Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» ఫతేహాబాద్

ఫతేహాబాద్  – ఆర్యుల నాగరికత అడుగుజాడ !

భారతదేశంలోని హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లాలోని నగరం ఫతేహాబాద్. ఆర్యులు మొట్టమొదటగా సరస్వతి, ద్రిషద్వతి నదుల ఒడ్డున నివాసమేర్పరుచుకొని, మెల్లగా వారి స్థావరాన్ని హిసార్, ఫతేహాబాద్ లకు విస్తరించారని విశ్వసిస్తారు.

11

ఫతేహాబాద్ ప్రస్తావన పురాణాలలో కూడా ఉంది. దీని ప్రకారం ఇది నందుల సామ్రాజ్యంలో భాగం. ఫతేహాబాద్ లో అశోకుని స్థూపాలను కనుగొనడం కూడా ఇది మౌర్యుల సామ్రాజ్యంలో భాగమని తెలియజేస్తుంది. భారతదేశ పురావస్తు శాఖ వారి తవ్వకాలలో పురాతన భారతదేశ సంస్కృతి, వారసత్వానికి చెందిన ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి.

ఆధునిక ఫతేహాబాద్ పట్టణాన్ని14 శతాబ్దంలో ఫిరోజ్ షా తుగ్లక్ కనుగొన్నాడు. అతని కుమారుడు ఫతేహ్ ఖాన్ పేరును ఫతేహాబాద్ కు పెట్టాడు.

ఫతేహాబాద్ లోను చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు

హర్యానాలోని హన్సి లేదా అగ్రోహలో అశోక చక్రవర్తి కట్టిన లాట్ లేదా రాతి స్థూపంతో బాటుగా అనేక స్థలాలు, ఆకర్షణలు ఫతేహాబాద్ లో ఉన్నాయి. దీనికి సరైన పేరు అశోక చక్రవర్తి కీర్తి స్థూపం. అయితే, ఈ ఔన్నత్యమైన స్థూపాన్ని, ఫిరోజ్ షా తుగ్లక్ విడదీసి, వేరొక రాతి స్థూపాన్ని నిర్మించడానికి కింది భాగాన్ని ఫతేహాబాద్ కు తరలించాడు.

హుమాయున్ మసీదును పేరుకు తగినట్టుగానే మొఘల్ చక్రవర్తి హుమాయున్ నిర్మించాడు. చక్రవర్తి ఇక్కడ ప్రతి శుక్రవారం ప్రార్ధనలు చేసేవాడు. తర్వాతి కాలంలో ఆయనకు శ్రద్ధాంజలిగా ఇక్కడ ఒక మసీదును నిర్మించారు. ఈ మసీదు నిర్మాణ౦ మొఘలుల శైలిని పోలి ఉంటుంది. దీని నిర్మాణానికి 1526 నుండి 1556 వరకు మూడు దశాబ్దాల కాలం పట్టింది.

మీరు కునాల్ ను సందర్శించి, ఎండిపోయిన సరస్వతి నది ఒడ్డున ఉన్న చారిత్రిక మట్టిదిబ్బను చూడవచ్చు. ఇది హర్యానా రాస్త్రంలోని అతి పురాతన పురావస్తు ప్రదేశాలలో ఒకటి. కునాల్ వద్ద జరిపిన తవ్వకాలలో హరప్పా, పూర్వ–హరప్పాసంస్కృతికి చెందిన సమాచార సంపద వెల్లడి అయింది.

వనవాలిగా కూడా పిలిచే బనావలి, ఫతేహాబాద్ నగరానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక పురావస్తు మట్టి దిబ్బ. ఈ దిబ్బ 10 మీటర్ల ఎత్తుతో, సుమారు ఒక చదరపు మైలు విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. బనావలిలో జరిపిన తవ్వకాలలో క్రీ.పూ. 2800 – 2300, 2300-1800 మధ్య కాలంలో పూర్వ-హరప్పా, హరప్పా కాలానికి చెందిన అమూల్యమైన చారిత్రిక సమాచారం వెల్లడి అయింది.

ఫతేహాబాద్ సందర్శనకు ఉత్తమ సమయం వాతావరణం ఆహ్లాదకర౦గా ఉండే సెప్టెంబర్, నవంబర్ మధ్య కాలం ఫతేహాబాద్ సందర్శనకు ఉత్తమమైనది.

ఫతేహాబాద్ చేరడం ఎలా ఫతేహాబాద్, రాష్ట్రంలోని ప్రధాన నగరాలకు చక్కటి రైలు, రోడ్డు మార్గాలను కల్గి ఉంది.

ఫతేహాబాద్ లో వాతావరణం ఉత్తరాభారతదేశంలోని ఇతర పట్టణాలు, నగరాల వలె ఫతేహాబాద్ లో వేసవి, శీతాకాలం, వర్షాకాలం ఉంటాయి.

ఫతేహాబాద్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఫతేహాబాద్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఫతేహాబాద్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఫతేహాబాద్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డుమార్గం ద్వారా ఒక రోడ్డుల నెట్వర్క్ హర్యానాలోని అన్నినగరాలు, పట్టణాలు, గ్రామాలను ఈ నగరంతో కలుపుతుంది. 10 వ నంబరు జాతీయరహదారి ఫతేహాబాద్ ను ఢిల్లీ, పంజాబ్ లతో కలుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలుమార్గం ద్వారా బ్రాడ్ గేజ్ మార్గం ద్వారా ఢిల్లీ, సిర్స, పంజాబ్ లకు ఫతేహాబాద్ కలపబడింది. ఫతేహాబాద్ లోని రైలుస్టేషన్లు ఫతేహాబాద్ చంద్రవతి గంజ్ జంక్షన్
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమానమార్గం ద్వారా న్యూ ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అతి దగ్గరగా ఉంది. ఇక్కడ నుండి ఫతేహాబాద్ కు బస్సు లేదా ట్రైన్ ద్వారా చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
12 Mar,Thu
Check Out
13 Mar,Fri
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
12 Mar,Thu
Return On
13 Mar,Fri