Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» డెష్నోక్

డెష్నోక్ - విశిష్ట పూజల గ్రామం

10

రాజస్ధాన్ లోని ఒంటెల దేశంగా పిలువబడే బికనీర్ జిల్లా లో డెష్నోక్ ఒక చిన్న గ్రామం. గతంలో దీనిని 'దస్ నోక్' అంటే 'పది మూలలు' అని పిలిచేవారు. అంటే ఈ గ్రామం పది చిన్నగ్రామాల మూలలనుండి భాగాలు తీసుకొని ఏర్పడింది. ఈ ప్రదేశం పాకిస్తాన్ సరిహద్దులో బికనీర్ కు సుమారు 30 కి.మీ. దూరంలో కలదు. డెష్నోక్ గ్రామం కర్ణి మాత దేవాలయానికి మరియు వివిధ పండుగలకు ప్రసిద్ధి చెందింది.

మతంలో ఎలుకలు కర్ణి మాత దేవాలయం పర్యాటకులకు అరుదైన ఆకర్షణా ప్రదేశం. ఈ పవిత్ర స్ధలంలో ఎలుకలు పూజించబడుతాయి. ఈ దేవాలయాన్ని ఎలుకల దేవాలయం అని కూడా అంటారు. హిందువుల దేవత దుర్గా మాత మరో అవతారంగా కర్ణి మాతను పూజిస్తారు. బికనీర్ పాలకులు చక్కవర్తి గంగా సింగ్ వంశస్ధులకు ఈ దేవత ఇంటి దేవత. గంగా సింగ్ ఈ దేవాలయాన్ని 20వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ దేవాలయంలో సుమారు 20,000 ఎలుకలు ' కాబాస్' అనే పేరుతో పూజించబడతాయి. దేవత యొక్క భవిష్యత పిల్లల ఆత్మలే ఈ ఎలుకలు అని స్ధానికులు భావిస్తారు. ఈ ఎలుకలను భక్తితో పూజిస్తారు.

అందమైన మార్బుల్ చెక్కడాలు దేవాలయ అందానికి మరింత మెరుగు దిద్దుతాయి. కర్ణి మాత జాతర సమయంలో అనేక మంది భక్తులు వస్తారు. ప్రతి ఏటా ఈ జాతర రెండు మార్లు అంటే మార్చి - ఏప్రిల్ మరియు సెప్టెంబర్ - అక్టోబర్ లలో జరుగుతుంది. డెష్నోక్ లో గంగౌర్ పండుగ కూడా ఒక ప్రత్యేకత. ఈ పండుగ మార్చి నెలలో మహిళలచే గౌరి మాత కు చేయబడుతుంది.

డెష్నోక్ చేరటం ఎలా? డెష్నోక్ విమాన, రైలు, రోడ్డు ప్రయాణాలలో తేలికగా చేరవచ్చు. డెష్నోక్కు జోధ్ పూర్ లో విమానాశ్రయం సమీపం. అంతర్జాతీయ విమానం అవసరం అనుకుంటే న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉపయోగించవచ్చు. ఇక్కడి నుండి కోల్ కటా, చెన్నై, బెంగళూరు, ముంబై వంటి ప్రధాన నగరాలకు ప్రతి రోజూ విమానాలు నడుస్తాయి. జోధ్ పూర్ రైలు స్టేషన్ నుండి కూడా చేరవచ్చు. జోధ్ పూర్ కు జైపూర్, చురు, ఢిల్లీ, కల్కా, హౌరా, భటిండా లనుండి తరచుగా రైళ్ళు కలవు. ఆగ్రా, ఢిల్లీ, అజ్మీర్, జోధ్ పూర్, అహ్మదాబాద్, జైపూర్, జైసల్మేర్ , ఝుంఝును, ఉదయపూర్, బర్మర్, కోట నగరాలనుండి ప్రతిరోజూ బస్సులు కలవు.

డెష్నోక్ వాతావరణం ఎలా? సంవత్సరం పొడవునా అన్ని కాలాలు అధికంగా ఉంటాయి. అయితే డెష్నోక్ సందర్శనకు నవంబర్ నుండి ఫిబ్రవరి అనుకూల నెలలు. డెష్నోక్ చేరాలంటే, విమాన, రైలు, రోడ్డు మార్గాలు కలవు.

 

 

డెష్నోక్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

డెష్నోక్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం డెష్నోక్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? డెష్నోక్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం బస్ ప్రయాణం చేయాలనుకునేవారు ముందుగా బికనీర్ చేరాలి. బికనీర్ నుండి డెష్నోక్ కు క్యాబ్ సౌకర్యం కలదు. బికనీర్ కు దేశంలోని వివిధ నగరాలనుండి ప్రభుత్వ మరియు ప్రయివేట్ వాహనాలు తరచుగా నడుస్తాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం డెష్నోక్ లో రైలు స్టేషన్ కలదు. ఇది జోధ్ పూర్ రైలు స్టేషన్ కు కలుపబడింది. ఇక్కడినుండి దేశంలోని ఇతర రైలు స్టేషన్లకు తరచుగా రైళ్ళు కలవు. అయితే, జోధ్ పూర్ రైలు స్టేషన్ నుండి పర్యాటకులకు క్యాబ్ లు సౌకర్యంగా ఉంటాయి. జోధ్ పూర్ రైలు స్టేషన్ దేశంలోని అనేక నగరాలకు కలుపబడింది.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం జోధ్ పూర్ విమానాశ్రయం డెష్నోక్ కు సమీప విమానాశ్రయం. విదేశీయులు ఇక్కడకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయం నుండి చేరవచ్చు. ఢిల్లీ విమానాశ్రయానికి కోల్ కటా, చెన్నై, బెంగళూరు, ముంబై లకు తరచుగా విమాన రాకపోకలు కలవు. జోధ్ పూర్ విమానాశ్రయం నుండి డెష్నోక్ కు టాక్సీలు సమంజస రేట్లలో దొరుకుతాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed