్డున గల ఈ పట్టణం అనేక ఇతిహాస చరిత్రలు కలిగి ఉంది. వాటిలో ఒకటి యుద్ధ బ్రాహ్మణ యోధుడు పరశురాముడు  ఈ ప్రాంతంలో నివసించాడనేది. పరశురాముడు తాను శత్రువులుగా భావించే ప్రధాన క్షత్రియ రాజులను వధించిన తర్వాత ఈ ప్రదేశానికి వచ్చి రక్తం ఓడుతున్న తన గొడ్డలి ఆయుధాన్ని మాలప్రభ నదిలో కడిగి శుభ్ర పరచుకుంటాడనేది ఒకటి. పరశురాముడు కడిగిన ఆ గండ్ర గొడ్డలికిగల రక్తం నది నీటిని సైతం ఎర్రగా మార్చేసినట్లు చెపుతారు. ఈ సందర్భంగానే ఈ ప్రదేశానికి ఐహోళే ...అంటే...ఆహా..ఏమి నది? అని అర్ధం వచ్చిందని చెపుతారు.

ఐహోళే దేనికి ప్రసిద్ధి? ఐహోళే ప్రాంతంలో షుమారుగా 125 చాళుక్య దేవాలయాలున్నాయి. వీటిలో లడ్ ఖాన్ దేవాలయం అతి ప్రాచీనమైనదని 5వ శతాబ్దానికి చెందిందని తెలుస్తోంది. ఈ ప్రదేశంలోని ప్రముఖ దేవాలయాలలో గౌడా దేవాలయం, సూర్యనారాయణ దేవాలయం, దుర్గ దేవాలయంలు ప్రసిద్ది. రావణ ఫాడి గుహ అతి ప్రాచీన కొండగుహ. ఐహోళే లో లభ్యమైన శాసనాలు చరిత్ర గతిని కూడా గుర్తించటానికి తోడ్పడ్డాయి. ఈ స్ధలం బెంగుళూరుకు 483 కిలోమీటర్ల దూరంలో ఉండి చక్కటి రోడ్డు మార్గం కూడా కలిగి ఉంది. దీనికి సమీప రైలు స్టేషన్ బాదామి.  

ఐహోళే ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఐహోళే వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఐహోళే

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఐహోళే

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం బాదామి, పట్టడకాల్, బెంగుళూరు మొదలైన నగరాలనుండి అనేక బస్సులు ఐహోళే పట్టణానికి నడుస్తాయి. ఎయిర్ కండిషన్ మరియు సాధారణ బస్సులు కూడా కలవు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం ఐహోళే పట్టణానికి రైలు స్టేషన్ లేదు. దీనికి సమీప రైలు స్టేషన్ బాగల్ కోట ఇది 34 కి.మీ.ల దూరంలో కలదు. ఈ రైలు స్టేషన్ నుండి దేశంలోని ప్రధాన నగరాలకు రైలు సదుపాయం కలదు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    ఐహోళే పట్టణానికి ఎలా చేరాలి? విమాన ప్రయాణం ఐహోళేకు సమీపంలో బెల్గాం విమానాశ్రయం కలదు. ఇది 162 కి.మీ.ల దూరం ఉంటుంది. ఇక్కడకు బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం 514 కి.మీ.ల దూరంలో కలదు. బెంగుళూరు విమానాశ్రయంనుండి ఐరోపా, ఆసియా, అమెరికా, మధ్య ప్రాచ్య దేశాలకు, దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విమానాలు ప్రయాణిస్తాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
17 Jun,Wed
Return On
18 Jun,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
17 Jun,Wed
Check Out
18 Jun,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
17 Jun,Wed
Return On
18 Jun,Thu